భలే పెళ్లి

From tewiki
Jump to navigation Jump to search
భలే పెళ్లి
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.జగన్నాథ్
గీతరచన పింగళి నాగేంద్రరావు
నిర్మాణ సంస్థ ‌జగన్నాథ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

డా. దుర్గాప్రసాద్‌రావు 'భలే పెళ్ళి'ని జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించాడు. దీన్ని తారుమారు అనే ఆరు రీళ్ళ సినిమాతో కలిపి విడుదల చేశారు.

డాక్టర్‌ కె.శివరామకృష్ణయ్య హీరోగా నటించిన ఈ చిత్రంలో గరికిపాటి రాజారావు, జయంతి గంగన్న పంతులు, ఎస్‌.రంగస్వామి అయ్యంగార్‌, నాగలక్ష్మిబాయి శాంతకుమారిబాయి, రవీంద్రనాథ్‌, కొత్తపల్లి లక్ష్మయ్య, ఉప్పులూరి సుబ్బారావు ముఖ్య పాత్రధారులు. ఇది గీతకర్త పింగళి నాగేంద్రరావు యొక్క తొలి సినిమా. పింగళి నాగేంద్ర రావు కథా రచయితగా, పాటల రచయితగా పరిచయం చేస్తూ 'భలే పెళ్లి' రూపొందించారు.

కథ

ఛైర్మన్‌ కావాలనుకునే ఓ మోతుబరి, తనకు ఇంగ్లీషు తెలిసిన భార్య ఉంటే హోదా, అంతస్తు పెరుగుతోందని తలచి రెండో పెళ్ళి కోసం ప్రయత్నిస్తాడు. అప్పుల్లో వున్న ఒక అడ్వకేటు కూతురుతో మోతుబరి వివాహానికి మధ్యవర్తులు అంగీకరింపచేస్తారు. కానీ అప్పటికే ప్రేమలో పడిన అడ్వకేటు కూతురు తన పెళ్లి తప్పించడానికి నటరాజ ఫిలింస్‌ అనే సినిమా కంపెనీని ఆశ్రయిస్తుంది. ఆ కంపెనీ యజమాని చిన్నతనంలో ఇంటినించి పారిపోయిన మోతుబరి అసలు బావమరిది. ఆయన ఇటు అడ్వకేట్‌కి, అటు కామందు ఛైర్మన్‌కి మధ్య తగువు వచ్చేలా చేసి, ముహూర్త సమయం దాటిపోయేలా చేయడం 'భలే పెళ్ళి' ఇతివృత్తం. ఇందులో 'పింగళి రాసిన ఒక పద్యం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కలిపి విడుదల చేశారు.[1]

మూలాలు