బృహస్పతి (దేవ గురువు)

From tewiki
Jump to navigation Jump to search
బృహస్పతి
Brihaspati graha.JPG
గురుగ్రహం యొక్క దైవం, దేవలత యొక్క గురువు
దేవనాగరిबृहस्पति
అనుబంధంగ్రహము మరిఉ దేవతల గురువు
Worldబృహస్పతి
మంత్రంఓం రిం గురు ఏ నమః, నమో గురువె
భర్త / భార్యతార
వాహనంఏనుగు / ఎనిమిదు గుర్రముల రథం

బృహస్పతి (సంస్కృతం: बृहस्पति) హిందూ మతంలో ఒక దేవుడు. వేదములు, 64 కళలలో దిట్ట. ఎన్నో త్యాగాలకొనర్చి దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలకు శిక్షణ, రక్షణ ని అందిస్తూ, వారిని పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు, పురోహితుడు. గురువారం (లక్ష్మీవారం) బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడినది.

మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) ఒకడు.


స్వరూపం

బృహస్పతి స్వర్ణమకుటం, సుందరమైన పూమాల ధరించి ఉంటాడు. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి పద్మాసనములో ఆసీనుడై ఉంటాడు. ఇతనికి నాలుగు చేతులు ఉండును. వాటిలో స్వర్ణము చే చేయబడిన దండము, రుద్రాక్ష జప మాల, పాత్ర, వరదముద్ర ఉండును. బృహస్పతి అత్యంత సౌందర్యవంతుడని ప్రాచీన ఋగ్వేదం లో తెలుపబడినది. స్వర్ణము చే నిర్మించబడిన గృహములో నివసిస్తాడు. ఇతని రథము కూడా స్వర్ణము చేతనే నిర్మించబడి ఉంటుంది. అది సూర్యునికి సమానంగా కాంతిని విరజిమ్ముతుంది. అందులో అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటుంది. అది వాయువేగంతో పరుగులుపెట్టగలిగే 8 గుర్రాలచే నడుపుబడుతుంది. ఇదే కాక ఏనుగు కూడా బృహస్పతి వాహనమే.

పుట్టుపూర్వోత్తరాలు

మహాభారతం ప్రకారం బృహస్పతి బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన అంగీరసుని కొడుకు. అయితే మరి కొన్ని పురాణాలలో ఇతను అగ్నిపుత్రుడుగా చెప్పబడుచున్నాడు. మొదట బృహస్పతి మానవమాత్రుడే. అయితే శివుడి ఆజ్ఞ చే దైవత్వం పొందినాడు. మహాబుద్ధిమంతుడు. ఇతనికి వాచస్పతి అని మరొక పేరు కలదు. ఇతని సహోదరుఁడు ఉతథ్యుఁడు. సహోదరి పేరు యోగసిద్ధి. (అంగీరసుడు అగ్నికి జ్యేష్ఠపుత్రత్వము వహించిన వెనుక అతనికి కలిగిన ఏడుగురు పుత్రులలో బృహస్పతి కూడా వారిలో ఒక్కడుగా చెప్పబడినది.

బృహస్పతికి ముగ్గురు భార్యలు.

 • మొదటి భార్య పేరు శుభ. శుభ ద్వారా బృహస్పతికి ఏడుగురు కుమార్తెలు కలిగిరి. వారే
  • భానుమతి
  • రాకా
  • అర్చిష్మతి
  • మహామతి
  • మహిష్మతి
  • సినీవాలీ
  • హవిష్మతి
 • రెండవ భార్య తార. తారను చంద్రుడు అపహరిస్తాడు. తారాచంద్రులకు బుధుడు జన్మిస్తాడు. బృహస్పతికి, చంద్రునికి యుద్ధము జరుగును. తార భర్త బృహస్పతి వద్దకు చేరుకొంటుంది. ఇతనికి ఆరుగురు పుత్రులును ఒక్క పుత్రిక కలిగిరి.

కచుడు రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుని వద్ద మరణించిన వారిని సైతం జీవం పోయగల సంజీవిని మంత్రాన్ని నేర్చుకురమ్మని దేవతలచే పురమాయించి పంపబడతాడు. అయితే అక్కడ శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుడిని ప్రేమిస్తుంది. ఆమెను సోదరి సమానంగా పరిగణిస్తోన్న కచుడు ఆమె ప్రేమను నిరాకరిస్తాడు. ఆమె శాపానికి గురౌతాడు.

శుక్రాచార్యుని రూపంలో దేవతలకు బృహస్పతి పది సంవత్సరములు శిక్షణను ఇచ్చెనని తెలుపబడినది.

మూలాలు

ఇతర లింకులు