బి. జయ

From tewiki
Jump to navigation Jump to search
బి. జయ
దస్త్రం:B. Jaya.png
జననంజనవరి 11 1964
మరణంఆగష్టు 30 2018
హైదరాబాదు
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు సినిమా దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2002 – 2018
జీవిత భాగస్వాములుబి.ఎ. రాజు

బి. జయ తెలుగు సినిమా దర్శకురాలు.[1] జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీవారపత్రికను స్థాపించి, ప్రేమలో పావని కళ్యాణ్‌ సినిమాతో దర్శకురాలిగా మారింది.[2]

జననం - విద్యాభ్యాసం

ఈవిడ జనవరి 11 1964తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, రావులపాలెం గ్రామంలో జన్మించింది. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (సైకాలజీ) చదివింది.[3]

సినీరంగ ప్రస్థానం

చదువు పూర్తికాగానే ఆంధ్రజ్యోతి డైలీతో తన జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో పనిచేసింది. 2002లో దీపక్, అంకిత హీరో, హీరోయిన్స్ గా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంద్వారా దర్శకురాలిగా మారింది. చంటిగాడు సినిమా దర్శకురాలిగా గుర్తింపునిచ్చింది. ఈ సినిమా 25 కేంద్రాలలో 100 రోజులు పూర్తిచేసుకుంది.

దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా

క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు నటవర్గం ఇతర వివరాలు
1 2002 ప్రేమలో పావని కళ్యాణ్‌ దీపక్, అంకిత
2 2003 చంటిగాడు బాలాదిత్య, సుహాసిని
3 2005 ప్రేమికులు యువరాజ్, రిషి గిరీష్, కామ్నా జఠ్మలానీ
4 2007 గుండమ్మగారి మనవడు ఆలీ, సింధూరి
5 2008 సవాల్ భరత్, సుహానీ
6 2012 లవ్‌లీ ఆది, శాన్వీ
7 2016 వైశాఖం[1] హరీశ్, అవంతిక చిత్రీకరణ

మరణం

గుండె పోటు కారణంగా హైదరాబాదు లో ఆగష్టు 30 2018 న మరణించింది.[4]

మూలాలు

  1. 1.0 1.1 ఆంధ్రభూమి. "ప్రేమలో కొత్త ఫీల్ -దర్శకురాలు బి.జయ". Retrieved 23 May 2017.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "జయ బి. , Jaya B". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 24 May 2017.
  3. నవతెలంగాణ, మానవి (18 February 2018). "కథ నచ్చితేనే." వి.యశోద. Retrieved 6 March 2018.
  4. సాక్షి, సినిమా (1 September 2018). "డైనమిజం". Archived from the original on 20 November 2018. Retrieved 20 November 2018.