"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బికానెర్

From tewiki
Jump to navigation Jump to search
  ?బికానెర్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 28°01′00″N 73°18′43″E / 28.01667°N 73.31194°E / 28.01667; 73.31194Coordinates: 28°01′00″N 73°18′43″E / 28.01667°N 73.31194°E / 28.01667; 73.31194
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
270 కి.మీ² (104 sq mi)
• 242 మీ (794 అడుగులు)
జిల్లా (లు) బికానెర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
7,23,982 (2008 నాటికి)
• 1,960/కి.మీ² (5,076/చ.మై)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 3340XX
• ++91 151
• RJ-07

బికానెర్‌ (ఆంగ్లం: Bikaner) అనేది ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. బికానెర్‌ జిల్లా, బికానెర్‌ డివిజన్‌లకు ఈ నగరం పరిపాలన సంబంధిత ప్రధాన కేంద్రం. పూర్వం ఇది బికానెర్ ప్రిన్సియలీ స్టేట్‌కు రాజధాని నగరం. రావ్ బికా, జాట్‌ల[1] ద్వారా ఈ నగరం వెలుగులోకి వచ్చింది. నెహ్రా జాట్‌కు జన్మహక్కుగా ఉన్న ఈ ప్రదేశాన్ని తన రాజధాని కోసం రావ్ బికా ఎంపిక చేశారు. అప్పుడు ఈ ప్రాంతానికి సొంతదారైన నెహ్రా జాట్ తన పేరును ఈ నగరానికి శాశ్వతంగా ఉంచాలనే నిబంధన విధించి రావ్ బికాకు దాన్ని సొంతం చేశాడు. ఈ ప్రాంత సొంతదారుడి పేరైన నైరా లేదా నేరాను రావ్ బికా తన పేరుకు జోడించి ఆ రెండు పేర్ల కలయికతో తాను నిర్మించిన రాజధాని నగరానికి బికానెర్ అని నామకరణం చేశాడు.[2][3][4] అలా 1486లో చిన్న మూలాలతో ప్రారంభమైన ఈ నగరం అటుపై రాజస్థాన్‌లో నాల్గవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. 1928లో గంగా కాల్వ, 1987లో ఇందిరా గాంధీ కాల్వ పూర్తి కావడంతో ఈ ప్రాంతంలో ఆవాలు, పత్తి, వేరుశెనగ, గోధుమ, కూరగాయలు లాంటి పంటలను సాగుచేసేందుకు అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఉన్ని ఉత్పత్తితో పాటు జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, బెంటోనైట్ గనుల తవ్వకం లాంటి పరిశ్రమలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందాయి.

మిఠాయిలు, స్నాక్స్ (లేదా హిందీలో నమ్కీన్స్) లకు బికానెర్ ప్రసిద్ధి.

చరిత్ర

15వ శతాబ్దం మధ్యకాల పాలనకు ముందు వరకు బంజరు అటవీభూమి రూపంలోనే ఉండిపోవడం వల్ల బికానెర్ ప్రాంతాన్ని "జంగ్లాదేశ్" అని పిలిచేవారు.[5] జాట్లుకు సంబంధించిన జాట్ రాజవంశం పరిపాలన సందర్భంగా ఈ రాజ్యం సరిహద్దులను సంతరించుకుంది :[1] ఈశాన్య మరియు వాయువ్య రాజస్థాన్‌ ప్రాంతమైన ఇది జంగ్లాదేశ్ పేరుతో మహాభారత కాలం నాటి నుంచి వెలుగులో ఉంది. జాట్ తెగలకు ఆలవాలమైన ఈ ప్రాతం, అప్పట్లో ఆ తెగకు చెందిన సొంత నాయకుల ద్వారా పరిపాలించబడేది. జాట్ తెగకు సంబంధించిన సొంత ఆచారాలతో ముడిపడిన చట్టాల ద్వారా వారు పాలన సాగించేవారు.[6] ఢిల్లీలో ఉండే సుల్తాన్ చక్రవర్తుల ఆధిపత్యం నామమాత్రంగానే ఉండడం వల్ల ఆరోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించే జాట్ నాయకులు ఎక్కువ మొత్తంలో స్వయం ప్రతిపత్తిని అనుభవించేవారు.

ఈ మొత్తం ప్రాంతం అప్పట్లో సిహాగ్, పునియా, గోడారా, సరాన్, బెనివాల్, జోహియా[7], కస్వాన్ పేర్లతో ఆరు లేదా ఏడు జాట్ పాలిత ప్రాంతాలుగా ఉండేది[8]. మరోపక్క ఈ ప్రాంతాల్లో జాట్లుకు సంబంధించిన అనేక ఉప-కులాలు ఉనికిలో ఉండేవి. అదేసమయంలో రాజపుత్ర యజమానుల నుంచి బలవంతంగా లాక్కున్న బగోర్, ఖరిపట్ట, మొహిల లేదా మెహిలా, [7] భుకార్, భదు, చహార్ లాంటి ప్రాంతాలు కూడా ఈ జాట్ల ఆధీనంలో ఉండేవి.[9] బికానెర్ రాష్ట్ర చరిత్ర, పరిశోధకుల వివరాల ప్రకారం, తమ ఏడు సంస్థానాలతో పాటు ఈ ప్రాంతం సైతం జాట్లు ద్వారా ఆక్రమించుకోబడింది. జాట్ సంస్థానాలైన సాత్ పట్టి సత్తావన్ మజ్ (ఏడు పెద్ద మరియు యాభై ఏడు చిన్న సంస్థానాలు అని అర్థం) గురించి ఇది చెబుతుంది.[10][11]

