బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము

From tewiki
Jump to navigation Jump to search

బ్రిటిష్ ఇండియాలో 1911 వరకూ కలకత్తా భారత రాజధాని కావడము చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము యొక్క ప్రభావము దేశము మొత్తము పై ఉంది.

19వ శతాబ్దము, 20 వ శతాబ్దపు మొదటి భాగములలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్) ప్రాంతములో జరిగిన సామాజిక విప్లవాలను కలిపికట్టుగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము ఆంటారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనము రాజా రామ్మోహన్ రాయ్ (1775-1833) తో మొదలై రవీంద్రనాథ్ టాగోర్ (1861-1941) తో అంతమైనది అని చెప్పవచ్చు. టాగోర్ తరువాత కూడా దిగ్గజాల వంటి మహానీయులు పుట్టి కళలను, సృజనాత్మకతను ప్రోత్సహించారు.[1] 19వ శతాబ్దపు బెంగాల్ మత, సామాజిక ఉద్దారకులు, పండితులు, సాహిత్యకారులు, పాత్రికేయులు, దేశభక్తి ప్రాసంగికులు, శాస్త్రవేత్తల మిశ్రమము


నేపథ్యము

ఈ కాలములో బెంగాల్ లో రెనైసాన్స్ వలే బుద్ధి జాగరణ జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా వాసులకు బెంగాల్ వాసుల వలే బ్రిటిష్ వారి వంటి ఆక్రమణ దారులను ఎదిరించవలసిన అవసరము రాలేదు. ఈ బుద్ధి జాగరణ మహిళలు, పెళ్ళి, కట్నము, కులము, మతము వంటి సంప్రదాయములలో చాదస్తములను ప్రశ్నించింది. మొదట ప్రారంభమైన యువ బెంగాల్ ఉద్యమం, విద్యావంతులైన హిందువులలో వివేకము, నాస్తికత్వము (శూన్య వాదము) లను పౌర నడవడికకు కామన్ డినామినేటర్[తెలుగు పదము కావాలి]గా పరిగణించింది.

సమాంతరముగా నడిచిన సామాజిక-రాజకీయ గమనము, బ్రహ్మ సమాజం, ఈ కాలములో బాగా అభివృద్ధి చెంది బెంగాల్ రెనైసాన్స్ లో ఎంతోమంది నాయకులను తీర్చిదిద్ది తనతో కలుపుకుంది[1]. రెనైసాన్స్ కాలంలో బుద్ధి జాగరణకు మూలము ఉపనిషత్తులుగా భావించినప్పటకీ బ్రహ్మ సమాజం తొలి రోజులలో (జమిందారీ-బ్రిటిష్ కాలము) మిగతా భారతదేశము వలే, స్వతంత్ర భారత దేశాన్ని వ్యక్తీకరించలేక పోయింది. వారి హిందూ మతము విశ్వజనీనమైనది. ఆ కాలములో మహ్మదీయుల పాలన వలన హిందూ మతములో దూరిపోయిన సతీ సహగమనము, పర్దా, బహుభార్యాత్వము వంటి సాంఘిక దురాచారములకు వ్యతిరేకంగా పోరాడింది. కేశబ్ చంద్ర సేన్ వంటి నాయకులు బ్రహ్మ, కృష్ణ, బుద్ధ దేవులకు భక్తులైనట్లే యేసు క్రీస్తు నకు భక్తులు కూడా. బ్రహ్మ సమాజ సంస్కరణలు సమాజమంతా ఆదరించబడ్డాయి. బ్రహ్మ సమాజ నాయకులు ఆ తరువాత జరిగిన స్వతంత్ర పోరాటములో కూడా ప్రముఖ పాత్ర వహించారు.

1857 తిరుగుబాటు తరువాత బెంగాలీ సాహిత్యము వెల్లి విరిసింది. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్లు ఆద్యులు కాగా బంకిమ్ చంద్ర చటర్జీ విస్తరించారు.[2] బెంగాల్లో రెనైసాన్స్‌కు భారత జాతీయభావాన్ని తెచ్చిపెట్టింది బంకిమ్ చంద్ర చటర్జీ రచనలు అని చెప్పవచ్చు.

ఆ తరువాత రామకృష్ణ పరమహంస అన్ని మతములలో నిగూఢమైన సత్యాన్ని గ్రహించి, పరస్పర విరుద్దాలైన హిందూ శాఖలను (శక్త, తంత్ర, అద్వైత వేదాంత, వైష్ణవ), ఇస్లాం, క్రైస్తవ మతములను సంధానము చెందించినట్లుగా గుర్తించబడ్డారు. రామకృష్ణుని శిష్యుడు మహర్షి స్వామి వివేకానంద వలన వేదాంత మూవ్మెంట్ అభివృద్ధి చెందింది. వివేకానంద 1893 లో షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఉపన్యాసము వలన దేశవ్యాప్తముగా ఖ్యాతిని గడించారు. భారతీయులను ఆక్రమణకారుల బంధముల నుండి విముక్తి పొందమని, భారతీయ వేదాంత మతములో మానవ సేవ యే అత్యంత సత్యమని ఉద్బోధించారు. మానవ సేవయే మాధవ సేవ అనేదే వివేకానందుని నినాదము. పూర్తిగా స్వతంత్రమై, అభివృద్ధి గతిని నడిచే శక్తివంతమైన భారతదేశాన్ని ఊహించి వ్యక్తపరిచినవారిలో వివేకానందుడు ప్రథముడు. భారతదేశము తన ఘన సాంస్కృతిక గతముతో, భవిష్యత్తు లోకి ధైర్యముగా ముందడుగు వెయ్యగలుగుతందని తెలియజెప్పారు. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మిషన్ రాజకీయరహితమైనది.

