"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మకుటం లేని మహారాజు

From tewiki
Jump to navigation Jump to search
మకుటం లేని మహారాజు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం కె. బాపయ్య
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
చంద్రమోహన్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం ఎ. వెంకట్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

మకుటంలేని మహారాజు 1987 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని శ్రీ కృష్ణ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై కె. బాపయ్య దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.[1] ఇందులో కృష్ణ, శ్రీదేవి, రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2] ఈ చిత్రాన్ని హిందీలో అమీరీ గరీబీ (1990) గా రీమేక్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమోదైంది.[3]

కథ

పార్థసారథి ( కృష్ణ ) ఒక ఆదర్శ యువకుడు. అతని తండ్రి రాఘవయ్య ( రావు గోపాలరావు) కూ అతనికీ పడదు. రాఘవయ్య అతన్ని బహిష్కరించి, ఊరొదిలి పొమ్మని చెబుతాడు. పార్థసారథి జెబి ( నూతన్ ప్రసాద్) కీ, అతని ముఠాకీ శత్రువు అవుతాడు. ఇంతలో, ఒక సంపన్న పారిశ్రామికవేత్త, శివరాం ప్రసాద్ ( గుమ్మడి ) తన చిన్ననాటి స్నేహితుడు రాఘవయ్యను చూడటానికి వస్తాడు. అతను రాఘవయ్య కుమార్తె సుమతి ( పూర్ణిమ ) కీ, తన కుమారుడు మోహన్ ( రాజేంద్ర ప్రసాద్ ) కూ పెళ్ళి సంబంధం కుదుర్చుకుంటాడు. పార్థసారథి రహస్యంగా తన సోదరి పెళ్ళికి వస్తాడు. పెళ్ళిలో ప్రదర్శన ఇవ్వడానికి సరోజ ( శ్రీదేవి ) అనే నర్తకి వస్తుంది. మోహన్ సరోజ పట్ల ఆకర్షితుడవుతాడు కాని ఆమె పార్థసారథిని ప్రేమిస్తున్నందున అతన్ని తిరస్కరించింది. సుమతి అత్తవారింటికి వచ్చినపుడు ఆమెను అత్త రాజ్యలక్ష్మి, మరదళ్ళు రేఖ, రాణిలు ఆమెను వ్యతిరేకిస్తారు. పార్థసారథి బాల్య స్నేహితుడు గణపతి ( చంద్ర మోహన్ ) నగరానికి వస్తాడు. ఇక్కడ అతను శివరాం ప్రసాద్ తన మేనమామ అని, తన మరదలు రేఖను చిన్నతనంలోనే పెళ్ళి చేసుకున్నాననీ తెలుసుకుంటాడు. ఇప్పుడు గణపతి తన భార్య రేఖను తనతో తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటాడు. రేఖకూ, ఆమె కుటుంబ సభ్యులకూ అది నచ్చదు. మోహన్ సరోజను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది ఫలించదు. పార్థసారథి సుమతి సమస్యల గురించి తెలుసుకుంటాడు. కాబట్టి, సరోజను కాపాడటానికీ, తన సోదరి జీవితాన్ని చక్కబెట్టేందుకూ పార్థసారథి సరోజను పెళ్ళి చేసుకుంటాడు.

శివరాం ప్రసాద్ అకస్మాత్తుగా కన్నుమూస్తాడు. సుమతి అత్త ఆమెను ఇంటినుండి బయటికి గెంటుతుంది. ఇంతలో, జెబి అతని ముఠా సరోజ బావ జోగారావు (దేవదాస్ కనకాల) ను చంపి, ఆ నేరాన్ని పార్థసారథిపై నెడతారు. చెల్లెలిని కాపాడమని తండ్రి కోరినప్పుడు అతను జైలు నుండి తప్పించుకుంటాడు. జెబి మోహన్ కు పెళ్ళి చెయ్యాలని యోచిస్తున్నట్లు చెప్తారు. కాని పార్థసారథికి ఒక పాఠం నేర్పడానికి అతనిని డబుల్ క్రాస్ చేస్తారు. తన తప్పును గ్రహించిన మోహన్‌ను పార్థసారథి రక్షిస్తాడు. చివరగా, పార్థసారథి విలన్లను ఓడించి కుటుంబాన్ని తిరిగి కలుపుతాడు.

తారాగణం

పాటలు

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "మా కంటి జాబిల్లి" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:05
2 "అడగంధే అమ్మైనా" రాజ్ సీతారామ్, ఎస్.జానకి 4:10
3 "చిత్తడి చిత్తడి" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:12
4 "హే హే హీరో" రాజ్ సీతారామ్, ఎస్.జానకి 4:01
5 "నైనా నంది" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:14
6 "అర్జున ఫల్గుణ" పి. సుశీల 4:15

మూలాలు