1472లో బైకానెర్ నగరాన్ని రావ్ బికా స్థాపించాడు. జోధ్‌పూర్ నగర స్థాపకుడు, రాథోర్ వంశీయుడు అయిన మహారాజా రావ్ జోధ‌కు రావ్ బికా రెండవ కుమారుడు. రావ్ జోధ తన రాజ్యాన్ని ఏర్పరచడం కోసం రాజస్థాన్ ఉత్తర ప్రాంతం వరకు ఉన్న బీడు భూములను ఆక్రమించుకున్నాడు. మరోవైపు జోధకు రెండవ కుమారుడు కావడంతో జోధ్‌పూర్ భూభాగాన్ని, మహారాజా అనే గౌరవాన్ని వంశపారంపర్యంగా అందుకునే అవకాశం రావ్ బికాకు లేకుండా పోయింది. అయినప్పటికీ, సొంత రాజ్యం ఏర్పరచి తీరాలని నిర్ణయించుకున్న రావ్ బికా, గతంలో "జుంగ్లాదేశ్‌"గా పిలవబడిన బికానెర్ వద్ద తన రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. బికానెర్ అనేది థార్ ఎడారిలో ఉన్న ఎడారి ప్రాంతం అయినప్పటికీ, సరిపడినంత నీటి వనరులను గుర్తించినప్పటి నుంచి మధ్య ఆసియా, గుజరాత్‌ సముద్ర తీరానికి మధ్య జరిగే వాణిజ్య సంబంధిత రాకపోకలకు ఈ ప్రాంతం ఒయాసిస్‌గా భావించబడింది. ఈ నగరాన్ని బికా స్థాపించిన కారణంగా బికానెర్ నగరానికి అలాగే గతంలోని బికానెర్ రాజ్యానికి ("బికా ఒప్పందం వల్ల") ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. 1478లో బికా నిర్మించిన కోట నేటికీ ఉపయోగంలో ఉంది. అలాగే 100 సంవత్సరాల తర్వాత నగర కేంద్రానికి దాదాపు 1.5 కి.మీ దూరంలో జునాగఢ్ కోట పేరుతో సుపరిచితమైన మరో కొత్త కోటను నిర్మించడం జరిగింది. ఆ విధంగా బికానెర్ చరిత్ర, కోట రెండూ కూడా బికాతోనే ప్రారంభమైనాయి.[12][13][14]

బికా తర్వాత మరో 100ఏళ్లకు, 1571 నుంచి 1611 వరకు ఆరవ రాజు హోదాలో బికానెర్‌ను పాలించిన రాజా రాయ్ సింగ్‌జీ హయాంలో బికానెర్ కీర్తిప్రతిష్ఠలు మరోసారి సుసంపన్నమైనాయి. మొఘల్ సామ్రాజ్యం పాలన ఈ దేశంలో ప్రారంభమైన సమయంలో మొఘల్ చక్రవర్తి సర్వాధికారాన్ని ఆమోదించిన రాజా రాయ్ సింగ్‌జీ, అక్బర్, ఆయన కుమారుడైన జహంగీర్ చక్రవర్తి పాలనా కాలంలో సైనిక జనరల్ హోదాలో ఉన్నత పదవిని సంపాదించుకున్నారు. మరోవైపు మేవార్ రాజ్యంలో సగభాగాన్ని జయించి పెట్టిన యుద్ధాన్ని విజయవంతగా నిర్వహించిన కారణంగా మొఘల్ చక్రవర్తుల నుంచి ఆయన అనేక ప్రశంసలు, బహుమతులు అందుకున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు గుజరాత్, బురహన్‌పూర్‌లలో జాగీర్‌లు (భూములు) లభించాయి. ఈ జాగీర్ల నుంచి అత్యధిక పన్నులు లభించడంతో ఒక సాధారణమైన ప్రాంతంలో ఆయన జునాగఢ్ కోటను నిర్మించగలిగారు760 అడుగులు (230 మీ.). కళలు, వాస్తు నిర్మాణంలో ఆయన నిపుణుడు కావడంతో పాటు, అనేక దేశాలను సందర్శించిన సమయంలో అక్కడి అనేక స్మారక నిర్మాణాలు ఆయనపై ప్రభావం చూపడంతో అద్భుతమైన రీతిలో ఆయన జునాగఢ్ కోటను నిర్మించారు.[12][14][15]

