బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు

From tewiki
Jump to navigation Jump to search

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.

వీరు 1920 జూన్ 28 తేదీకి సరియైన రౌద్రి నామ సంవత్సరం, ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు, సుభద్రమ్మ. వీరు తెలుగు, సంస్కృత భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, ఆగిరిపల్లి ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.

వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను, విస్‌డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.

రచనలు

 • ఓవరి (ఖండకావ్యం)
 • నివాళి (తాత్త్విక శతకం)
 • సిరినోము (ద్రవిడ ప్రబంధాలకు తెలుగు అనువాదం)
 • అన్యాపదేశం (సంస్కృత భల్లట శతకానికి తెలుగు అనువాదం)
 • తెలుగు చాటువు
 • బొమ్మల రామాయణం
 • ఎమెస్కో తెలుగు-ఇంగ్లీషు పాకెట్ డిక్షనరీ
 • గోపురం - సందేశం
 • తిరువళికలు
 • ప్రపంచ కథలు
 • ప్రబంధ కథలు
 • అనుష్టుప్ భగవద్గీత
 • జ్యోతిర్మాల (అమెరికా మహాపురుషుల పదచిత్రాలు) [1]
 • జయదేవుడు (అనువాదం)
 • ఎమర్సన్ వ్యాసావళి (అనువాదం)
 • థామస్ ఆల్వా ఎడిసన్ (అనువాదం)

మూలాలు