"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మంగా శివలింగం గౌడ్

From tewiki
Jump to navigation Jump to search
మంగా శివలింగం గౌడ్
(MDS (Bombay), FICD, FPFA, MICP (USA)).
200px
మంగా శివలింగం గౌడ్
జననంమంగా శివలింగం గౌడ్
మెదక్
ఇతర పేర్లుమంగా శివలింగం గౌడ్
తండ్రిమంగా వెంకాగౌడ్
తల్లిలక్ష్మి నర్సమ్మ

మంగా శివలింగం గౌడ్ ప్రముఖ దంత వైద్యులు.దంతవైద్యానికి గొప్పతనాన్ని, దంతవైద్యులకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంలో ఆయన పడిన శ్రమ వృథా కాలేదు. అందుకే ఇప్పుడు దేశంలోని గొప్ప డెంటిస్టుల్లో ఒకరు కాగలిగారు. గవర్నర్‌కి ఫ్యామిలీ డెంటిస్ట్‌గా గౌరవాన్ని అందుకున్న ఆయనే డాక్టర్ మంగా శివలింగం గౌడ్.

జీవన ప్రస్థానం

జీవన ప్రస్థానంలో తను ఒక దంత వైద్యుడు ఎలా కాగలిగారో ఆయన ఈ విధంగా వివరించారు.

విద్యను మించిన ధనం లేదు.. నువ్వు చదువుకుని చాలా గొప్పవాడివి కావాలిరా... తెల్లకోటు వేసుకుని ఎంతోమందికి సేవచేయాలి..’ అనే తన తండ్రి మాటలు ఆ పసిమనసులో చెరగని ముద్ర వేశాయి. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించేలా చేశాయి. పట్టుపట్టి డాక్టర్ వృత్తిని చేపట్టేటట్లు చేశాయి. మంగా వెంకాగౌడ్, లక్ష్మి నర్సమ్మల ఏకైక కుమారుడిగా మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎంఎస్ గౌడ్ మెదక్ లో పుట్టి పెరిగారు. ‘పన్నెండో తరగతి పూర్తిచేసేనాటికే ఆయన మనసులో డాక్టర్ కావాలన్న సంకల్పం స్థిరపడిపోయింది. కానీ ఎంబీబీఎస్‌కి కావలసిన మెరిట్ రాలేదు. బీడీఎస్‌లో సీటు వచ్చింది. కానీ అప్పట్లో బీడీఎస్ అంటే చాలా చిన్నచూపు. మరి చేరాలా.. వద్దా..? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కష్టపడి చదివిస్తున్న నాన్నను సంతోషపెట్టడం ఎలా..? పెద్దనాన్న కొడుకులా తనూ తెల్లకోటు వేసుకోవాలి.. నాన్న కోరిక తీర్చాలి... ఇవే నా ముందున్న లక్ష్యాలు. అందుకే మరో ఆలోచన లేకుండా బీడీఎస్‌లో చేరిపోయాను

