"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారత్ అమెరికా సంబంధాలు

From tewiki
Jump to navigation Jump to search

భారత్ అమెరికా సంబంధాలు భారత్ అమెరికా సంబంధాలు అనగా అంతర్జాతీయ విపణిలో రెండు దేశలకు సంబంధించినవి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించినప్పటి నుండి అగ్రరాజ్యంతో భారత్ తన సంబంధాలను స్నేహపూర్వకంగా కొనసాగిస్తూ వస్తోంది. 1954 లో అమెరికా పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ వ్యూహాత్మకంగానూ మరియు భద్రతాపరంగాను సొవియెట్‌తో సంబంధాలను మెరుగుపర్చుకుంది. 1961 లో భారత్ అలీనోద్యమం స్థాపించింది. దీని ద్వారా అమెరికా రష్యా వల్ల ప్రచ్ఛన్న యుద్ధం రాకుండా అడ్డుకుంది. 1971 లో పాకిస్థాన్ తో యుద్ధం సమయంలోఅమెరికా అధ్యక్షుడు నిక్సన్ పాక్కి కల్పించిన తోడ్పాటు వలన తిరిగి 1991 లో సొవిఎట్ విచ్ఛిన్నం అయ్యెవరకు భారత్‌తో కాస్త దూరం పెరిగింది. 21వ శతాబ్దంలో భారత్ దూసుకుపొతూ దాంతో పాటే మారుతున్న మార్పులకు అనుగుణంగా విదేశంగ విధానాన్ని సరళికరించింది. అమెరికా కూడా భారత్ లాంటి దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంది. భారత్ ప్రపంచలో అతి పెద్ద ప్రజాస్వామ్యం ఐతే యూ.ఎస్., అతి పురాతన ప్రజాస్వామ్యం అవడం యాధ్రుచికం. చరిత్ర బ్రిటీషు వారి కాలంలో సంబంధాలు అంతగా లెవు. స్వామి వివేకనందా యోగాని వ్యాప్తిని చెయడం తోడ్పడింది. అంతేగాక భారత్ లో జన్మించిన ఆంగ్ల రచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ మూలంగా, మహాత్మా గాంధీ వల్ల కూడా సంబంధాలు బలపడాయి.