మంచు లక్ష్మి

From tewiki
Jump to navigation Jump to search
మంచు లక్ష్మి
దస్త్రం:Lakshmi manchu.jpg
గుండెల్లో గోదారి చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో లక్ష్మి
జననం
మంచు లక్ష్మీప్రసన్న

(1970-10-08) 1970 అక్టోబరు 8 (వయస్సు 50)
భారతదేశంమద్రాసు
తమిళనాడు
ఎత్తు5"5
జీవిత భాగస్వాములుఆండీ శ్రీనివాసన్

మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .

కుటుంబము

ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.

వివాహము

ఈమె వివాహము ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఈయన అమెరికా వాసి.

పురస్కారాలు

  • నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
  • దొంగాట సినిమా లో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.
  • తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ : ఉత్తమ సహాయ నటి (చందమామ కథలు)
  • స్పెషల్ జూరి అవార్డ్ దొంగాట

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రము పాత్ర భాష ఇతర వివరాలు
2008 ద ఒడే నజ్మా ఆంగ్లము
2009 డెడ్ ఎయిర్ గబ్బి ఆంగ్లము
2011 అనగనగా ఓ ధీరుడు ఐరేంది తెలుగు 2012 నంది పురస్కారము: ఉత్తమ ప్రతినాయిక
2011 దొంగల ముఠా శివ తెలుగు

[1]

2012 డిపార్ట్‍మెంట్ సత్యా భోస్లే హిందీ
2012 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా అమృతవల్లి తెలుగు
2013 కడలి సెలీనా తెలుగు,తమిళం
2013 గుండెల్లో గోదారి చిత్ర తెలుగు, తమిళం
2017 లక్ష్మీ బాంబ్ జడ్జి లక్ష్మి, ప్రియ తెలుగు
2018 W/O రామ్‌ దీక్ష తెలుగు
2020 మా వింత గాధ వినుమా తెలుగు

బయటి లంకెలు

మూలాలు