"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బావికొండ

From tewiki
Jump to navigation Jump to search
  ?బావికొండ బౌద్ధవిహారము
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
బావికొండ గజవృష్టాకార స్థూపం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం విశాఖపట్నం
జిల్లా (లు) విశాఖపట్నం జిల్లా


బావికొండ బౌద్ధ సముదాయం (17 49 ఉ - 83 23 తూ) విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందినది.

దస్త్రం:Holy relic sites map of Andhra Pradesh.jpg
బావికొండ, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం

ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయల్పడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.[1]

బావికొండకు సమీపంలో మరో రెండు బౌద్ధ సముదాయాలున్నాయి. అవి తొట్లకొండ, పావురాలకొండ.

చిత్రమాలిక

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-09. Retrieved 2012-11-26.