రాజా కరణ్ సింగ్ ఔరంగజేబ్ మిత్రుడు శతృవు కూడా

ఇక 1631 నుండి 1639 వరకు మొఘల్ సార్వభౌమాదిపత్యం కింద పాలన సాగించిన కరన్ సింగ్ ఇక్కడ కరన్ మహల్ ప్యాలెస్‌ను నిర్మించాడు. ఆయన తర్వాత పాలన సాగించిన రాజులు సైతం ఈ మహల్‌కు మరిన్ని అంతస్తులను, సొబగులను సమకూర్చారు. 1669–98 మధ్య కాలంలో బికానెర్‌ను పాలించిన అనూప్ సింగ్, కొత్త ప్యాలెస్‌లు, జెననా గదులు (స్త్రీల కోసం రాచరిక భవనాలు) నిర్మించడం ద్వారా కోట ప్రాంగణానికి మరిన్ని కొత్త హంగులు చేకూర్చాడు. దీంతోపాటు దివాన్-ఐ-ఆమ్ (బహిరంగ ప్రేక్షక మందిరం) నిర్మించడం ద్వారా, కరన్ మహల్‌కు ఆయన కొత్త రూపాన్ని అందించారు. ఈ మందిరాన్ని అనూప్ మహల్ పేరుతో పిలుస్తారు. అటుపై 1746 నుంచి 1787 వరకు పాలించిన గజ్ సింగ్, చంద్ర మహల్ (చంద్రుని ప్యాలెస్) పేరుతో మరో కొత్త భవనాన్ని నిర్మించాడు. ఈయన తర్వాత 1787 నుంచి 1828 వరకు పాలించిన సూరత్ సింగ్, ప్రేక్షక మందిరాన్ని (సమాచార పెట్టెలోని చిత్రాన్ని చూడండి) అద్దం, ఆహ్లాదకరమైన వర్ణ చిత్రాలతో సుందరంగా ముస్తాబు చేశాడు. 1872 నుంచి 1887 వరకు పాలించిన దుంగార్ సింగ్, బదల్ మహల్ (వాతావరణ ప్యాలెస్) పేరుతో వర్షం కురుస్తున్న, మేఘాలు అలుముకున్న రూపంలో (బికానెర్ లాంటి ఎడారి ప్రాంతంలో ఇలాంటి అనుభవం అరుదైన సంఘటన) ఉన్న దృశ్యం కనిపించేలా ఒక భవనాన్ని నిర్మించాడు. 1887 నుంచి 1943 వరకు పాలించిన గంగా సింగ్, గంగా నివాస్ ప్యాలెస్ నిర్మించాడు. ఈ భవనం ప్రవేశ ద్వారంపైన గోపురాలు నిర్మించబడ్డాయి. సర్ శ్యామూల్ స్విన్టన్ జాకబ్ ద్వారా ఈ భవనం రూపకల్పన చేయబడింది.[16] మరోవైపు గంగా సింగ్ కుమారుడు సదుల్ సింగ్ 1943లో తన తండ్రి వద్ద నుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, 1949లో ఆయన తన రాజ్యాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేశారు. అటుపై ఆయన 1950లో మరణించారు.[13]

బికానెర్ పాలకులు తమ జునాగఢ్ కోట ఆధునీకరణ కోసం విపరీతంగా ఖర్చుపెట్టడంతో, 1818లో జరిగిన సౌరభౌమాధిపత్యం ఒప్పందం కింద బికానెర్ రాజ్యం బ్రిటీష్ రాజ్ పాలన కిందకు వెళ్లిపోయింది.[17] ఈ ఒప్పందం అమలులోకి రావడానికి ముందు అంటే, 18వ శతాబ్దంలో బికానెర్, జోధ్‌పూర్‌లతో పాటు ఇతర థాకూర్లు మధ్య భయంకరమైన యుద్ధం చోటు చేసుకున్నప్పటికీ, బ్రిటీష్ సైనికుల ద్వారా ఆ యుద్ధం అణిచివేయబడింది.[14]

Left: Lalgarh palace built (Indo-Saracenic style) by Ganga Singh in the name of his father, presently a heritage hotel and also residence of the Royal family. Right: Ganga Singh as member of the Imperial War Cabinet

రాజస్థాన్ ప్రాంతంలోని రాజులందరిలోకి బాగా సుపరిచితుడైన గంగా సింగ్, బ్రిటీష్ రాజ్‌కి ఇష్టుడైన వ్యక్తిగా కొనసాగాడు. ఈ కారణంగానే బ్రిటీష్ వారి నుంచి ఆయన భాతదేశ నక్షత్ర యోధుడైన కమాండర్ అనే బిరుదును కూడా సాధించాడు. ఇంపీరియల్ వార్ క్యాబినెట్ సభ్యుడిగా పనిచేసిన ఆయన, వెర్సైల్స్ శాంతి సదస్సులో ఇంపీరియల్ (మొదటి ప్రపంచ యుద్ధ సదస్సులు) మరియు బ్రిటీష్ సామ్రాజ్యం తరపున ప్రాతినిధ్యం వహించారు. అలాగే, రెండో ప్రంపచ యుద్ధంలో చోటు చేసుకున్న సంపద బదిలీ గురించి కూడా ఆయనకు తెలుసు. అయితే, తన మిత్ర రాజ్యాలు ఆ యుద్ధంలో విజయం సాధించడానికి ముందుగానే అంటే, 1943లో ఆయన మృతి చెందారు. ప్రజా, ప్రైవేటు ప్రేక్షకుల కోసం గంగా మహల్‌లో ప్రత్యేకమైన మందిరాలను నిర్మించడంతో పాటు, అధికారిక కార్యక్రమాల కోసం ఒక దర్బార్ మందిరాన్ని నిర్మించడం ద్వారా ఆయన జునాగఢ్ కోటకు అదనపు హంగులు కల్పించడంలో తనవంతు పాత్ర పోషించాడు. బికానెర్ పాలకుడిగా ఆయన 50వ వార్షికోత్సవానికి వేదికైన ఈ మందిరం ప్రస్తుతం మ్యూజియంగా కొనసాగుతోంది. ఇది మాత్రమే కాకుండా, ఉత్తర జునాగఢ్ పేరుతో స్విన్టన్ రూపకల్పన చేసి నిర్మించిన మరో కొత్త ప్యాలెస్‌ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. బికానెర్‌లో నిర్మించిన కొత్త ప్యాలెస్‌లలో మూడవదిగా నిర్మితమైన ఈ ప్యాలెస్‌కు తన తండ్రి పేరు మీదుగా లాల్‌గఢ్ ప్యాలెస్ అని నామకరణం చేయడంతో పాటు 1902లో జునాగఢ్ కోట నుంచి తన నివాసాన్ని ఆయన ఈ ప్యాలెస్‌కు మార్పు చేశారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ను వారసత్వ హోటల్‌గా మార్పు చేసినప్పటికీ, రాజ కుటుంబం మాత్రం నేటికీ ఈ ప్యాలెస్‌లోని ప్రత్యేకమైన గదిలో నివశిస్తోంది.[14][17]