—డాక్టర్ ఎంఎస్ గౌడ్

తండ్రి ప్రోత్సాహం

మూడు సంవత్సరాల పాటు ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు ఒకే తరగతి గదిలో వారు చదివే అన్ని అంశాలు చదివినప్పటికీ సహాధ్యాయుల్లో సైతం వీరి పట్ల ఒక చులకన భావం. పంటి వైద్యాన్ని ఇన్ని సంవత్సరాలు నేర్చుకోవాలా అనే ఎద్దేవాలు ఎన్నో భరించాల్సి వచ్చింది. మలక్‌పేట్‌లోని చిన్న గదిలో ఉండి బీడిఎస్ చదువుకున్నారు. 1967లో బీడిఎస్ పూర్తి చేశారు. తర్వాత మహారాష్ట్రలో ఎండీఎస్‌లో సీటు వచ్చింది. కానీ ఇంటి పరిస్థితుల గురించి ఆలోచించిన గౌడ్ ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి కొంత వెనకాడారు. విషయం తెలుసుకున్న వారి నాన్న గారు చదువు కంటే ముఖ్యమైనది, అంతకంటే విలువైన ఆస్తి మరొకటి లేదని, ఖర్చు గురించి ఆలోచించొద్దని చెప్పి ఎండిఎస్ మాత్రమే కాదు, లండన్ కూడా వెళ్లి పై చదువులు పూర్తి చెయ్యాలని ప్రొత్సహించి పంపారు. ‘అప్పుడు మానాన్న గారి ప్రోత్సాహం కనుక లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత ఎదిగి ఉండే వాణ్ణి కాదు’ అని ఆరోజులను ఎంఎస్ గౌడ్ గుర్తు చేసుకుంటారు. 1971 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎండీఎస్ పూర్తి చేశారు.

బోధకుడిగా ప్రస్థానం

ఇంత కష్టపడి చదువు పూర్తి చేసినప్పటికీ సరియైన ఉద్యోగావకాశాలు లేవు. ఎండీఎస్ పూర్తి చేసిన తర్వాత మణిపాల్ డెంటల్ కాలేజిలో అసిస్టంట్ ప్రొఫెసర్‌ గాతన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాలని అనుకుని ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. సుల్తాన్ బజార్‌లో చిన్న క్లినిక్ ప్రారంభించారు. అప్పటికి పంటి చికిత్స గురించిన సరియైన అవగాహన సామాన్య ప్రజల్లో అసలు లేదు. పంటి చికిత్స ఆ రోజుల్లో చైనా డాక్టర్లు మాత్రమే చేసే వారు. ఆర్‌ఎంపీలకు ఉన్న గుర్తింపు కూడా డెంటిస్ట్‌లకు ఉండేది కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైనా రిఫర్ చేస్తే తప్ప పేషెంట్లు వచ్చే వారు కాదు. ‘ఈరోజుల్లో లభిస్తున్న ఈ గుర్తింపు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇది నలభై సంవత్సరాల కృషి ఫలితం.’ అంటారు డాక్టర్ ఎంఎస్ గౌడ్. డెంటిస్ట్‌లకు కూడా మిగిలిన డాక్టర్లకు దొరికే గౌరవం సాధించడానికి చాలా కష్టపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 23 సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌గా తన సేవలు అందించారు.

ఎప్పుడూ ముందే

డెంటిస్ట్రీలో వచ్చిన ఏ మార్పునైనా ముందుగా రాష్ట్రానికి పరిచయం చేసేది ఈయనే. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి కాస్మొటిక్ డెంటిస్ట్ ఎంఎస్ గౌడ్. పళ్లలో లోపాలను సరిచేసే ఈ పరిజ్ఞానాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత వీరిదే. అంతేకాదు డెంటల్‌లో లేజర్ చికిత్సల వంటి అనేక అత్యాధునిక చికిత్సలను రాష్ట్రానికి అందించింది కూడా ఈయనే. ఈ పరిజ్ఞానం రూట్ కెనాల్ చికిత్సలో, పళ్లలో సున్నితత్వాన్ని, చిగుళ్లనుంచి రక్తం రావడం, శ్వాసలో దుర్వాసన వంటి అనేక సమస్యలను సరిచేయడానికి నొప్పి లేని పరిష్కారాన్ని అందిస్తుంది. ఇప్పుడు మరింత ఆధునికమైన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియను కూడా ఈ మధ్యే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది వరకు రంగుమారిన పళ్లు, పళ్ల మధ్య సందులు బాగు చెయ్యడానికి కనీసం రెండుమూడు సిట్టింగులు అవసరమైయ్యేవి. ఇప్పుడు ఈ పరిజ్ఞానంతో కేవలం ఒకే ఒక సిట్టింగ్‌లో చికిత్స చెయ్యవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డెంటిస్ట్రిలో వస్తున్న మార్పులను మనకు అందుబాటులోకి తేవడంలో తన వంతు కృషిని ఎడతెరపి లేకుండాకొనసాగిస్తున్నారు.

