మంటో కథలు

From tewiki
Jump to navigation Jump to search

మంటో కథలు పుస్తకం సాదత్ హసన్ మంటో వ్రాసిన ఉర్దూ కథలకు తెలుగు అనువాదం.

రచన నేపథ్యం

సాదత్ హసన్ మంటో దేశవిభజన విషాద ఘటనల నేపథ్యంలో ఈ కథలు రాశారు. బ్రిటీష్ ఇండియా స్వాతంత్ర్యం పొందే కాలంలో భారతదేశం, పాకిస్తాన్ లు విభజన చెందాయి. విభజనలో హిందువులు, ముస్లింలు, సిక్కులు తీవ్రమైన మతకలహాల వల్ల లక్షలమంది అపహరణలు, మరణాల పాలయ్యారు. అటు పశ్చిమ పాకిస్తాన్, ఇటు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్), మరోవైపు భారతదేశాల్లో ఎన్నో కుటుంబాలు, వ్యక్తులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. మంటో రచన జీవితం కూడా అదే స్థితిగతుల వల్ల ప్రభావితమైంది. దేశ విభజన నేపథ్యంలో మానవీయ కోణంలో మంటో రాసిన కథలు సాహిత్యలోకానికే కాక సమాజం అంతటికీ దిగ్భ్రమ కలిగించాయి. ఈ కథల కారణంగా మంటో కారాగారవాసాన్ని కూడా పొందారు. ఈ కథలను ఉర్దూలోంచి ఎ.జి.యతిరాజులు తెలుగులోకి అనువాదం చేశారు.

మూలాలు