"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారతీయ నృత్యం

From tewiki
Jump to navigation Jump to search
ఒక మహిళా కూచిపూడి ప్రదర్శకురాలు

'

భారతదేశంలో నృత్యం , ప్రాచీన శాస్త్రీయ లేదా ప్రాంతీయ నృత్యాల నుంచి జానపద లేదా ఆధునిక శైలి నృత్యాల వరకు విస్తృత పరిధి ఉన్న నృత్యం మరియు రంగస్థల నృత్య రూపాలతో మమేకం అయి ఉంది.

ముగ్గురు సుపరిచిత హిందూ దేవతలైన శివుడు, కాళి, కృష్ణుడులను బాగా ఎక్కువగా ఈ నృత్యాల్లో ప్రతిబింబిస్తారు. భాంగ్రా, భిహు, ఘుమురా నృత్యం, సంబల్ పురి, ఛౌ మరియు గార్బా వంటి భారతీయ జానపద నృత్యాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మరియు కొన్ని ప్రత్యేక నృత్యాలను ప్రాంతీయ ఉత్సవాల్లో చూడొచ్చు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో గుర్తించే విధంగా భారతదేశం అసంఖ్యాకంగా భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అందిస్తోంది. భారతీయ నృత్య శైలులను సినిమాలు, హిందీ సినిమాలలో చూపించడం వల్ల నృత్యాల పరిధి భారతీయ ప్రేక్షకులను దాటి ప్రపంచ వీక్షకులకు విస్తరించింది.

శాస్త్రీయ భారతీయ నృత్యం

ఒడిస్సీ.. భారత దేశంలోని ఒడిస్సా నుంచి ఒక శాస్త్రీయ నృత్యం.

ఒక్కో నృత్య రూపం ఒక ప్రత్యేక ప్రాంతం లేదా ప్రజల సమూహాల సంస్కృతిని, లక్షణాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. ఒక నృత్యం శాస్త్రీయ నృత్యంగా పరిగణించబడటానికి ప్రమాణం ఏంటంటే…. ఆ శాస్త్రీయ నృత్య శైలి.. భారతీయ కళలు నటనకు సంబంధించి భరతముని వచించిన నాట్య శాస్త్రంలో పేర్కొన్న మార్గదర్శనాలకు అనుగుణంగా ఉండాలి. నటన లేదా నాట్యం అనేది నాటకం లేదా నాట్యంతో కూడుకున్న విస్తృత భావనలు.

భరతనాట్య కళాకారిణి

వాస్తవానికి నాట్యం అనేది పవిత్రమైన హిందూ సంగీత రంగస్థల శైలిలకు “నాట్య ’కు సంబంధించినదైన నేపథ్యంలో భారతీయ నృత్యం అనేది ఒక అపప్రయోగం అని చెప్పవచ్చు. దీని సిద్ధాంతం భరతముని నాట్య శాస్త్ర (క్రీస్తు పూర్వం 400)లో కనుక్కోబడింది. సంగీత నాటక అకాడెమీ ప్రస్తుతం తొమ్మిది నృత్య రూపాలకు శాస్త్రీయ హోదా కల్పించింది.[ఉల్లేఖన అవసరం]

విష్ణు మూర్తిని పూజించే వారు వైష్ణవులుగా పరిగణించబడతారు. శ్రీకృష్ణుడు (విష్ణు మూర్తి యొక్క ఒక అవతారం) మరియు బృందావని లోని గోపికలు ప్రదర్శించిన నృత్య శైలిని రాస లీల గా పిలుస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక నృత్యంగా కూడా పరిగణిస్తారు. మరెన్నో ఇతర భారతీయ శాస్త్రీయ నృత్యాలు పురాణ సంఘటనలు లేదా విష్ణుమూర్తిని వర్ణించే సంఘటనలను తెలియజేసేవే.

హిందీ చలన చిత్రాలు

ఒక భారతీయ నాట్య క్రమం.

