బోధన

From tewiki
Jump to navigation Jump to search

ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే క్రియని బోధన అంటారు. పూర్వ కాలంలో ఇది ప్రధానంగా మౌఖిక పద్ధతిలో, చూసి ఆచరించు పద్ధతిలో ఉంది.విజ్ఞానం ఆభివృద్ధితో, బోధనలో ఆధునిక పద్ధతులు చోటుచేసుకున్నాయు. వీటిలో పుస్తకాల, దృశ్య శ్రవణ మాధ్యమాలు, కంప్యూటర్, ఐసిటి ద్వారా ఎక్కడనుండైనా విద్యని నేర్చుకోవచ్చు.

బోధన విద్య

సర్టిఫికేట్

ఒక సంవత్సరం కాల పరిమితి గల సర్టిఫికేట్ కోర్సు నర్సరీ, ప్రాథమిక స్థాయిలో మొదటి రెండు సంవత్సరాల విద్యార్థులకి చదువు చెప్పటానికి అర్హత.

డిప్లమా

డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డి.ఎడ్) అనేది ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యార్థులకి ఉపాధ్యాయ విద్య. దీనిని 1962 లో ప్రారంభించినపుడు టీచర్ ట్రెయినింగ్ సర్టిఫికేట్ (టిటిసి) అనే వారు. 1999 నుండి డి.ఎడ్ గా పేరు మార్చారు. ప్రభుత్వ సంస్థలు జిల్లాకు ఒక్క సంస్థ చొప్పున 23 జిల్లాలలో 23 సంస్థలున్నాయి. వీటిని డైట్ అనగా జిల్లా విద్యా, శిక్షణా సంస్థ (District Institute of Education and Training (DIET) అంటారు. ఒక్కొక్క సంస్థలో వంద సీట్లు ఉన్నాయి.ఇవికాక 11 ఉర్దూ మాధ్యమం కళాశాలలు, ప్రతి దానిలో 50 సీట్లు ఉన్నాయి. 2007 నుండి ప్రైవేటు సంస్థలలో కూడా డి.ఎడ్‌ కోర్సు నిర్వహించబడుతున్నది. ప్రైవేటు సంస్థలలో డి.ఎడ్‌ కోర్సు, ఫీజుల నిర్ధారణ, రిజర్వేషన్ల అమలు, అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ తదితర విషయాలనన్నింటిని డి.ఎడ్‌ కన్వీనరే నిర్ధారించి, అమలు చేస్తారు.

ప్రతి సంవత్సరం మేనెలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి, రాష్ట్ర వ్యాప్తంగా డి.ఎడ్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు జరుపుతారు. సాధారణ విద్యార్థులు ఇంటర్మీడియట్ లో 45 శాతం మార్కులు వచ్చిన వారు దీనికి అర్హులు. ఇంటర్మీడియట్ వృత్తి విద్య చదివిన వారికి అర్హత లేదు. 2010 లో ప్రభుత్వ కాలేజీలో మొదటి సంవత్సరానికి రు. 2385, ప్రైవేటు కాలేజీలో రు.12500 ఫీజులున్నాయి.

బాచలర్ డిగ్రీ, పిజీ

బాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, (బిఇడీ) డిగ్రీ తరువాత బోధనా విద్య. దీనిలో చేరటానికి. డిగ్రీలో లేక పిజీలో సాధారణ విద్యార్థులు 50 శాతం సాధించి వుండాలి. ఇది చదివిన వారు ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకి ఉపాధ్యాయులుగా, ప్రాథమిక స్థాయి విద్యార్థులకి ఉపాధ్యాయులుగా చేరవచ్చు. దీనిలో ప్రవేశానికి ఎడ్సెట్ (Ed.CET) పరీక్ష రాయాలి. ఆటలలో బోధనకి ప్రవేశ పరీక్ష వుంటుంది. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, (ఎమ్ఇడీ) పిజీ డిగ్రీ తరువాత బోధనా విద్య. దీనిలో ప్రవేశానికి పరీక్ష వుంటుంది.

బోధన స్థాయి ఉపాధి అవకాశాలు

పాఠశాల

ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను డిఎస్సి (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ) అని పిలవబడే పరీక్ష ద్వారా నియమిస్తారు. వీటిని సెకండరీ గ్రేడ్ టీచర్లు అని అంటారు.

డిఎస్సి 2008 నియామకాలలో, 30745 ఎస్జిటి పోస్టులున్నాయి. డి.ఎడ్, బి.ఎడ్ చదివిన వారికి కేటాయించవలసిన నిష్పత్తి గురించిన కోర్టు కేసుల వలన అలస్యమై, 2010 లో జరుగుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం కావలసిన ఉపాధ్యాయుల కోసం తుది కోర్టు తీర్పు రాకుండానే జరుగుతున్నాయి.

జూనియర్ కళాశాల

జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలను ఎపిపిఎస్సి భర్తీ చేస్తుంది.

డిగ్రి కళాశాల, ఆ పై

డిగ్రి కళాశాల లెక్చరర్ ఉద్యోగాలను ఎపిపిఎస్సి భర్తీ చేస్తుంది. యుజిసి నిర్వహిస్తున్న జూనియర్ పరిశోధక భత్యం, లెక్చరర్ నియామక అర్హత కోసం జాతీయ అర్హతా పరీక్షలో (National Eligibility Test for Junior Research Fellowship and eligibility for Lectureship) ఉత్తీర్ణత, మాస్టర్స్ స్థాయిలో 55 శాతం (సాధారణ విద్యార్థులు) వుండాలి.

వనరులు