"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బోండా

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Bonda (1).jpg
మంగుళూరు బోండా

బోండా (Bonda) దక్షిణ భారత దేశానికి చెందిన ఒక అల్పాహార వంటకం. దీనిలో కారం, తీపి రకాలున్నాయి.

తయారుచేయు విధానం

దస్త్రం:Batata Vada.jpg
మహారాష్ట్ర శైలి యొక్క బటాటా వడ
దస్త్రం:Bonda soup.jpg
మైసోర్ శైలిలో బోండా సూప్

కారపు బోండా తయారుచేయడానికి బంగాళాదుంప ముద్దని బాగా వేయించి, పలుచని శెనగ పిండి ముద్దలో ముంచి నూనెలో వేయించాలి. బంగాళాదుంపలో ఇష్టమైన కూరగాయ ముక్కలు ఉడికించి కలుపుకోవచ్చును. కొంతమంది మధ్యలో బంగాళాదుంప ముద్దకు బదులు నిలువుగా కోసిన ఉడికించిన కోడిగుడ్డును ఉంచి శెనగపిండి ముద్దలో ముంచి వేయిస్తారు. వీటిని 'ఎగ్ బోండా' అంటారు.

కేరళ రాష్ట్రంలో బోండాలను తీపిగా తయారుచేస్తారు. మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు. కారపు బోండాలో మసాలా రకం మహారాష్ట్రలో బటాటా వడ అంటారు.[1]

మూలాలు

బయటి లింకులు