"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
బిర్జూ మహరాజ్
బిర్జూ మహరాజ్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | వారణాసి, ఉత్తర ప్రదేశ్ | 1938 ఫిభ్రవరి 4
మూలం | భారతదేశం |
రంగం | హిందుస్తానీ సంగీతము |
వృత్తి | శాస్త్రీయ నృత్యకారుడు |
వెబ్సైటు | http://www.birjumaharaj-kalashram.com/main.asp |
బిర్జూ మహరాజ్‌గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.
Contents
బాల్యం
తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.
నాట్య ప్రస్థానం
బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర, సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో రిటైర్ అయ్యాడు. బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా షత్రంజ్ కే ఖిలారి లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, కాహె ఛేడ్ మొహె అనే పాటకు నాట్యం చేశాడు.
అవార్డులు, గౌరవ పురస్కారాలు
- 1. పద్మవిభూషణ్ - 1996
- 2. సంగీత నాటక అకాడమీ అవార్డు
- 3. కాళిదాస్ సమ్మాన్
- 4. డాక్టరేట్ డిగ్రీ - బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
- 5. లతా మంగేష్కర్ పురస్కార్ - 2002
సినిమాలు
- 1. దేవ్‌దాస్ (2002)
- 2. గదర్ 2001
- 3. దిల్ తో పాగల్ హై
- 4. షత్రంజ్ కే ఖిలారి
వనరులు
బయటి లింకులు
- http://www.birjumaharaj-kalashram.com/ పండిట్ బిర్జూ మహరాజ్]
- Kathak maestro Birju Maharaj on top Indian dancers
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).