బి.వి.పట్టాభిరామ్

From tewiki
Jump to navigation Jump to search
బి.వి.పట్టాభిరామ్

బి.వి.పట్టాభిరాం ప్రముఖ హిప్నాటిస్టు[తెలుగు పదము కావాలి], మెజీషియన్, రచయత. దూరదర్శన్లో మొదటి తెలుగు కార్యక్రమాలలో ఆయన మేజిక్ షోలు ఉండేవి. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు వ్రాసారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో "మాయావిజ్ఞానం" పేరిట వ్యాసాలు వ్రాసారు.

మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సలింగ్, హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న పట్టాభిరాం ఒత్తిడి యాజమాన్యం, ఇంటర్ పర్సనల్ సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశములోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించాడు.

హిప్నోసిస్ పై ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ఈయనకు గౌరవ పౌరసత్వంకూడా ప్రధానం చేశారు.

పురస్కారాలు

  1. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[1]

మూలములు

  1. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.