"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మంథాన భైరవుడు

From tewiki
Jump to navigation Jump to search
మంథాన భైరవుడు
జననంమంథాన భైరవుడు
క్రీ.శ. 10 వ శతాబ్ది
అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా,
ప్రసిద్ధిసంస్కృత కవి
మతంజైన మతము

మంథాన భైరవుడు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి[1]... క్రీ.శ. 10 వ శతాబ్దికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు. భైరవతంత్రం పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికలో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. కవి పండితులు, పరిశోధకులు మావవల్లి రామకృష్ణ కవి కుమార సంభవానికి రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు. భైరవుడు ఆనందకందకం అను మరో గ్రంథాన్ని రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు కూడా ఈ కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.

రచనలు

  • భైరవ తంత్రం
  • ఆనందకందకం[2].

భైరవతంత్రంలోని శ్లోకాలు

గ్రంథం ప్రారంభంలో... శ్రీహర మహాశాంతం భైరవం భీమనిగ్రహం

సమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాస(వ)నం

గ్రంథాంతంలో....

ఏతత్తంత్రం మాయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః

ప్రియశిష్యాయ ధాతవ్యం పుత్రాయచ విశేషితః

ఇతి భైరవాగమే భూత తంతే సప్తవింశతి పటలః

మూలాలు

  1. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2010, పుట-6
  2. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవ సంచిక-1927, పుట-91

మూస:జోగులాంబ గద్వాల జిల్లా కవులు


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).