"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బొమ్మలాట (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
బొమ్మలాట
దర్శకత్వంప్రకాశ్ కోవెలమూడి
నిర్మాతగుణ్ణం గంగరాజు
ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్
స్పిరిట్ మీడియా
రచనజె. కె. భారవి
సంగీతంఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంకిరణ్ రెడ్డి
నిర్మాణ సంస్థ
స్పిరిట్ మీడియా
విడుదల
2004
దేశంభారతదేశం

బొమ్మలాట ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగులో వెలువడిన ఒక బాలల సినిమా. [1] ఈ సినిమాకు A Belly Full of Dreams అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ చిత్రానికి కళాదర్శకునిగా భూపేష్ ఆర్. భూపతి వ్యవహరించగా ఈ సినిమాలోని తోలుబొమ్మలను ప్రముఖ పప్పెటీర్ దాడి పదంజీ తయారు చేశాడు. ఈ చిత్రం 53వభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికయ్యింది.[2] ఈ చిత్రంలో సాయికుమార్ నటనకు అతనికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం లభించింది.[3][4]

నటీనటులు

 • సాయి కుమార్ (బాల నటుడు) - రాము
 • శ్రియా సరన్ - స్వాతి
 • అల్లరి నరేష్ - బాబు
 • శివ కుమార్ (బాల నటుడు) - ఛోటూ
 • తనికెళ్ళ భరణి ... టీ కొట్టు యజమాని
 • వీరేన్ తంబిదొరై ... టీ కొట్టు కస్టమర్
 • చిట్టిబాబు
 • సూర్య - రాము తండ్రి
 • శ్రావణి - రాము తల్లి
 • ఎన్. శివప్రసాద్- చెత్త పేపర్లు కొనేవాడు
 • జె.కె.భారవి - పోలీస్ కానిస్టేబుల్
 • ప్రీతి నిగమ్- వైశాలి (సంఘసేవకురాలు)

కథ

స్కూలుకు వెళ్లి చదువుకోవాలనే గాఢమైన కోరిక కలిగిన ఒక కుర్రవాని కథ ఇది. రాము (సాయి కుమార్) ఒక పూరి గుడిసెలో నివసిస్తూ వుంటాడు. ఇతని తండ్రి (సూర్య) ఒక తోలుబొమ్మలాట ఆడించే కళాకారుడు. పని లేక తాగుబోతుగా మారి భార్యను చితకబాదుతూ ఉంటాడు. తన తండ్రి నుండి తల్లిని కాపాడటానికి రామూ తండ్రికి కావలసిన మందు త్రాగిస్తూ ఉంటాడు. రోజూ చెత్త పేపర్లను ఏరుకుంటూ వాటిని అమ్మి తల్లికి గుట్కా, తండ్రికి మందు కొనిస్తూ ఉంటాడు. రామూకు చదువుకోవాలని ఎంతో ఉంటుంది. కానీ అతని పరిస్థితులు అతడిని స్కూలుకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. అతడు చదువుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు. ఇతని స్నేహితుడు ఛోటూ(శివ కుమార్) ఇతని తపనను అర్థం చేసుకుని అతనికి చేతనైన సాయం చేస్తాడు. చివరకు ఎలాగైతేనేం స్కూలు ఫీజుకు డబ్బులు తక్కువగా ఉన్నా కూడా ఒక రోజు స్కూలులోకి అడుగు పెడతాడు. అదే రోజు స్కూలులో అగ్నిప్రమాదం జరుగుతుంది. అగ్గిలో చిక్కుకు పోయిన ఒక విద్యార్థిని రామూ రక్షిస్తాడు. హెడ్‌మాస్టర్ రాము గురించి తెలుసుకుని అతడిని ఫీజు లేకుండా స్కూలులో చేర్చుకుంటానని, హాస్టల్‌లో పెట్టుకుని స్కాలర్‌షిప్ వచ్చేటట్లు చేస్తానని హామీ ఇస్తాడు. అయితే మరుసటి రోజే ఆ స్కూలు మూతపడుతుంది. అగ్నిప్రమాదం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆ స్కూలు లైసెన్సును రద్దు చేసి మూసివేస్తారు. రామూ ఆశలు నీరుగారి పోతాయి. అయితే ఆ స్కూలును మళ్లీ తెరిపించడానికి అగ్నిప్రమాదంలో రామూ చేసిన సాహసాన్ని ఎమ్మెల్యే కొడుకు చేసినట్లుగా చూపి ఆ అబ్బాయిని రాష్ట్రపతి సాహసబాలల అవార్డుకు సిఫారసు చేస్తారు. అయితే ఈ అన్యాయాన్ని రామూ స్నేహితులు అడ్డుకుని ఆ అవార్డును రాముకు వచ్చేటట్లు చేసి రామును స్కూలులో చదివే అవకాశాన్ని కల్పిస్తారు.

అవార్డులు

Master Sai Kumar receiving the Best Child Artist Award from the President Pratibha Devisingh Patil.

మూలాలు


భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం