బెల్లంపల్లి పురపాలకసంఘం

From tewiki
Jump to navigation Jump to search

బెల్లంపల్లి పురపాలక సంఘం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణానికి చెందిన పాలకసంస్థ. ఇది 1987లో ఏర్పడీంది.

చరిత్ర

ప్రారంభంలో బెల్లంపల్లి గ్రామపంచాయతీగా కూడా లేదు.1983 వరకు బెల్లంపల్లి పట్టణ వాసులకు పాలకసంస్థలో ఓటుహక్కు కూడాలేదు. 1984లో ఈ పట్టణాన్ని సమీపంలో ఉన్న చంద్రవెల్లి పంచాయతీలో విలీనం చేశారు. 1987లో ఇది ప్రత్యేకంగా 28 వార్డులతో రెండో శ్రేణి పురపాలక సంఘంగా అవతరించింది. ఇడిగిరాల చంద్రశేఖర్ ఈ పురపాలక సంఘం తొలి చైర్మెన్‌గా పనిచేశారు.

ఎన్నికలు

2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.సూర్యనారాయణ చైర్మెన్‌గా, తెరాసకు చెందిన బి.జి.శంకర్ సింగ్ వైస్-చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[1] సెప్టెంబరు 2010 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014 మార్చి 30న మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 01-10-2005

వెలుపలి లంకెలు