భౌగోళిక స్వరూపం

రాజస్థాన్‌లోని బికానెర్‌లో ఉన్న ఇసుక మేటలు

రవాణ వ్యవస్థ

బికానెర్‌లోని అంతర్గత రవాణా వ్యవస్థ ఆటోరిక్షాలు, సిటీ బస్సులపై ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు బ్రాడ్ గేజ్ రైల్వే ద్వార్వా భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాలతో బికానెర్ సంబంధాలను కలిగి ఉంది. ఢిల్లీ, ముంబాయి‌, కాన్పూర్‌, ఆగ్రా, జలంధర్‌, బరోడా, హైదరాబాద్‌, కోల్‌కతా, గౌహతీ, జైపూర్‌, సూరత్‌, జలంధర్‌, తిరువనంతపురం, చండీఘర్‌, జమ్మూ, అహ్మదాబాద్‌ లాంటి నగరాలన్నింటీకి బికానెర్ నుంచి నేరుగా రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఇండోర్‌, భోపాల్‌, గాల్వియర్‌, జబల్‌పూర్, గోరఖ్‌పూర్‌, పూరీ లాంటి ఇతర భారతదేశ నగరాలకు మాత్రం బికానెర్ నుంచి రైలు మార్గం సౌకర్యం అందుబాటులో లేదు. బికానెర్‌ వ్యాప్తంగా చక్కని రోడ్డు మార్గాలు అందుబాటులో ఉండడంతో పాటు ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, లూథియానా, బటిండా, అంబాలా, అహ్మదాబాద్, హరిద్వార్, జోధ్‌పూర్, ఇండోర్‌లతో సహా ఇతర ప్రధాన నగరాలన్నింటికీ ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాలున్నాయి. 11,15,89 నంబరు జాతీయ రహాదారులు బికానెర్ వద్ద కలుస్తాయి. నల్‌ వద్ద సకల సౌకర్యాలతో కూడిన సైనిక విమానాశ్రయాన్ని కలిగిన బికానెర్‌కు, భవిష్యత్‌లో ప్రయాణీకుల విమానాశ్రయం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

వాతావరణం

థార్ ఎడారి మధ్యలో కొలువై ఉన్న బికానెర్‌లో వర్షపాతం చాలా తక్కువ, ఉష్ణోగ్రత మాత్రం చాలా ఎక్కువ. వేసవికాలంలో 50 °C కంటే, ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, చలికాలంలో ఉష్ణోగ్రతలు దాదాపు నీరు గడ్డకట్టే స్థాయికి తగ్గిపోతాయి.

బికానెర్‌లో వివిధ కాలాల్లో వాతావరణ పరిస్థితుల మధ్య విపరీతమైన వ్యత్యాసాలుంటాయి. వేసవి కాలంలో విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా వాతావరణం విపరీతమైన వేడిగా ఉంటంది28–41.8 °C (82.4–107.2 °F). ఇక చలికాలంలో, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు కావడం వల్ల వాతావరణం అత్యంత చలితో నిండి ఉంటంది5–23.2 °C (41.0–73.8 °F).[18] వార్షిక వర్షపాతం కూడా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది 260–440 milliమీటర్లు (10–17 in).[18][19]

కళలు & సంస్కృతి

బికానెర్ రాజవంశ పతాకం

బికానెర్ కింది వాటికి ప్రసిద్ధి-:

1) ఒంటె పరిశోధన క్షేత్రము (NRCC) 2) "బికానెరి భుజియా. 3) ఉన్ని ఉత్పత్తి. 4) మిఠాయిలు.

బికానెరి భుజియా అనేది ఒక ఘాటైన తినుబండారం. పెసలపప్పు, మసాలా దినుసులు, వంట నూనెలతో ఇది తయారవుతుంది. బికానెర్ నగరం హస్తకళలు, తోలు వస్తువులు, రాజ భవంతులకు మిక్కిలి ప్రసిద్ధి. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఫాం కూడా బికానెర్ సొంతం.

అత్యంత క్లిష్టమైన రీతిలో చెక్కిన ఝరోకాలకు సైతం బికానెర్ నగరం ప్రసిద్ధి. ఈ రకమైన ఎర్రటి ఇసుకరాతి రాళ్ల జాలీలు (తెరలు)జునగావ్ కోట,దేవాలయాలు,హవేలీ(ఉత్తర భారతదేశ భవనాలు)లలో కనుగొనబడ్డాయి. గాలీ వెలుతురు రావడం కోసం, రాణీవాసపు స్త్రీలు చాటుగా ఉండి బయటి ప్రపంచాన్నిచూడడం కోసం జాలీలు ఉపయోగపడేవి.

ఈ రకమైన రాతి నిర్మాణ కిటకీ తెరల కోసం ఉపయోగించిన ఇసుకరాళ్లు దగ్గర్లోని దుల్మేరా గ్రామం నుంచి సరఫరా చేయబడ్డాయి.

