"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భీంపల్లి శ్రీకాంత్

From tewiki
Jump to navigation Jump to search
Bheempally Sreekanth
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
Bheempally Sreekanth.jpg
జననండాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
24.11.1976
గ్రామం : వేముల, మండలం : మూసాపేట
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
వృత్తిప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి, పరిశోధకులు, విమర్శకులు
మతంహిందూ
వెబ్‌సైటు
http://palamurupillalamarri.blogspot.in/

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.

జీవిత విశేషాలు

భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు.పాలమూరు సాహితి అనే సాహిత్య సంస్థను, పాలమూరు కల్చరల్ అకాడమీ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక లోనూ ,సింగిడి తెలంగాణ రచయితల సంఘం లోనూ క్రియాశీలకంగా పనిచేశారు.

రచనల జాబితా

పాలమూరు సాహితి ద్వారా తన సంపాదకత్వంలో అంజలి , పాలమూరు కవితా సుమాలు అనే పుస్తకాలను వెలువరించారు. తరువాత జిల్లాకు చెందిన వందమంది కవుల కవితలను సేకరించి పాలమూరు కవిత పుస్తకాన్ని 2004 లో వెలువరించారు. ఒక జిల్లా నుంచి వచ్చిన ఏకైక వచన కవితా సంకలనమిది.తెలంగాణ మీద హైకూలు రాసి సోది పేరుతో 2004లో వెలువరించారు.అక్షర తపస్వి ఆచార్య ఎస్వీ రామారావు అనే డాక్యుమెంటరికీ రచన చేశారు.కృష్ణా పుష్కరాలకు సంబంధించి పుష్కర కృష్ణవేణి అనే ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు.ప్రేమికులు ప్రయివేట్ ఆడియో ఆల్బానికి పాటలు రాశారు. నేటి విద్యార్థి, నిజం అనే సింగిల్ ఎపిసోడ్లకు మాటలు రాశారు. నాలో ఉన్న ప్రేమ అనే సింగిల్ ఎపిసోడ్ కు కథ, మాటలు రాశారు. ఛాంపియన్ అనే టెలిఫిల్మ్ కు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం వహించారు[1]. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు పాగ పుల్లారెడ్డి, మందుముల నరసింగరావుల జీవిత చరిత్రలను రచించారు.భీంపల్లి శ్రీకాంత్ బతుకమ్మ నానీలు, బతుకమ్మ మొగ్గలు ,పుష్కర భీమరథి వంటి పుస్తకాలను రచించారు. అలాగే తెలంగాణ తొలి నవలఆశాదోషం నవలను వెలుగులోకి తెచ్చి తన సంపాదకత్వంలో వెలువరించారు.

సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు

పాలమూరు జిల్లా కవుల కవితా సంకలనం పాలమూరు కవిత తన సంపాదకత్వంలో 2004 లో వెలువరించారు. ఆ తర్వాత పాలమూరు కవితాసుమాలు, అంజలి, కళాంజలి, తెలంగాణ అమరవీరుల కవితా సంకలనం అమరం, శ్రియ స్మృతిలో, శ్రీ పద్మకల్ప ప్రకాశిక , మార్కండేయ చరిత్ర,తెలంగాణ తొలి నవల ఆశాదోషం లకు సంపాదకత్వం వహించారు.

పురస్కారాలు

1996 లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు. సాహిత్యంలో వీరు చేసిన కృషికి 2002లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డు ను అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి సెమినార్లలో పాల్గొన్నారు. 40కి పైగా అవార్డులను అందుకున్నారు. వీరి కవితలకు,కథలకు బహుమతులు కూడా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు,కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.

మొగ్గలు ఆధునిక మినివచన కవిత ప్రక్రియ


భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక తెలుగు వచన కవిత్వంలో *మొగ్గలు* అనే కవితా ప్రక్రియ 2017లో ప్రారంభించాడు. ఇది మూడు పాదాల కవిత్వం.మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే మూడవ పాదం దానిని సమర్థించేదిగా ఉంటుంది.

మూలాలు

  1. పాలమూరు కవిత,సంపాదకులు:భీంపల్లి శ్రీకాంత్,పాలమూరు సాహితి, మహబూబ్ నగర్,జనవరి-2004,పేజి-160

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).