"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మందుల

From tewiki
Jump to navigation Jump to search

మందుల బి.సి.ఏ.గ్రూపు కులం. మందులవాళ్ళు. వీరు తెలంగాణ అన్ని జిల్లాలలో విస్తరించినప్పటికీ, రాయలసీమ, కోస్తా అంధ్రలో తక్కువగా కనిపిస్తారు. మందులోడా ఓరిమాయలోడా అనే జానపద గీతం ఈ కులస్తులపై పాడిందే.

వృత్తి, సామాజిక జీవనం

వీధిలో వనమూలికలను అమ్ము తున్న వాడు

మందులు వృత్తిపై ఆధారపడే జీవనం సాగిచేవారు, కనుక మందుల వాళ్లని పేరు వచ్చింది. మహిళలు కూడా పురుషులతోపాటు వనమూలికల సేవరణ నుంచి మందులు తయారీలో తమ వంతు సహాయం అందిం చేవారు. జలుబు, దగ్గు, తల నొప్పి వంటి వాటికి శొంఠి, మిరియాల కషాయం ఏ విధంగా ఉపయోగించుకునేవారో అదే విధంగా రుతువులు మారుతున్న సమయంలో సంక్రమించే జబ్బుల నివారణకు వీరిని ఆశ్రయించేవారు. వనమూలికలు అవసరమైన నాటువైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులు సైతం వీరిని ఆశ్రయించేవారు. వీరి అలవాట్లన్నీ గిరిజనులను పోలి ఉంటాయి. వీరి పూర్వీకులును అప్పటి ప్రభుత్వం సంచార జాతిగా గుర్తించింది. అప్పట్లో వీరు ఎక్కువగా ఊరి చివర్న ఉన్న చెరువులు, కాల్వగట్లపైన, తాటితో పుల్లో జీవించేవారు. గ్రామాలలో తిరిగి మందులు అమ్మేవారు. పది పన్నెండు కుటుంబాలు కలిసి సమూహంగా జీవించేవారు. తాటి, ఈత ఆకులతో వేసుకున్న గుడిసెల్లో కాపురముండేవారు. వంట పాత్రలు, బట్టలు, నిత్యావసర సస్తువులకన్నా జం తువులను వేటాడటానికి కావలసిన రకరకాల వల లు, ఉచ్చులు, బోనులే వారి దగ్గర ఎక్కువగా ఉండేవి. వీటన్నింటినీ చేరవేయటానికి గాడిదలు, వేటలో సహకరించటానికి కుక్క కచ్చితంగా ఈ మందుల వారి వెంట ఉండాల్సిందే. నక్క, ఊరపిల్లి, పంది, కాకి, తాబేలు, ఉడుత, ఉడుము మొదలు పిట్టలు వరకూ ఉన్న చిన్నాచితకా జంతువులను వేటాడి తింటారు. నక్క, అడవి వంది, ఉడుత... ఇలా ఆ యా జంతువు లక్షణాలనుబట్టి వేటాడే తీరు ఉండేది. జంతువులు, పక్షలు దొరక్కపోతే అడవి దుంపలను తినో, కాల్వలో చేపలను పట్టి కాల్చు కుతినో జీవిస్తారు. సంచార జాతికి ప్రత్యేక భాష ఉన్న విధంగానే వీరికీ భాష ఉంది.మందుల వాళ్లలో మూఢనమ్మకాలు ఎక్కువ. జీవితంలో ఆశలు తీరని వ్యక్తి చనిపోతే దెయ్యమై తిరుగుతూ కోర్కెలు తీర్చుకుంటుందనే నమ్మకం వీరిలో ఉంది. కనుకనే ఇటువంటి వాటికి విరుగుడు పేరుతో వీరిని దోచుకునే వారూ ఉన్నారు. ఇప్పటికీ గడ్డపార కాల్చి పట్టుకోమనటం, మరుగుతున్న నూనెలో చేయిపెట్టించటం వంటి అనాగరిక లక్షణాలు కొనసాగుతున్నాయి. కోర్టుకు వెళ్ళినా, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కులం నుంచి వెలివేస్తారు. కనుక ఎవ్వరూ అటువంటి ఆలోచనలు చేసే సాహాసం చేయ రు. కులకట్టడి కారణంగా ఎవరికివారు మిన్నకుండటంతో మూఢనమ్మకాల నుంచి వారిని కాపాడలేకపోతున్నారు.

సమస్యలు

పజావుగా సాగుతున్న వీరి వనమూలికా వైద్యంపై ఇంగ్లీషు మందుల ప్రభావం పడింది. వీరి వృత్తి దెబ్బతింది, ఆదాయం తగ్గింది, బతుకు భారమైంది. మూలికా వైద్యంలో పోల్చు కుంటే అప్పట్లో ఇంగ్లీషు వైద్యం ఖర్చు తక్కువ కావటం, మందు వాడకునే విధానం కూడా సులువు కావటంతో ప్రజలు అటువైపు మెగ్గు చూపారు. వనమూలికల విలువలు తెలిసిన గత తరంవారు క్రమంగా మృతి చెందటం, నేటి తరానికి చెంది నవారికి వీటి గురించి స్పస్టమైన అవగాహన లేకపోవటంతో కూడా వనమూలికా వైద్యం ఆదరణ కోల్పోయింది. ఈ నేప థ్యంలో క్రమంగా మందుల వారు కూడా వృత్తికి దూరయ్యా రు. ఇప్పటికీ వృత్తిని నమ్ముకున్నవారు వైద్యం చేస్తూనే కాలం గడుపుతున్నారు. పాములను పట్టి, విషపు కోరలుపీకి వాటిని రోడ్లపైనా, ఇళ్లదగ్గర ఆడించి వినోదం చూపి యాచిస్తున్నారు. పడగ విప్పి న పాము అట చూసినవారు ఇచ్చే చిల్లరతోపాటు, అవి కరిస్తే విరుగుడుగా తమ వద్ద వైద్యం ఉందని చెప్పి వనమూలికలు అమ్మి జీవిస్తున్నారు. పందులను పెంచి వచ్చిన డబ్బుతో కు టుంబాన్ని పోషించుకుంటున్నారు. పందులు పోలాల్లోకి పోయి పైరును పాడుచేస్తే రైతులు వీరిపై దాడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెదడు వాపు వ్యాధి పేరుతో పందులను చంపటంతో వీరి మళ్లీ గడ్డురోజులు దాపురించాయి. నేటికీ మందుల కులం నుంచి ఒక్క ఐఏఎస్‌, ఐపిఎస్‌ కాదుకదా... కనీసం గ్రూప్‌ వన్‌ అధికారి కూడా లేడని మందుల వాళ్లు గిరిజన లక్షణాలు కలిగి ఉన్నారు కనుక బిసి-ఏ గ్రూప్‌ నుంచి ఎస్టీలలోకి మార్చాలని. అన్ని జిల్లాలలోనూ మందుల వారికి కాలనీలను కమ్యూనిటీ హాలు ప్రభుత్వం నిర్మించాలని వీరు కోరుతున్నారు.

ఇవీ చూడండి

మూలాలు