ఉస్తా కళ

ఉస్తా కళకు బికానెర్ కేంద్రం. మనోటి-నఖ్వాషీ(గుబకలు కలిగిన, గుబకలు లేని పుష్పసంబంధమైన, రేఖాగణిత రూపంలో ఉండే ఈ నిర్మాణాలు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి)కి సాధారణ పదబంధమైన ఈ మాధ్యమం , బికానెర్‌కు చెందిన ఉస్తా కుటుంబ హస్త నిపుణుల ద్వారా ఉత్పత్తి చేయబడింది. పారదర్శ, అపారదర్శక కూరగాయలు, ఖనిజాల కలిసిన నీటితో తయారు చేసిన రంగులను ఉపయోగించి తయారుచేసే బికానెర్ స్కూల్ “సూక్ష్మ” వర్ణ చిత్రాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను సైతం 16వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం వరకు ఉస్తా కళాకారులు, హస్తకళా నిపుణులు నియత్రించేవారు. హమీద్ రుక్న్-ఉద్-దిన్, అహ్మద్, నాథు జీ, నురే, రహీమ్, ఇసా, ఇసో, సహాబ్-ఉద్-దిన్, రహీమ్ జీ, మురాద్ లాంటి వారంతా బికానెర్ పాఠశాల‌కి చెందిన ప్రసిద్ధ చిత్రకారులు.

ఉత్సవాలు మరియు పండుగలు

 • కర్ని మాత ఉత్సవం
 • గంగౌర్
 • కపిల్ ముని ఉత్సవం
 • ఒంటె పండుగ: ప్రతి జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటెల పరుగు పందేలతో ఒంటె పండుగ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సిధ్‌ ప్రజల ద్వారా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అగ్ని నృత్యం నిర్వహిచబడుతుంది.
 • అక్షయ తృతియ లేదా "అఖ్కా తీజ్": బికానెర్ నిర్మాణానికి పునాది వేసిన రోజు. ఒకప్పుడు ఈ రోజున రావ్ బైకా కొత్త రాజ్య నిర్మాణానికి పునాది వేశారు. ప్రతి ఏడాది ఈ రోజున బికానెర్‌ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గాలిపటాలు లేదా "చందా"లను ఎగురవేయడం ద్వారా ఆనందంలో మునిగి తేలుతారు. దీంతోపాటు, "కిచ్రా,ఇమ్లానీ" లాంటి ప్రత్యేక భోజనం తీసుకోవడం ద్వారా వారు ఉల్లాసంగా గడుపుతారు.
 • పర్యూషన్: ఇది జైన వర్గీయులకు సంబంధించిన అతిపెద్ద పండుగ. హిందూ క్యాలెండర్‌లో వచ్చే బాధ్రపద మాసంలో జైనులు ఈ పండుగను అత్యంత ఉత్సాహంతోను, అంకితభావంతోనూ జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేవాలయాలను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తారు. నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉపవాసాలు లాంటివి జరుగుతాయి.
 • కార్తీక పూర్ణిమ: ఈరోజున జైన వర్గీయులు చిత్రపటాలు, తీర్థంకరుడి పల్లకీ, సంగీత కచేరీలతో ఒక పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. జైనులు నివసించే అన్ని ప్రాంతాల్లోకి ఈ ఊరేగింపు తరలివెళ్తుంది. ఈ ఉత్సవం సందర్భంగా స్థానిక భజన మండలి లేదా ఆధ్యాత్మిక బృందాల వారు పెద్ద ఎత్తున సంగీత కచేరీలు నిర్వహిస్తారు. భారతదేశం మొత్తం మీద ఈ పండుగ ఒకే రంగా ఉండదు.

బికానెర్, సమీప ప్రాంతాల్లోని ఆకర్షణీయ ప్రదేశాలు

జునాగఢ్ కోట, బికానెర్, రాజస్థాన్, భారతదేశం

జునాగఢ్ కోట

1571 నుంచి 1612 వరకు బికానెర్ రాజ్యాన్ని పాలించిన ఆరవ రాజైన రాజా రాయ్ సింగ్ చేతుల మీదుగా ఈ కోట నిర్మితమైంది. మార్వార్‌ రాజ్యంలోను రాయ్ సింగ్ భాగం కలిగి ఉండేవారు. అలాగే, సైనిక కమాండర్‌గా రాయ్ అందించిన సేవలకు గాను మొఘల్ చక్రవర్తి అక్బర్ గుజరాత్, బురహన్‌పూర్ ప్రాంతాలను కూడా ఆయనకి బహుమతిగా ఇచ్చాడు. ఈ రాజ్యాల నుంచి అలాగే జోధ్‌పూర్ నుంచి వచ్చిన నిధులతో రాయ్ ఈ కోటను నిర్మించాడు. మరోవైపు అక్బర్, జహంగీర్‌ దర్బారుల్లో రాయ్ సింగ్ ఉన్నతమైన పదవులను నిర్వహించాడు. ఈ రకమైన ఉన్నత పదవులు నిర్వహించిన సందర్భంగా రాయ్ సింగ్ విస్తృతంగా ప్రయాణాలు నిర్వహించేవారు. దీంతో మొఘల్ కాలం నాటి కళలు, వాస్తు నిర్మాణాలపై ఆయనకు మక్కువ కలిగింది. ఈ కారణంగానే, రాయ్ సింగ్ నిర్మించిన జునాగఢ్ కోట నిర్మాణంలో మొఘల్ చిత్రకళ శైలి కలగలసి ఉంటుంది.

