"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బెంగాల్ విభజన (1905)

From tewiki
Jump to navigation Jump to search
తూర్పు బెంగాల్ మరియు అస్సాం సంస్థానం యొక్క పటం

1905 జూలై 19 న అప్పటి భారత వైస్రాయి అయినటువంటి లార్డ్ కర్జన్ చే బెంగాల్ విభజన యొక్క నిర్ణయం ప్రకటించబడింది. 1905 అక్టోబరు 16 న బెంగాల్ విభజన నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ విభజన వల్ల పెద్ద ఎత్తున రాజకీయ అనిశ్చితి చెలరేగడంతో పాటు హిందూ ఒత్తిడి వలన 1911లో బెంగాల్ తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలు తిరిగి కలవడం జరిగింది.

మూలం

అప్పట్లో బెంగాల్ సంస్థానము 80 మిలియన్ లకు పైగా జనాభాను కలిగి ఉండి 489,500 చదరపు కిలోమీటర్ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్ తో పోలిస్తే తూర్పు బెంగాల్ భౌగోళికంగా విడిపడినట్లు ఉండడమే కాక సమాచార ప్రసార రంగంలో కూడా బాగా వెనుకబడి ఉంది. 1836లో పై భాగంలో ఉన్న సంస్థానాలన్ని ఒక లెఫ్ట్నెంట్ గవర్నర్ పరిధిలోకి తీసుకురాబడి 1854లో గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ను బెంగాల్ పై నేరుగా పరిపాలన అధికారం నుండి తప్పించడం జరిగింది. 1874లో సిల్హెట్ తో సహా అస్సాం బెంగాల్ నుండి వేరు చేయబడి ఒక చీఫ్ కమిషనర్ షిప్ ఏర్పాటు చేయబడడంతో పాటు 1898లో లూషాయి హిల్స్ ప్రాంతం కూడా ఇందులో కలవడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా కలిగిన బెంగాల్ సంస్థానాన్ని పరిపాలించడం చాలా కష్టసాధ్యమైన విషయం.

విభజన

1903లో తొలిసారిగా బెంగాల్ విభజన ప్రస్తావనకు రావడం జరిగింది. చిట్టగాంగ్ మరియు ఢాకా, మైమేన్ సింగ్ జిల్లాలను బెంగాల్ నుండి వేరు చేసి అస్సాం సంస్థానంలో కలపాలనే మరొక ప్రతిపాదన కూడా అప్పట్లో తెర మీదకు వచ్చింది. ఇదే విధంగా చోటా నాగపూర్ ను మధ్య సంస్థానాలలో కలపాలనే ప్రతిపాదన కూడా ఉండేది.

జనవరి 1904లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించగా ఫిబ్రవరిలో లార్డ్ కర్జన్ ఈ విభజన పై ప్రజాభిప్రాయ సేకరణకు గానూ బెంగాల్ లోని తూర్పు జిల్లాలన్నింటిలోను అధికారికంగా పర్యటించడం జరిగింది. ఈయన ఆయా ప్రాంతాలలో నాయకత్వం వహిస్తున్న ముఖ్యమైన వ్యక్తులను కలవడంతో పాటు విభజన పై ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియ చేస్తూ ఢాకా, చిట్టగాంగ్ మరియు మైమేన్సింగ్ వంటి ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. 1896-1902లో అస్సాంకు చీఫ్ కమిషనర్ గా ఉన్న హెన్రీ జాన్ స్టెడ్మాన్ కాటన్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

చివరకు 1905 అక్టోబరు 16 న అప్పటి భారత వైస్రాయిగా ఉన్న లార్డ్ కర్జన్ బెంగాల్ ను విభజించడం జరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం విభజన జరిగింది. బెంగాల్ దాదాపుగా ఫ్రాన్స్ అంత వైశాల్యం కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో జనాభాను కూడా కలిగి ఉంది. తూర్పు ప్రాంతం నిర్లక్ష్యం చేయబడి సరైన పాలనకు నోచుకోవడం లేదని భావించేవారు. ఈ సంస్థానాన్ని విభజించడం వల్ల తూర్పు ప్రాంతంలో పరిపాలన మెరుగవుతుందనీ తరువాత కొత్తగా వచ్చే స్కూళ్ళు మరియు ఉపాధి అవకాశాల వలన ఇక్కడ జనాభా లబ్ధి పొందుతారనీ భావించారు. అయితే విభజన ప్రణాళిక వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. బెంగాలీ హిందువులు పరిపాలనలో అధిక భాగస్వామ్యం కోసం రాజకీయ ఉద్యమం జరుపుతున్న ఆ కాలంలో తూర్పు ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండడం వలన వారి స్థానం బలహీనపడే అవకాశం ఉన్నట్లు భావించారు. ముస్లింలు విభజన కోరుకోగా హిందువులు దానిని వ్యతిరేకించారు. విభజన తరువాత కూడా అహింసా, హింసాయుత ఉద్యమాలు, బహిష్కరణల రూపంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. చివరకు పశ్చిమ బెంగాల్ అనబడే కొత్త సంస్థానం యొక్క గవర్నర్ పై హత్యా ప్రయత్నం కూడా జరిగింది.

