"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బొంగు సూర్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search
బొంగు సూర్యనారాయణ
200px
బొంగు సూర్యనారాయణ
జననంబొంగు సూర్యనారాయణ
ఇతర పేర్లుబొంగు సూర్యనారాయణ
ప్రసిద్ధితెలుగు కవులు, సాహితీకారులు

బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం గ్రామానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు సాహితీలోకంలో తన రచనామృతంతో సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడమేకాకుండా ఆదిత్యుడి (సూర్య దేవుని) సేవలో తరిస్తూ, మూలికా వైద్యంతో ప్రజల రోగాలను నయం చేస్తున్న బహువిద్యాకోవిదుడు.

రచనలు

 1. సుప్రభాత సహిత సూర్యశతకం,
 2. శ్రీరామకృష్ణ యుద్ధం,
 3. నవ్యాంధ్ర సుమతీ శతకం,
 4. రావివలస ఎండల్ మల్లికార్జునస్వామివారి క్షేత్ర మహత్యం,
 5. లీలావతార గాథ,
 6. వెంకటేశ్వర శతకం,
 7. శివక్షేత్ర మహార్యం,

టెక్కలి బోర్డు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎల్ ఎల్.సి వరకు చదివిన ఇతడు దూరవిద్య ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషాప్రవీణ కోర్సు పూర్తిచేసారు. చిన్నతనంలో తన తండ్రి నర్సింహం ప్రోత్సాహంతో తెలుగు భాషపై మక్కువ పెంచుకుని తెలుగు భాష కీర్తిని నలుదిశలా విస్తరించాలని నిరంతర కృషి చేస్తున్నారు. ఇందుకోసం టెక్కలి పాత జాతీయ రహదారిపై పౌరాణిక గ్రంథాలయం ఏర్పాటుచేసి పురాతన గ్రంథాలను అందరికీ అందుబాటులో ఉంచారు.

ప్రశంసలు, పురస్కారాలు :

 1. 2006 లో విశాఖపట్నం శారదాపీఠం చేపట్టిన కార్యక్రమంలో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి చే " మధురకవి " బిరుదు,
 2. 2006 లో శారదాపీఠం వారిచే "నవ్యాంధ్రకవి" బిరుదు,
 3. 2006 లో సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నరసింహారావు హైదరాబాద్ వారి "అపర పింగళి సూరన" బిరుదు,
 4. 2008 లో కడపలో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు.
 5. 2009 లో శ్రీ నన్నయభట్టారక పీఠం తణుకు వారి తంగిరాల వెంకటసోమయాజి పద్యకావ్య పురస్కారంతో పాటు "కవిశేఖర" బిరుదు.

టెక్కలి పాతజాతీయ రహదారి ప్రక్కన 1983 లో తన సొంత స్థలంలో సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించి, ప్రస్తుతం ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ భానుడి సేవలో తరిస్తున్నారు. తన తండ్రి నర్సింహం వద్ద వంశపారంపర్యంగా నేర్చుకున్న విద్యతో మహర్షి మూలికా వైద్యశాలను ఏర్పాటు చేసారు.

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).