లక్ష్మీ నివాస్ ప్యాలెస్

లక్ష్మీ నివాస్ ప్యాలెస్

లక్ష్మీ నివాస్ ప్యాలెస్ అనేది భారతదేశ రాష్ట్రమైన రాజస్థాన్‌లో కొలువుదీరిన బికానెర్‌లో పూర్వం విలసిల్లిన బికానెర్‌ రాజ్యానికి రాజు అయిన మహారాజా గంగా సింగ్‌కు అధికారిక నివాస ప్యాలెస్. 1902లో బ్రిటీష్ వాస్తుశిల్పి, శ్యామూల్ స్విన్‌టన్ జాకబ్‌ ఈ కోటకు రూపకల్పన చేశారు. ఈ ప్యాలెస్ నిర్మాణంలో ఇండో-సరాసెనిక్ శైలి వాస్తుకళ గోచరిస్తుంది. గోల్డెన్ ట్రయాంగల్ ఫోర్ట్ & ప్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ప్రస్తుతం ఈ ప్యాలెస్ ఒక విలాసవంతమైన హోటల్‌గా కొనసాగుతోంది. ఎర్రటి ఇసుకరాతితో నిర్మించిన ఈ వైభవోపేతమైన నిర్మాణం బికానెర్‌ను సందర్శించే పర్యాటకులకు ఆకర్షణీయమైన ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం.[20]

లాల్‌గఢ్ ప్యాలెస్

లాల్‌గఢ్ ప్యాలెస్

రాజపుత్ర, మొఘల్, యురోపియన్ వాస్తునిర్మాణ శైలి ప్రకారం, 1902 నుండి 1926 మధ్య కాలంలో లాల్‌గఢ్ ప్యాలెస్ నిర్మితమైంది. తన తండ్రి మహారాజా లాల్ సింగ్ జ్ఞాపకార్థం మహారాజా గంగా సింగ్ (1889-1925) ఈ భవనాన్ని నిర్మించాడు. బ్రిటీష్ వాస్తుశిల్పి సర్ స్విన్‌టన్ జాకబ్ ఈ భవనానికి రూపకల్పన చేశాడు. ఎర్రటి ఇసుకరాతితో నిర్మించబడిన ఈ భవనంలో అనేక విశాలమైన గదులు, విశ్రాంతి మందిరాలు, గోరీలు, క్రీడా వేదికలు ఉన్నాయి. వైభవోపేతమైన స్తంభాలు, విశాలమైన నిప్పు గూళ్లు, ఇటాలియన్ కొలన్నడేలు, లాట్టిక్ వర్క్, పిలిగ్రీ వర్క్ లాంటివి ఈ భవనంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ప్యాలెస్ హౌసెస్, శ్రీ సాధుల్ మ్యూజియంలతో పాటు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద గ్రంథాలయం ఇక్కడ కొలువై ఉన్నాయి. బికానెర్ రాజవంశం నేటికీ ఇందులో నివాశముంటున్నప్పటికీ, ఈ భవనంలోని కొంత భాగాన్ని వారసత్వ హోటల్‌గా మార్పుచేయబడి బికానెర్ రాజ వంశీయుల ద్వారా నడపబడుతోంది.[citation needed]

మూల్‌నాయక్‌జీ

1486లో నిర్మితమైన మూల్‌నాయక్‌జీ, బికానెర్‌లో నిర్మితమైన మొట్టమొదటి వైష్ణవ దేవాలయం. వైష్ణవ వర్గీయులకు ఇదొక అతిముఖ్యమైన ప్రదేశం. బికానెర్ శ్రీ రట్టోజి వ్యాస్ వంశస్థుడైన రట్టని వ్యాస్ యొక్క భగవద్ కథ మొదటి భగవద్ ఉపదేశం మహారాజైన రావ్ బికా, ఆయన సహాయకుడు సల్లోజి రతిలకు ఇవ్వబడింది. ఈ సాంప్రదాయం నేటికీ ఆచరించబడుతోంది. మూల్‌నాయక్‌ క్రిష్ణ ఈ దేవాలయంలోని ప్రధాన దైవం.

భందసర్ జైన్ దేవాలయం

లక్ష్మీ నాథ్ దేవాలయం

బికానెర్‌లోని అతిపురాతన ఆలయాల్లో లక్ష్మీ నాథ్ దేవాలయం కూడా ఒకటి. 1488లో నగర నిర్మాణానికి సంబంధించిన పునాదిని రావ్ బికాజీ ఇక్కడే వేశారు. రావ్ లుంకరన్ పాలనా కాలంలో ప్రారంభమైన ఈ దేవాలయం నిర్మాణం, మహారాజా గంగా సింగ్ పాలనా కాలం వరకు కొనసాగింది.

భందాసర్ జైన్ దేవాలయం

బికానెర్ నగర వ్యాప్తంగా 27 అందమైన జైన దేవాలయాలు నెలకొని ఉండగా, బంధాసర్ దేవాలయం మాత్రం 5వ తీర్థంకరుడు సుమతీనాథ్‌కు అంకితం చేయబడింది.అత్యంత అందమైన, ఎత్తైన నిర్మాణంగా ఇది ప్రశంసలు అందుకుంటోంది. జైన వ్యాపారి అయిన బంధా షా ద్వారా ఈ దేవాలయం నిర్మితమైంది. ఈ దేవాలయానికి సంబంధించిన పునాదులను స్వచ్ఛమైన నెయ్యి, ఎండు కొబ్బరితో నింపారు.

ఈ దేవాలయం ప్రధానంగా కుడ్య చిత్రాలు, ఉస్తా కళకు ప్రసిద్ధి. ఎర్రటి ఇసుకరాతితో నిర్మితమైన ఈ దేవాలయం మూడు అంతస్తులుగా విభజింపబడింది. ఈ దేవాలయంలోని చివరి అంతస్తును చేరుకున్న వారు అక్కడి నుంచి మొత్తం బికానెర్ నగరాన్ని వీక్షించవచ్చు.