ఈ విభజన నిర్ణయం కేవలం అర్ధ దశాబ్ద కాలం పాటు మాత్రమే అమలులో ఉండి చివరకు 1911 లో రద్దు చేయబడింది. అయితే విభజన వెనుక ఉన్న బ్రిటిష్ వారి డివైడ్ అట్ ఎమ్పెర అనే సిద్ధాంతం ఈ సంస్థానాలు తిరిగి కలిసాక కూడా ప్రభావం చూపుతూనే ఉంది. 1919లో హిందువులకు మరియు ముస్లింలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనికి ముందే ఈ రెండు మతాల పెద్దలూ కూడా బెంగాలీలందరూ సౌభ్రాతృత్వంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు, వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు రెండుగా విడిపోవడం జరిగింది. 28 నుండి 22 మిలియన్ ల జనాభా బలం కలిగిన ముస్లింలు కూడా పరిపాలనలో ఆధిక్యం చూపుతూ వచ్చారు. దేశం మొత్తం మీద హిందువులు మరియు ముస్లింలు అందరూ, హిందువులు అత్యధికంగా గల ప్రాంతం అంతా ఒక రాష్ట్రం గానూ ముస్లింలు అత్యధికంగా గల ప్రాంతం అంతా మరొక రాష్ట్రంగానూ రెండు స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా బెంగాలీ హిందువులు కూడా ఈ ప్రాతిపదికన రాష్ట్ర విభజనకు అంగీకరించారు. ముస్లింలు మొత్తం ముస్లిం సంస్థానం అంతా కూడా పాకిస్తాన్ లో కలవాలని కోరుకున్నారు. 1947లో ప్రత్యేకంగా మత ప్రాతిపదికన బెంగాల్ తిరిగి విభజించబడింది. ఇది తూర్పు పాకిస్తాన్ గా మారింది. అయితే 1971లో పశ్చిమ పాకిస్తాన్ మిలటరీ దళంతో స్వతంత్రం కోసం జరిపిన యుద్ధంలో గెలుపొంది ఈ ప్రాంతం బంగ్లాదేశ్ అనే స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. విభజన అనేది రక్తపాతం జరగకుండా నివారించేందుకు ఒక తప్పనిసరి వ్యూహం కావొచ్చు కానీ చాలా సందర్భాలలో ఇది మరిన్ని సమస్యలకు దారితీసి ప్రజలను మరింత విడదీయడమే జరిగింది.

దాదాపుగా ప్రతిసారీ విభజన వల్ల సరిహద్దులకు రెండు వైపులా ఉన్న మైనారిటీలు అసంతృప్తినే వ్యక్తం చేసారు. బెంగాల్ విభజన రెండు సార్లు రక్తపాతానికి దారి తీసింది.

త్రిపుర రాష్ట్రం, చిట్టగాంగ్,ఢాకా మరియు రాజ్శాహి (డార్జిలింగ్ కాకుండా) డివిజన్లు ఈ కొత్త సంస్థానంలో భాగం కాగా మాల్దా జిల్లా అస్సాం సంస్థానంలో కలుపబడింది. ఈ పెద్ద తూర్పు ప్రాంతాలను కోల్పోవడమే కాకుండా ఐదు హిందీ మాట్లాడే రాష్ట్రాలను కూడా బెంగాల్ మధ్య ప్రాంత సంస్థానాల కోసం వదిలివేయవలిసి వచ్చింది. పశ్చిమాన సంబల్ పూర్ మరియు ఐదు చిన్న ఒరియా మాట్లాడే రాష్ట్రాలు కూడా కేంద్ర సంస్థానాల నుండి బెంగాల్ సంస్థానంలో కలవడం జరిగింది. చివరకు 42 మిలియన్ హిందువులు మరియు 9 మిలియన్ ముస్లింలు కలిసి మొత్తం 54 మిలియన్ జనాభాతో 141,580 square miles (366,700 km2)వైశాల్యంతో బెంగాల్ వేరుపడడం జరిగింది.

