బొగ్గుల శ్రీనివాస్

From tewiki
Jump to navigation Jump to search
బొగ్గుల శ్రీనివాస్

బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారి మొత్తం రచనలల్ని వెలుగులోకి తీసుకు రావడమేకాక సమగ్రంగా పరిశోధించారు.

జననం - విద్యాభ్యాసం

కర్నూలు జిల్లా, నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో చెన్నమ్మ, చెన్న రాయుడు దంపతులకు 1977, మార్చి 5 వ తేది జన్మించాడు. అల్లూరు గ్రామం కర్నూలు పట్టణానికి 25 కి.మీ దూరం లో ఉంది. ఎం.యస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై "పవన్ కల్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో" అనే పుస్తకంతో రాసి చాలా పాపులర్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘాలు ఆందోళనలు చేట్టాయి.[1] 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ హటావో - పాలిటిక్స్ బచావో పుస్తకాలను విక్రయిస్తున్న నేపథ్యంలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో, దాంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించారు.[2] ఈ పుస్తకం ఎనమిది లక్షల నలభై ఐదువేల కాపీలు అమ్ముడయై చరిత్ర సృష్టించింది.

మూలాలు

  1. http://www.sakshi.com/news/andhra-pradesh/no-buyers-for-hate-book-on-pawan-kalyan-196989 కక్షతోనే పవన్ కళ్యాణ్‌పై పుస్తక రచన
  2. http://www.sakshi.com/news/telangana/boggula-srinivas-ask-security-from-pawan-kalyan-fans-195652 'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