కోలయట్‌

కోలయట్ అనేది దేవాలయాన్ని కలిగిన ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. భక్తుల కోసం కొలను పక్కన ధ్యాన ముద్రలో కొలువుదీరిన కపిల దేవుని కోసం ఈ దేవాలయం నిర్మితమైంది. సాధువులుని పెద్ద సంఖ్యలో చూడాలని మీరు భావిస్తే, పుష్కర్ పండగకు ఒక వారం ముందు నుంచి అటుపై వారం రోజుల వరకు ఈ కొలను ప్రదేశం మీకు చక్కని ఆకర్షణీయమైన ప్రదేశంగా గోచరించగలదు. పుష్కర్ కొంతమంది సాధువులకు మాత్రమే కేంద్రం కావచ్చు గానీ, కోలయట్ మాత్రం అనేకమంది సాధువులకు కేంద్రంగా ఉంటుంది.

కర్ని మాత దేవాలయం

బికానెర్‌కు దక్షిణంగా 30 కి.మీ దూరంలో జోధ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో దేశ్‌నోక్ పట్టణంలో ప్రపంచ ప్రసిద్ధ కర్ని మాత పుణ్యక్షేత్రంను దర్శించవచ్చు. కర్ని మాతను భక్తులు దుర్గ అవతారంగా భావించి పూజలు చేస్తుంటారు.

ఎలుకలకు ప్రసిద్ధమైన ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా ఎలుకలు తిరుగాడుతుంటాయి.

శివ బారి దేవాలయం

ఎర్రటి ఇసుకరాతితో నిర్మితమైన ఈ దేవాలయం దుంగార్ సింగ్ ద్వారా 19వ శతాబ్దం చివర్లో నిర్మతమైంది. ఈ దేవాలయం చుట్టూ బురుజులతో కూడిన ఒక ప్రాకారం నిర్మించబడింది. నల్లటి చలువరాతితో రూపొందించిన చతుర్ముఖ శివ రూపం ఈ ఆలయంలో కొలువై ఉంది. అలాగే కంచుతో చేసిన నంది విగ్రహం శివ లింగంకు అభిముఖంగా ఏర్పాటై ఉంది. బవరీల పేరుతో సుపరిచితమైన రెండు అతిపెద్ద కోనేరులు ఈ ఆలయంలో ఉన్నాయి. శ్రావణ మాసం (ఆగస్టు) లోను, ప్రత్యేకించి సోమవారాల వేళ వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శిస్తుంటారు.

ఇతర ఆకర్షక ప్రదేశాలు

జనాభా

2001 భారతదేశ జనాభా లెక్కల[21] ప్రకారం, బికానెర్ జనాభా 529,007గా ఉంది. వీరిలో పురుషులు 53శాతంగా ఉండగా, స్త్రీలు 47శాతంగా ఉన్నారు. జాతీయ అక్ష్యరాస్యత సగటు 59.5శాతంతో పోలిస్తే, బికానెర్‌లో అక్ష్యరాస్యత సగటు 66శాతంగా ఉంది. అలాగే, పురుషుల అక్ష్యరాస్యత 74శాతంగా ఉండగా, స్త్రీల అక్ష్యరాస్యత 57శాతంగా ఉంది. మొత్తం జనాభాలో 14శాతం మంది 6 సంవత్సరాల లోపు వయసు కలిగినవారుగా ఉన్నారు.

బికానెర్‌లో విద్య

ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయాలు, కాలేజీల కోసం బికానెర్‌లోని యూనివర్సిటీలు మరియు కాలేజీల జాబితా చూడండి: ఇంజనీరింగ్ కాలేజ్ బికానెర్, మరుధర్ ఇంజనీరింగ్ కాలేజ్ (జైపూర్ రోడ్), కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, మంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జైపూర్ రోడ్) లాంటి నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు బికానెర్‌లో కొలువై ఉన్నాయి. మహారాజా గంగా సింగ్ యూనివర్సిటీ, జైసల్మేర్ రోడ్, బికానెర్ స్వామి కేశవానంద్ రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, గంగానగర్ రోడ్, బికానెర్ గవర్నమెంట్ దుంగెర్ కాలేజ్, జైపూర్ రోడ్, బికానెర్ ఎం.ఎస్. కాలేజ్ ఫర్ విమెన్, జైసల్మేర్ రోడ్, బికానెర్ కీన్ కాలేజ్, రాంపురియా కాలేజ్, జోషివార, కొటే గేట్ లోపల, బికానెర్

ప్రసిద్ధమైన పాఠశాలల కోసం బికానెర్, రాజస్థాన్‌లోని పాఠశాలల జాబితా చూడండి. బికానెర్‌లో మూడు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు (KVs) - K.V. No. 1 (జైపూర్ రోడ్డులో, K.V. No. 2 (ఆర్మీ క్యాంపస్ లోపల) మరియు K.V. No. 3 నల్ బికానెర్ (నల్ బికానెర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషను లోపల) ఉన్నాయి. బికానెర్ బాయ్స్ పాఠశాల (BBS), సోఫియా సీనియర్ సెకండరీ పాఠశాల, ఢిల్లీ పబ్లిక్ పాఠశాల, దయానంద్ పబ్లిక్ పాఠశాల లాంటి కాన్వెంట్ పాఠశాలలు బికానెర్‌లో ఉన్నాయి. K.A.M. చిల్డ్రన్ సెకండరీ పాఠశాల, నీల్ కంఠ్ కాలనీ, సినీ మ్యాజిక్ సినిమా ముందు, రాణి బజార్ ఇండస్ట్రీయల్ ఏరియా, బికానెర్ గవర్నమెంట్ ఫోర్ట్ సీనియర్ సెకండరీ పాఠశాల, స్టేషను రోడ్డ్, బికానెర్ గవర్నమెంట్ సదుల్ సీనియర్ సెకండరీ పాఠశాల కొటే గేట్ లోపల, బికానెర్ మేజర్ థామస్ గవర్నమెంట్ సిటీ సీనియర్ సెకండరీ పాఠశాల, మారడన్ మార్కెట్ పాఠశాల, బికానెర్