ఢాకా రాజధానిగా చిట్టగాంగ్ మరొక ఉప రాజధానిగా ఏర్పడిన కొత్త సంస్థానం తూర్పు బెంగాల్ మరియు అస్సాంగా పిలువబడింది. దీని విస్తీర్ణం 106,540 square miles (275,940 km2)కాగా జనాభా మొత్తం 31 మిలియన్లు. ఇందులో 18 మిలియన్ ప్రజలు ముస్లింలు కాగా 12 మిలియన్ల ప్రజలు హిందువులు. కలకత్తా హైకోర్ట్ పరిధిలోనే ఈ ప్రాంతం ఉంచబడినప్పటికీ ఇద్దరు సభ్యులు గల రెవిన్యూ బోర్డ్ అయిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పరిపాలన జరిగేది. ఇక్కడ ప్రభుత్వం తూర్పు బెంగాల్ మరియు అస్సాం యొక్క పశ్చిమ సరిహద్దు కచ్చితంగా నిర్ణయించబడాలనీ మరియు కచ్చితమైన భౌగోళిక, భాషా,సాంస్కృతిక మరియు సామాజిక లక్షణాలు ఈ ప్రాంతానికి ఉండాలని భావించడం జరిగింది. 1905 జూలై 19న భారత ప్రభుత్వం ఈ విభజనకు సంబంధించిన తుది నిర్ణయ తీర్మానాన్ని ప్రకటించగా అదే సంవత్సరం అక్టోబరు 16 నుండి బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది.

ఇది తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. తూర్పు బెంగాల్ లోని ముస్లింలు విభజన వల్ల తమకు విద్య మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించగా పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం ఈ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలోనే పెద్ద స్థాయిలో జాతీయవాద సాహిత్యం వెలుగులోకి వచ్చింది. విభజనకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ తరపున అస్సాం చీఫ్ కమీషనర్ అయిన హెన్రీ జాన్ స్తేడ్మాన్ కాటన్ నాయకత్వం వహించినప్పటికీ కర్జన్ కు మాత్రం ఎటువంటి స్థానచలనం కలగలేదు. తరువాత నాటిన్ఘం ఈస్ట్ కు లిబరల్ పార్టీ ఎంపిగా ఉన్న కాటన్ తూర్పు బెంగాల్ కు మొదటి లెఫ్ట్నెంట్ గవర్నర్ అయిన సర్ బంప్ఫిల్ద్ ఫుల్లర్ ను తొలగించేందుకు విజయవంతమైన ఉద్యమం నడిపాడు. 1906లో విభజనను రద్దు చేయమని కోరేవారిని సమర్ధిస్తూ రవీంద్రనాద్ టాగోర్ రచించిన అమర్ షోనార్ బంగ్లా గేయం చాలా కాలం తరువాత 1972లో బంగ్లాదేశ్ జాతీయగీతంగా మారింది.

ఈ రాజకీయ నిరసనల వల్ల బెంగాల్ రెండు భాగాలు 1911లో తిరిగి ఒకటి కావడం జరిగింది. మత ప్రాతిపదికన కాకుండా భాషా ప్రాతిపదికన తిరిగి విభజన చేయడం జరుగగా హిందీ, ఒరియా మరియు అస్సామీ మాట్లాడే ప్రాంతాలు ప్రత్యేక పరిపాలనా యూనిట్లుగా వేరు చేయబడ్డాయి. బ్రిటిష్ ఇండియా యొక్క పాలనా రాజధాని కూడా కలకత్తా నుండి న్యూఢిల్లీకు మార్చబడింది.

అయితే ముస్లింలకు హిందువులకు మధ్య ఉన్న సంఘర్షణల వల్ల రెండు గ్రూప్ ల యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడే నిమిత్తం కొత్త చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడింది.

వీటిని కూడా చూడండి

బాహ్య లింకులు

మూస:Pakistan Movement