డెంటిస్టుల కుటుంబం

డాక్టర్ ఎంఎస్ గౌడ్ పిల్లలు ఇద్దరు కూడా డెంటిస్టులుగానే ఉన్నారు. వారు మాత్రమే కాదు వారి భాగస్వాములు కూడా డెంటిస్టులే. సుల్తాన్ బజార్‌లో చిన్న క్లినిక్ గా మొదలైన డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు పట్టణంలో 5 శాఖలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఎదిగింది. ఇన్ని బాధ్యతలు, ఇంతటి తీరిక దొరకని సమయాల్లో సైతం ఆయన కుటుంబానికి తగినంత సమయాన్ని వెచ్చించాలనే అనుకుంటారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి తప్పని సరిగా విహారయావూతలకు వెళతారు. ‘నా ప్రతి విజయానికి స్ఫూర్తి మా నాన్నగారైతే, నా వెనకుండి నన్ను నడిపించింది మాత్రం నాశ్రీమతి. ఆమె కేవలం నా జీవిత భాగస్వామే కాదు.. హాస్పిటల్ బాధ్యతల్లో కూడా భాగస్వామే. హాస్పిటల్ డైరెక్టర్లలో ఆవిడ కూడా ఒకరు’ అని తన విజయ రహస్యాన్ని చెప్పారు ఎంఎస్ గౌడ్.

అరుదైన గౌరవాపూన్నో..

నాలుగు దశాబ్దాల వృత్తి జీవితంలో డాక్టర్ ఎంఎస్ గౌడ్ అందుకున్న అవార్డులు, ఫెలోషిప్‌లకు లెక్కలేదు. అమెరికన్ డెంటల్ అసోసొయేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మొటిక్ డెంటిస్ట్రీ వారి ఫెలోషిఫ్‌లు, అమెరికన్ డెంటిస్ట్స్ ఫెలోషిప్ కూడా అయనకు దక్కాయి. సౌత్ ఈస్ట్ ఏసియా డివిజన్ వారు సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించారు. ఇండియన్ ప్రోస్థాడాంటిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్రవూపదేశ్ గవర్నర్‌పూందరికో ఆయన గౌరవ డెంటల్ సర్జన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆల్ ఇండియా మెడికల్ బాడీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలంగాణా తెలుగువాడు కూడా డాక్టర్ ఎంఎస్ గౌడ్. ఆయన అందుకున్న అవార్డులు రివార్డులకు కొదవే లేదు.

1992 లో ఇందిరాగాంధీ జ్ఞాపక జాతీయ పురస్కారం, 1993లో మహాత్మగాంధీ జాతీయ పురస్కారం, 1996లో ఉగాది తెలుగు వైభవ పురస్కారం, 1997లో ప్రపంచ తెలుగు వైభవ పురస్కారం అదే సంవత్సరం అంతర్జాతీయ డిస్టింగ్‌షెడ్ లీడర్ షిప్ పురస్కారం వంటివి మచ్చుకు కొన్ని. తాను చదువుకునే రోజుల్లో తనతో పాటు ఎంబీబీఎస్ చదువుతున్న సహాధ్యాయులు వీళ్లు చదివేది కూడా మెడిసినేనా అని చులకన చేసి, ఎగతాళి చేసిన వారు ఆయనకు లభిస్తున్న కీర్తి ప్రతిష్ఠలను చూసి ఇప్పుడు మాక్కూడా డెంటిస్ట్రీ చదవడం వీలవుతుందా అని అడుగుతుంటారని ఒకింత గర్వంగా చెప్తారు డాక్టర్ ఎంఎస్ గౌడ్.

మూలాలు

యితర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).