"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
భారతదేశంలో మతములు
భారతదేశంలో మతములు : భారతదేశపు జనాభాలో హిందూ మతమును అవలంబించువారు 80% గలరు. భారత్ లో రెండవ అతిపెద్ద మతము ఇస్లాం (13.43%) జనాభాతో యున్నది. ఇతర భారతీయ మతములు బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతమును అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ గలరు. భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతమును అవలంబించుచున్నది.
Contents
జనగణన
భారతదేశంలో మత ప్రాతిపదికపైన జనాభా విభజన :
మతము | వ్యక్తులు | శాతము |
---|---|---|
మొత్తం మతములు | 1,028,610,328 | 100.00% |
హిందువులు | 827,578,868 | 80.456% |
ముస్లింలు | 138,188,240 | 13.434% |
క్రైస్తవులు | 24,080,016 | 2.341% |
సిక్కులు | 19,215,730 | 1.868% |
బౌద్ధులు | 7,955,207 | 0.773% |
జైనులు | 4,225,053 | 0.41% |
ఇతరులు | 6,639,626 | 0.645% |
లెక్కించని మతములు | 727,588 | 0.07% |
విషయము | హిందువులు[2] | ముస్లింలు[3] | క్రైస్తవులు[4] | సిక్కులు[5] | బౌద్ధులు[6] | జైనులు[7] | ఇతరులు[8] |
---|---|---|---|---|---|---|---|
2001 మొత్తం జనాభాలో % | 80.46 | 13.43 | 2.34 | 1.87 | 0.77 | 0.41 | 0.65 |
10-సం.లలో పెరుగుదల % (est '91–'01) [9][β] | 20.3 | 36.0 | 22.6 | 18.2 | 24.5 | 26 | 103.1 |
లింగ నిష్పత్తి* (సగటు 933) | 931 | 936 | 1009 | 893 | 953 | 940 | 992 |
అక్షరాస్యతా శాతం (సగటు 64.8) | 65.1 | 59.1 | 80.3 | 69.4 | 72.7 | 94.1 | 47.0 |
పని నిమగ్నతా శాతం | 40.4 | 31.3 | 39.7 | 37.7 | 40.6 | 32.9 | 48.4 |
గ్రామీణ లింగ నిష్పత్తి[9] | 944 | 953 | 1001 | 895 | 958 | 937 | 995 |
పట్టణ లింగ నిష్పత్తి[9] | 894 | 907 | 1026 | 886 | 944 | 941 | 966 |
శిశు లింగ నిష్పత్తి (0–6 సం.లు) | 925 | 950 | 964 | 786 | 942 | 870 | 976 |
వనరులు: మతములపై మొదటి రిపోర్టు: 2001 భారత జనాభా గణాంకాలు[10]
α. ^ మావో-మరామ్, పావోమాటా, మణిపూర్‌కు చెందిన 'సేనాపతి జిల్లా' కు చెందిన పురుల్ ఉప-విభజనలను లెక్కలోకి తీరుకోలేదు. β. ^ 1991 లో అస్సాం, జమ్ము కాశ్మీర్లో జనగణన జరుగలేదు. ఈ సమాచారములో కూర్చబడలేదు.
భారత ఉపఖండము
భారత ఉపఖండములో మతముల సమాచారములు:
- భారతదేశం : 80% హిందువులు, 13% ముస్లిములు, 2% క్రైస్తవులు, 2% సిక్కులు (1,100 M)
- పాకిస్తాన్: 97% ముస్లిములు, 2% హిందువులు, 1% క్రైస్తవులు (165 M)
- బంగ్లాదేశ్: 83% ముస్లిములు, 16% హిందువులు (150 M)
- మయన్మార్: 89% బౌద్ధులు, 4% ముస్లిములు, 4% క్రైస్తవులు (43 M)
- శ్రీలంక: 70% బౌద్ధులు, 15% హిందువులు, 7% ముస్లిములు, 7% క్రైస్తవులు (20 M)
వీటి మొత్తంలో : 63% హిందువులు, 29% ముస్లిములు, 5% బౌద్ధులు, 2% క్రైస్తవులు, 1% సిక్కులు.
