"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మంచిర్యాల జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.ఇది 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.[1]

మంచిర్యాల జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం

మూస:Infobox mapframe

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

మంచిర్యాల పట్టణంలో కరీంనగర్ - చంద్రపూర్ (NH 16) జంక్షన్ వద్ద హనుమాన్ విగ్రహం.

ఈ జిల్లాలో మొత్తం 2 రెవెన్యూ డివిజన్లు, (మంచిర్యాల, బెల్లంపల్లి) 18 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 18తో కలుపుకొని 362 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు నాలుగు.

స్థానిక స్వపరిపాలన

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 311 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

భౌగోళికం, సరిహద్దులు

భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో భాగంగా ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. జిల్లాకు తూర్పున మహారాష్ట్ర, ఉత్తరాన కొమరంభీం జిల్లా, దక్షిణాన పెద్దపల్లి జిల్లా, ఆగ్నేయాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పశ్చిమాన నిర్మల్ జిల్లా, నైరుతిన జగిత్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన మండలాలు.(4)

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Reorganization Of Adilabad District Into Mancherial District" (PDF).
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లంకెలు