అనుసంధానత

రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా మిగిలిన దేశంతో బికానెర్ చక్కని సంబంధాలను కలిగి ఉంది.[22]

నల్ ఎయిర్‌ఫోర్ట్ పేరుతో బికానెర్ ఒక విమానాశ్రయాన్ని కలిగి ఉంది. ఇది 17 కిలోమీటర్లు (11 మై.) నగర కేంద్రం నుంచి కొద్ది దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అయినప్పటికీ, జోధ్‌పూర్ (254 కిలోమీటర్లు (158 మై.)) విమానాశ్రయం, జైపూర్‌ (352 కిలోమీటర్లు (219 మై.)) వద్ద ఉన్న సంగనీర్ ఎయిర్‌ఫోర్ట్ లాంటివి రాజస్థాన్ లోపల సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

బికానెర్ జంక్షన్‌ (BKN) [23], లాల్‌గఢ్ రైల్వే స్టేషను‌ (LGH) [24] పేరుతో బికానెర్‌లో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లు బికానెర్‌ను ఇతర నగరాలతోను, రాజస్థాన్‌లోని ఇతర పట్టణాలతోను, ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలతోను అనుసంధానిస్తాయి.

చక్కటి నగర రోడ్డు వ్యవస్థతో పాటు అన్ని రకాల వాహన రవాణా సంబంధాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

వీటిని కూడా చూడండి

బికానెర్ ప్రజల జాబితా

శ్రీ గోపాల్ వ్యాస్..... పాత్రికేయుడు, రచయిత & కళాకారుడు.....

రౌనక్ వ్యాస్ ......... జాతీయ వార్తా చానెల్‌లో సీనియర్ సీనియర్ పాత్రికేయుడు

గుడ్డీ వ్యాస్ ......... చిత్ర దర్శక పాత్రికేయుడు.....జీ న్యూస్ కరస్పాండెంట్

సూచనలు

 • పట్నాయక్, నవీన్. (1990). ఏ డెసర్ట్ కింగ్‌డమ్‌: ది రాజపుట్స్ ఆఫ్ బికానెర్ . జార్జ్ వెయిడన్‌ఫీల్డ్ & నికోల్సన్ లిమిటెడ్‌., లండన్.
 1. 1.0 1.1 థాకూర్ దేశ్‌రాజ్‌, జాట్‌ ఇతిహాస్‌, 1934, పి. 616-624
 2. http://www.bkn.co.in/History.php
 3. http://www.prachinamuseum.org/bikaner.htm
 4. http://www.travelgrove.com/travel-guides/India/Bikaner-History-c868406.html
 5. "Bikaner". Retrieved 2007-09-08.
 6. దశరథ శర్మ, కాలక్రమంలో రాజస్థాన్, జోధ్‌పూర్, 1966, వాల్యూమ్.I, పేజీ. 287-288
 7. 7.0 7.1 టోడ్. పేజీలు 1126 మరియు 1127.
 8. ఐబిడ్., సెవెన్త్ క్లాన్ ఆఫ్ జాట్స్
 9. థాకూర్ దేశ్‌రాజ్, జాట్ ఇతిహాస్, ఢిల్లీ, 2002, పేజీ. 269-285
 10. G.S.L.దేవర, ఆప్. సిట్., Cf. దయాల్‌దాస్ రి క్యాత్, పార్ట్ II, పేజీ. 7-10
 11. ఐబిడ్., పేజీ. 38.
 12. 12.0 12.1 Ring, Trudy (1996). International Dictionary of Historic Places: Asia and Oceania. Bikaner. Taylor & Francis. ISBN 1884964044. Retrieved 2009-12-07. Text "page 129" ignored (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 13. 13.0 13.1 Ward, Philip (1989). Northern India, Rajasthan, Agra, Delhi: a travel guide. Junagarh Fort. Pelican Publishing Company. pp. 116–119. ISBN 0882897535. Retrieved 2009-12-07.
 14. 14.0 14.1 14.2 14.3 "History". National Informatics centre, Bikaner district. Retrieved 2009-12-07.
 15. "Junagarh Fort, Bikaner". Retrieved 2009-12-07.
 16. రింగ్ పేజీ.132
 17. 17.0 17.1 రింగ్ పేజీ.133
 18. 18.0 18.1 "Bikaner". Retrieved 2009-12-09.
 19. "Climate of Bikaner". Retrieved 2009-12-09.
 20. లక్ష్మీ నివాస్ ప్యాలెస్ (బికానెర్, రాజస్థాన్) - హోటల్ రివ్యూస్ - ట్రిప్‌అడ్వైజర్
 21. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
 22. "Junagarh Fort of Bikaner in Rajasthan, India". Retrieved 2009-12-07.
 23. ఇండియారైల్‌ఇన్ఫో: బికానెర్ జంక్షన్
 24. ఇండియారైల్‌ఇన్ఫో: లాల్‌గఢ్ రైల్వే స్టేషను

బాహ్య లింకులు