"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
భూమా నాగిరెడ్డి
భూమా నాగిరెడ్డి | |||
భూమా నాగిరెడ్డి
| |||
పదవీ కాలము 1996-1998 1998-1999 1999-2004 | |||
ముందు | పి.వి.నరసింహారావు | ||
---|---|---|---|
తరువాత | ఎస్.పి.వై.రెడ్డి | ||
నియోజకవర్గము | నంద్యాల | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలము 1992-1996 | |||
ముందు | భూమా శేఖరరెడ్డి | ||
తరువాత | భూమా శోభా నాగిరెడ్డి | ||
నియోజకవర్గం | ఆళ్ళగడ్డ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 8 జనవరి 1964||
మరణం | మార్చి 12, 2007 | (వయస్సు 43)||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | భూమా శోభా నాగిరెడ్డి | ||
సంతానము | 1కుమారుడు, 2 కుమార్తెలు | ||
మతం | హిందూ | ||
మూలం | [1] |
భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఈయన 1964 జనవరి 8 న జన్మించారు. ఈయన 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.
1996 లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు.2017 మర్చి 12 న గుండె పోటు తో మరణించారు.
వ్యక్తిగత జీవితం
ఈయన దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఈయన తన తల్లిదండ్రులైన భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మకు చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షా రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి, తనని దూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నాడు. దీని ప్రకారం నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో CBSE కి అనుబంధంగా వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించాడు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా తన జీవితం మారిపోయింది, తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షిదారునిగా మారారు. తరువాత తను సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణి ని వివాహం చేసుకున్నారు, తరువాత తను కూడా ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిగా మారారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- 1964 జననాలు
- 2017 మరణాలు
- 11వ లోక్‌సభ సభ్యులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 13వ లోక్‌సభ సభ్యులు
- 16వ లోక్‌సభ సభ్యులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు
- కర్నూలు జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- కర్నూలు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- మధ్యంతర ఎన్నికలలో ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2014)