"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారతీయ చిత్రకళ

From tewiki
Jump to navigation Jump to search
Fresco from Ajanta caves, c. 450–500

భారతీయ కళలలో భారతీయ చిత్రకళ అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలది. అతి పురాతన భారతీయ చిత్రాలు మానవునికి చరిత్ర గురించి తెలియక ముందే ఇక్కడ రాతి పై చిత్రీకరించటం జరిగింది. క్రీ.పూ 5500 లోనే మధ్య ప్రదేశ్ లోని రాయ్‌సేన్ జిల్లాకి చెందిన భీంబేట్కాలో రాతిని చిత్రపటంగా మొలిచిన దాఖలాలు ఉన్నాయి. బౌద్దమత సాహిత్యమంతనూ చిత్రపటాలు గల రాజభవనాలు, సైనిక భవనాలు గురించి వివరించబడిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే అజంతా గుహలలో గల చిత్రపటాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నవి. మధ్య యుగానికి చెందిన వివిధ రాతప్రతులలోనూ చిత్రకళ ఆనవాళ్ళు ఉన్నాయి. పర్షియన్ సూక్ష్మ చిత్రకళ భారతీయ సాంప్రదాయిక చిత్రకళతో సంగమించి ముఘల్ చిత్రకళ అవతరించింది. 17వ శతాబ్దంలో ఈ శైలి దేశంలోని అన్ని మతాలకి చెందిన రాజ్యాలకి విస్తరించి స్థానిక సొబగులని అద్దుకొన్నది. తెల్లదొరల కోసం కంపెనీ కలం అవతరించటంతో బ్రిటీష్ సామ్రాజ్యం 19వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రభావం గల కళా విశ్వవిద్యాలయాలని నెలకొల్పినది. ఈ స్థాపనలు ఆధునిక భారతీయ చిత్రకళా శైలికి ప్రాణం పోయటం ఇవి మరల భారతీయ మూలాలకే తిరిగి వెళ్ళటానికి మొగ్గు చూపటం విశేషం.

భారతీయ చిత్రకళ ప్రాచీన నాగరికతకి ప్రస్తుత కాలానికి మధ్య గల వైరుధ్యాన్ని ప్రతిబింబించే ఒక అందమైన కళా స్రవంతి. తొలుత దీని ప్రాథమిక ఉద్దేశం మతమే అయిననూ తర్వాతి కాలంలో ఇది వివివిధ సంస్కృతులు, సంప్రదాయాల కలయికకి నిలువుటద్దంలా నిలచింది.

అమరావతి మ్యూసియం వద్ద చిత్రాలు

భారతీయ చిత్రకారులు

ఇవి కూడా చూడండి

వర్గం:భారతీయ చిత్రకారులు