మందులు.కె

From tewiki
Jump to navigation Jump to search
మందులు.కె
దస్త్రం:Mandulu K.jpeg
జననంమే 1, 1944
మరణంమే 22, 2002
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు

మందులు.కె (మే 1, 1944 - మే 22, 2002) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు.[1] నాటకరంగంలో చేసిన కృషికి పలు కళాసంస్థలు ఈయనకు నటకాగ్రేసర, నటవిరాట్, నటశేఖరుడు, రంగస్థల నటబ్రహ్మ వంటి బిరుదులు ఇచ్చి సత్కరించాయి.

జననం

మందులు 1944, మే 1న తాతయ్య, ముత్యాలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, రాయకుదురు గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

రాయకుదురులో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన మందులు, వీరవాసరంలో ప్రాథమికోన్నత విద్య, భీమవరంలో పియుసి విద్యను పూర్తిచేసాడు.

రంగస్థల ప్రస్థానం

బి.ఎన్. సూరి రచించిన పనిమనిషి నాటకం ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన మందులు అనేక నాటకాల్లో నటించాడు. 1984లో అర్.కె. ప్రొడక్షన్సు అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థ నుండి అనేక నాటకాలు ప్రదర్శించాడు.

నటించిన నాటకాలు

 1. కీలుబొమ్మలు
 2. అడవి
 3. ఎవరిని నమ్మకు
 4. ఉద్ధరింపు
 5. చిల్లరకొట్టు చిట్టెమ్మ
 6. ఐపీసీ 302
 7. ఛైర్మన్
 8. సమర్పణ
 9. పాపం
 10. లాటరీ
 11. కాలం వెనక్కి తిరిగింది
 12. మృత్యుంజయుడు
 13. నటన
 14. ఎంతెంత దూరం
 15. ఆకాశరామన్న
 16. రాగరాగిణి
 17. తరంగాలు
 18. ఆరణి
 19. మనిషి సావకూడదు
 20. కిం కర్తవ్యం
 21. వయసు - మనసు
 22. మరోమొహెంజదారో

దర్శకత్వం వహించిన నాటకాలు

 1. పలుకే బంగారమాయె
 2. రాజసూయ యాగం
 3. ఓ అమ్మాయి కథ
 4. అనగనగా ఒకరాజు

రచించిన నాటకాలు

మందులు కె.జి. వేణుతో కలిసి పంచతంత్రం అఖండ విప్లవజ్యోతి, అంబేద్కర్ వంటి నాటకాలు రచించాడు.

మరణం

ఈయన 2002, మే 22న మరణించాడు.

మూలాలు

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.454,455.