టాగోర్ కుటుంబము, రవీంద్రనాథ్ టేగోర్ తో పాటు ఈ కాలము లోని నాయకుల విద్యాసంస్కరణల పై ప్రత్యేక ఆసక్తిని చూపించారు [2]. 1901 లో రవీంద్రనాథ్ టేగోర్ రచించిన నాస్తానీర్ నవల రెనైసాన్స్ ఐడియాలను ఉపన్యసించి, వాటిని తమ కుటుంబాలలో పాటించని ఒక వ్యక్తిని తూర్పార పడుతుంది.

యూరోపియన్ సాంస్కృతిక పునరుజ్జీవనము(రెనసాన్స్) తో తులనాత్మక పరిశోధన

ఐరోపాలో "రెనైసాన్స్" అనే పదానికి అర్థము పునర్జన్మ. సుమారు వెయ్యిసంవత్సరాల మధ్యయుగపు చీకటి తరువాత 15,16 వ శతాబ్దాలలో తిరిగి గ్రీకు-రోమన్ కాలములో మొదలైన శాస్త్ర పరిజ్ఞానమును పునరుద్దరించుట. కేశవ్ చంద్ర సేన్, బిపిన్ చంద్ర పాల్, M.N.రాయ్ వంటి ముఖ్య సూత్రధారులు బెంగాల్ రెనైసాన్స్ ను ఐరోపా రెనైసాన్స్ తో పోల్చడము మొదలు పెట్టారు. సుమారు ఒక శతాబ్దము పాటు మారుతున్న బైటి ప్రపంచమును బెంగాల్, మిగతా భారతదేశము కంటే బాగా అర్థము చేసుకొంది. భారత దేశాన్ని జాగృతము చెయ్యడములో బెంగాల్ ప్రభావము ఐరోపాను జాగృతము చెయ్యడములో ఇటలీ ప్రభావము వంటిదని చెప్పవచ్చు. ఇటలీ రెనైసాన్స్ కుడా సమాజములో కొన్ని వర్గాల వారికే పరిమితమైనది. (సామాన్య జనులలో కాకుండా). "బెంగాల్ రెనైసాన్స్ హుస్సేన్ షా కాలము లో మొదలైన బెంగాలీ ప్రజల సాంస్కృతిక లక్షణాల సమ్మేళనము మొక్క పునరుజ్జీవనము అని చెప్పవచ్చు.".[3]

బంగ్లాదేశ్ లోని కొంతమంది పండితులు ఈనాడు బెంగాల్ రెనైసాన్స్ ను కొత్త కోణములో చూస్తున్నారు. ప్రొఫెసర్ ముయునిద్దీన్ అహ్మద్ ఖాన్, ఇస్లాం చరిత్ర సంస్కృతి, చిట్టగాంగ్ విశ్వవిద్యాలయము, ఇలా అన్నారు.

19వ శతాబ్దము లో బెంగాల్ అనేక సమాజ సంస్కరణలు ప్రారంభించింది. ఇవి హిందువులు, ముస్లిమ్ ల లో కూడా ఉన్నాయి. ముస్లిం సంస్కరణ ఉద్యమాలైన ఫరియాజీ,తారీఖ్-ఈ-మహ్మాదీయా వాటి లో భూమిక లు వహించాయి. ఈ ఉద్యమాలకు కారణమైన సమాజము లో పరిస్థితులు హిందువులలో ఆర్యసమాజ్, బ్రహ్మోసమాజ్ పుట్టుకకు కారణమయి అన్ని రకాల ఉద్యమాలు పక్క పక్కనే నడిచాయి. రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమ్మాన్ని సాధారణంగా రెనైసాన్స్ ఉద్యమము అంటారు. కొంతమంది దీనిని హిందూ రెనైసాన్స్ అని కొంతమంది బెంగాలీ రెనైసాన్స్ అని అంటారు. దీనిని చాలామటుకు ఐరోపా రెనైసాన్స్ తో తులన చెయ్యవచ్చును. రాజా రామ్మోహన్ రాయ్ రెనైసాన్స్ పవిత్రమైన ఆర్యుల 'డేవుడు ఒక్కడే' అనే భావనను నవీన పాశ్చాత్య హేతువాద దృక్పధములో జాగృతము చేసింది.

[4]

ముఖ్యులు

తోడ్పడిన సంస్థలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. History of the Bengali-speaking People by Nitish Sengupta, p 211, UBS Publishers' Distributors Pvt. Ltd. ISBN 81-7476-355-4.
  2. History of Bengali-speaking People by Nitish Sengupta, p 253.
  3. History of Bengali-speaking People by Nitish Sengupta, p 210, 212-213.
  4. Islamic Reform Movements of the Nineteenth Century Bengal in Social History of the Muslims of Bangladesh Under British Rule, by Dr. Muin-ud-Din Ahmad Khan, published by the Islamic Foundation Bangladesh, Dhaka, 1992, pp71-72 and 79.

బయటి లింకులు