"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మంచాళ జగన్నాధరావు

From tewiki
Jump to navigation Jump to search
మంచాల జగన్నాధ రావు
250px
వ్యక్తిగత సమాచారం
మూలంఆంధ్ర ప్రదేశ్
సంగీత శైలివీణ
వృత్తిఆకాశావాణి హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టు

మంచాళ జగన్నాధరావు ప్రముఖ వైణిక విద్వాంసుడు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవాడు.

జీవిత విశేషాలు

వైణికులుగా జగన్నాథ రావు గుర్తింపు పొందాడు. అతను కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యుడు. అతనికి 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడాడు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధుడైనాడు. రేడియో సంగీత కార్యక్రమాలలో అతని వీణ ద్వారా సంగీత సహకారాన్ని అందించేవాడు.

అతను మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పనిచేసాడు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పనిచేశాడు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యాడు. 1981 లో పదవీవిరమణ చేశాడు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్ (హిందీ) సంగీత రూపకాలకు స్వరరచన చేశాడు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలను నొటేషన్‌తో ప్రచురించాడు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచాడు. ఎంకి పాటలకు నండూరి సుబ్బారావుతో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించాడు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.

ఉద్యోగ జీవితం

వీరి సోదరులు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి హైదరాబాదులో కలసి పని చేశారు. జగన్నాథరావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆతర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రిటైరయ్యారు. జగన్నాథరావు హైదరాబాదులో పరమ పదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వారు. అలహాబాదు పాట్నా కేంద్రాలలో హిందూస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [1]

రచనలు

లలిత గీతాలు

  1. బంగారు పాపాయి బహుమతులు పొందాలి

గ్రంథాలు

  1. గీతగోవిందం - గీతశంకరం
  2. క్షేత్రయ్య పదములు - స్వరసహితము
  3. ఆంధ్రుల సంగీతకళ

మూలాలు

  1. "Remembering a Carnatic maestro". GUDIPOODI SRIHARI. ద హిందూ. 2006-02-10.

ఇతర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).