మతములు, విభాగాలు
హిందూ మతము
భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ జనాభా గల మతము. ప్రపంచంలో గల హిందూ మతస్థులలో 90% కన్నా ఎక్కువగా భారత్ లోనే నివసిస్తున్నారు.
- ఈ మతము గురించి చూడండి : హిందూ మతము
అయ్యావళి
దక్షిణ భారత దేశంలో ఈ సమూహం గలదు. వీరు హిందూ మతమునకు అంతర్భాగంగానే ఉన్నారు. వీరెక్కువగా తమిళనాడు, కేరళలో గలరు.
ఇస్లాం
- దీనిలో సున్నీ ఇస్లాం, షియా ఇస్లాం అను రెండు పెద్ద వర్గాలు గలవు.
అహ్మదీయ
అహ్మదీయ అనునది ఒక చిన్న ఉద్యమము. దీనిని మిర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. ఇతనిని అనుసరించేవారి సంఖ్య భారత్ లో కొద్దిగా గలదు. వీరు ముస్లింల సమూహములోనే ఒక అంతర్భాగమని భావిస్తారు గాని, ఇస్లాంకు ఈ ఉద్యమానికి ఏలాంటి సంబంధం లేదని, ఇదొక ఫిత్నా అని ముస్లింలు భావిస్తారు.
జైన మతము
భారతదేశంలో జైన మతస్థులు దాదాపు భారత జనాభాలో 0.4% గలరు.
- ఈ మతము గురించి చూడండి : జైన మతము
బౌద్ధ మతము
భారతదేశంలో బౌద్ధ మతస్థులు దాదాపు 90 లక్షలు గలరు. వీరెక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో గలరు.
- ఈ మతము గురించి చూడండి : బౌద్ధ మతము
సిక్కు మతము
భారతదేశంలో సిక్కు మతస్థులు 1.93 కోట్లు గలరు. వీరెక్కువగా పంజాబు రాష్ట్రం, ఢిల్లీ, హర్యానాలో గలరు. భారతదేశంలోని పలు నగరాలలోనూ వీరి జనాభా కానవస్తుంది.
- ఈ మతము గురించి చూడండి : సిక్కు మతము
క్రైస్తవ మతము
భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 2.9% గలరు. భారతదేశమంతటా వ్యాపించియున్నారు.
- ఈ మతము గురించి చూడండి : క్రైస్తవ మతము.
యూద మతము
ఈ మతస్తులు భారత్ లో 1991 జనగణన ప్రకారం 5271 మంది గలరు. వీరెక్కువగా మహారాష్ట్ర, కేరళలో గలరు.
- ఈ మతము గురించి చూడండి : యూద మతము
జొరాస్ట్రియన్ మతము
జొరాస్ట్రియన్లు లేదా పారసీ మతస్తులు భారతదేశ జనాభాలో 0.06% గలరు. వీరెక్కువగా ముంబాయిలో గలరు.
- ఈ మతము గురించి చూడండి : జొరాస్ట్రియన్ మతము
బహాయి విశ్వాసము
ఈ మతస్తులు భారత్ లో దాదా పు 22 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని బహాయి విశ్వాసులలోని ఎక్కువమంది భారతదేశంలో ఉన్నారు.
- ఈ మతము గురించి చూడండి : బహాయి విశ్వాసము
పాదపీఠికలు
- ↑ "Tables: Profiles by main religions. DATA FILE (in Spreadsheet format)". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17. Please download the file (which is compressed by winzip) to see the data in spreadsheet.
- ↑ "Tables: Profiles by main religions: Hindus" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2005-04-06. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Muslims" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2006-05-23. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Christians" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Sikhs" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Buddhists" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Jains" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
- ↑ "Tables: Profiles by main religions: Other religions" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-06-06. Retrieved 2007-04-17.
- ↑ 9.0 9.1 9.2 "A snapshot of population size, distribution, growth and socio economic characteristics of religious communities from Census 2001" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. pp. pp1–9. Archived from the original (PDF) on 2005-12-16. Retrieved 2007-04-20.CS1 maint: extra text (link)
- ↑ "Tables: Profiles by main religions". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
మూలాలు
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})