తొలి తరం హిందీ సినిమాల్లోని నృత్యం ప్రాథమికంగా శాస్త్రీయ భారతీయ నృత్యం నమూనాగా ఉండేది. ముఖ్యంగా చారిత్రక ఉత్తర భారత వేశ్య (తవైఫ్) నృత్యాలు లేదా జానపద నృత్యాలకు సంబంధించినవై ఉండేవి. పాశ్చాత్య పాప్ సంగీతం మరియు రూపాంతరం చేసిన శాస్త్రీయ నృత్యాలను ఒకే సినిమాలో పక్కపక్కనే చూడటం అసాధారణమైనప్పటికీ.. ఆధునిక సినిమాలు తరచుగా ఈ తొలి శైలిని పాశ్చాత్య నృత్య శైలితో మిశ్రమం చేస్తున్నాయి. (ఎంటీవీ లేదా బ్రాడ్ వే సంగీతాల్లో). కథానాయకుడు లేదా కథా నాయకురాలు తరచుగా.. నాట్య కారుల సమూహంతో కలసి నాట్య ప్రదర్శన చేస్తారు. భారతీయ చిత్రాల్లోని చాలా పాటలు మరియు నాట్య కలాపాలు చాలా వేగంగా ఆ పాటకు మధ్యలో అవాస్తవ రీతిలో ప్రాంతం లేదా / మరియు దుస్తులను తరచుగా మారుతుంటాయి. ఒకవేళ కథానాయకుడు మరియు కథా నాయకురాలు పాస్ ఎ డ్యూయెక్స్ (ఫ్రెంచ్ నాట్య పదజాలం దీని అర్థం “ఇద్దరి యొక్క నృత్యం) లో పాల్గొంటే అవి సుందరమైన ప్రకృతి పరిసరాల్లో లేదా భారీ సెట్టింగుల్లో “చిత్రీకరణ’ పేరుతో సాగుతాయి.

ఇప్పుడు మనం పిలుస్తున్న “ఐటం నంబర్స్’ను భారతీయ సినిమాలు ఎల్లప్పుడూ ఉపయోగించుకునేవి. ప్రధాన నటవర్గానికి మరియు సినిమా కథాంశానికి ఎలాంటి సంబంధంలేని.. శారీరకంగా అందమైన ఒక మహిళ పాత్ర (ఐటం గర్ల్) తరచుగా ఆకట్టుకునే పాట మరియు నాట్యంలో కనిపిస్తుంది. పాత సినిమాల్లో ఒక ధనికుడైన విటుడి కోసమో లేదా క్యాబరే ప్రదర్శన కోసం వేశ్య (తవైఫ్) చేత కూడా “ది ఐటం నంబర్’ ప్రదర్శింపబడుతుంది. నాట్యకారిణి హెలెన్ ఆమె క్యాబరే పాటల ద్వారా పేరు గడించింది. ఆధునిక సినిమాల్లో డిస్కోథెక్ సందర్భాలు, ఆనందోత్సాహ సందర్భాల్లో నాట్యాలు లేదా స్టేజి ప్రదర్శనల్లో ఐటం నెంబర్స్ ను జొప్పిస్తున్నారు.

భారతీయ నిర్మాతలు ఇప్పుడు ఒక సినిమా లోని పాటను ప్రదర్శించే సంగీత వీడియోలను కూడా విడుదల చేస్తున్నారు. అయితే కొన్ని ప్రోత్సాహ భరిత వీడియోల్లో.. సంబంధిత సినిమాలో కలపని పాట ప్రదర్శింపబడుతోంది.

వీటిని కూడా చూడండి

  • Category:Dances of India
  • భారతీయ జానపద నృత్యాల జాబితా
  • భాంగ్రా మరియు గిద్దా- పంజాబ్ యొక్క సంప్రదాయ నృత్య రీతులు
  • గార్బా (నాట్యం) మరియు దాండియా రాస్- గుజరాత్ యొక్క సంప్రదాయ నృత్యాలు
  • ఘూమర్: రాజస్థాన్ యొక్క సంప్రదాయ మహిళ యొక్క జానపద నృత్యం
  • ఘుమురా నృత్యం: కళహంది రాజ్యం, ఒడిషా, భారతదేశం నుంచి వచ్చిన యుద్ధ నాట్య రీతి
  • మల్లఖంబ్
  • కత్తి నృత్యం
  • నాట్యంలో భారతీయ మహిళల జాబితా
  • భారతదేశ సంస్కృతి

బాహ్య లింకులు

en:Indian Dance