"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బేడర కన్నప్ప (కన్నడ సినిమా)

From tewiki
Jump to navigation Jump to search

బేడర కన్నప్ప (కన్నడ: ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ) 1954లో నిర్మించబడిన కన్నడ సినిమా. గుబ్బి వీరణ్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ సినిమా రంగానికి పరిచయం చేయబడ్డాడు. సినీ నటి పండరీబాయికి కూడా ఇది తొలి సినిమా. దీనిని సినిమాగా తీయకముందు నాటకంగా గుబ్బి వీరణ్ణ నాటక కంపెనీ ప్రదర్శించేది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా విడుదల ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం 1954లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ కన్నడ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది

ఈ సినిమా కన్నప్ప అనే బోయవాడు తన మూఢభక్తితో కళ్ళు రెండూ పెరికివేసి శివునికి సమర్పించడమనే ఒక జానపద కథపై ఆధార పడింది.ఈ సినిమా థియేటర్లలో వందరోజులకు పైగా ప్రదర్శింపబడింది. దీనిని తమిళంలో "వేడన్ కన్నప్ప" (తమిళం: வேடன் கண்ணப்பா) పేరుతో 1955లో డబ్బింగ్ చేశారు. ఇదే సినిమాను కాళహస్తి మహాత్యం పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. రాజ్‌కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం కాళహస్తి మహాత్యం.