"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బిందే అలీ సయ్యద్‌

From tewiki
Jump to navigation Jump to search
బిందే అలీ సయ్యద్‌ ........ రేడియో నాటికలతో బాటు గేయాలు వ్రాయడములోను, వాటిని పాడడము లోను ఖ్యాతి గాంచారు.

జీవన వ్యాసంగము

బిందే అలీ సయ్యద్‌... నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి తాలూకాలోని కుగ్రామంలో 1922 ప్రాంతంలో జన్మించారు. వీరు బి.ఎస్.ఎల్.లో ఉద్యోగించారు.

రచనా వ్యాసంగము

గ్రామాల్లో పొలాలకు వెళ్ళే పల్లె పడుచులు పాడుకునే పాటల పట్ల ఆకర్షితులై 5వ తరగతి నుండి పాటలల్లడం ఆరంభం అయ్యింది. విద్యార్థిగా వున్నప్పుడు ఉన్నతపాఠశాలలో గురువులు నేర్పిన చందస్సు ఆధారంతో పద్యాలు పాడుతూ సహవిద్యార్థుల అభినందనల ప్రోత్సాహంతో పలు పాటలు రాసి మనోహరంగా పాడటమేకాదు ఆ పాటలన్నిటిని కలిపి 'పల్లెపాటలు' పుస్తకాన్ని 'కేకలు' పత్రిక ఎడిటర్‌ బైసా రామదాసు సహకారంతో వెలువరించారు. ఆ తరువాత మరికొన్ని గేయాలతో 'కదలి రా' (గేయమాలిక) తెచ్చారు.

ప్రచురణలు

వివిధపత్రికలలో వివిధాంశాల మీద వ్యాసాలు, కవితలు, పాటలు, గేయాలు ప్రచురితమయ్యాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా, ఉద్యోగ సంఘం నేతగా ఆయన రాసిన నాటికలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి, ఉద్యోగ సంఘాలు చాలా నాటికలను ప్రదర్శించాయి. 1980లో పదవీవిరమణ చేశాక 'ప్రక్షాళన' ప్రబోధ గేయమాలికను తెచ్చారు. లక్ష్యం: సాహిత్యం ద్వారా వినోదం మాత్రమే కాకుండా వికాసం, విజ్ఞానాన్నిఅందించడం.

మూలాల జాబితా


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).