"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బాల్క సుమన్

From tewiki
Jump to navigation Jump to search
బాల్క సుమన్
బాల్క సుమన్


పదవీ కాలము
2018 డిసెంబర్ 11 - ప్రస్తుతం
నియోజకవర్గము చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 18, 1983
రేగుంట, మెట్‌పల్లి మండలం, జగిత్యాల జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రాణి అలేఖ్య
మతం హిందూమతము

బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు, రాజకీయ నాయకుడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు.[1] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా గెలుపొందాడు. ఈ గెలుపు అనంతరం తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.

జననం

బాల్క సుమన్ 1983, అక్టోబరు 18న తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలంలోని రేగుంటలో జన్మించాడు.[2] సుమన్ తండ్రి బాల్క సురేష్ మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుండి కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించాడు.

విద్యాభ్యాసం

సుమన్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్యను చదివాడు. కోరుట్లలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్.డి. చేస్తున్నాడు.

వివాహం - పిల్లలు

సుమన్ వివాహం రాణి అలేఖ్యతో జరిగింది. వీరికి ఒక కుమారుడు (సుహన్).

రాజకీయ జీవితం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి)కు 2007లో అధ్యక్షులుగా పనిచేశాడు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి)కు 2010లో రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 మరియు 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా, 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా గెలుపొందాడు.

మూలాలు

  1. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014.
  2. "Telangana MP Balka Suman Profile Detailed Review". 19 May 2016.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).