"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మచిలీపట్నం కలంకారీ

From tewiki
Jump to navigation Jump to search
70px ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

మచిలీపట్నం కలంకారీ
ప్రత్యామ్నాయ పేర్లుమచిలీపట్నం కలంకారీ
వివరణమచిలీపట్నం కలంకారీ (Machilipatnam Kalamkari) అనేది వెజిటబుల్ డైస్ (కూరగాయల అద్దకం) తో కూడుకొనిఉన్న అచ్చులతో బట్టలపై వేసే వివిధ చిత్రాలతో కూడినది.
రకంహస్తకళ
ప్రాంతంమచిలీపట్నం
దేశంభారతదేశం
నమోదైనది2012

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

మచిలీపట్నం కలంకారీ (Machilipatnam Kalamkari) అనేది వెజిటబుల్ డైస్ (కూరగాయల అద్దకం) తో కూడుకొనిఉన్న అచ్చులతో బట్టలపై వేసే వివిధ చిత్రాలతో కూడినది. ఇది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన కలంకారీ పరిశ్రమ.[1] అచట దక్షిణ భారతదేశంలో గల ముస్లిం రాజవంశీయుల గోడలపై ఉన్న వివిధ చిత్రాల అలంకరణలను ఉపయోగిస్తారు.

చరిత్ర

ఈ కలంకారీ పరిశ్రమ కృష్ణా జిల్లా లోని మచిలీపట్నం దగ్గరలో గల పెడన గ్రామంలో అభివృద్ధి చెందింది. పలు పౌరాణిక దృశ్యాలను, పూలతీగాలను, అమ్మాయిల నృత్య భంగిమలను డిజైన్లగా చిత్రీకరించి ఆనంతరం వెజిటబుల్ డైస్ తో రంగులు అద్దుతారు. 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల పాలనా కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణ నిలుస్తున్నాయి. దీనికి కారణం కలంకారీకి వినియోగిస్తున్న సహజ రంగులు. బ్రిటిష్‌ కాలంలో మచిలీపట్నంలోనే కలంకారీ పరిశ్రమలు ఉండేవి. తరువాతి కాలంలో బ్రిటిష్‌వారి విధానాలతో మూతపడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం కమలాభాయ్‌ ఛటోపాధ్యాయ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మళ్లీ పునరుత్తేజాన్ని నింపారు. అయితే అప్పటికే ఈ పరిశ్రమ మచిలీపట్నం నుంచి పక్కనే ఉన్న పెడనకు వెళ్లిపోయింది. అయినప్పటికీ మచిలీపట్నం కలంకారీగానే పేటెంట్‌ పొందడంతోపాటు విదేశాల్లోనూ పేరు పొందింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లో దాదాపు 10వేల మంది ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఐరోపా‌ దేశాలతోపాటు ఆస్ట్రేలియా ఖండాల్లోనూ ఈ దుస్తులకు డిమాండ్‌ ఉంది.[2]

కలంకారీ విధానం

మచిలీపట్నం కలంకారీ కళలో అచ్చు వేయవలసిన అద్దకం మూసలను పెద్ద చెక్కముక్కలతో తయారుచేస్తారు. దీనిని కూరగాయలతో తయారుచేసిన సహజ రంగులను ఉపయోగించి చీరలు, యితర దుస్తులపై అద్దకం రంగులను వేస్తారు. ఈ చిత్రాలలో పురాణాలలో కథలు, పాత్రల గూర్చి చిత్రిస్తారు. ఒక డిసైన్ చేయడానికి అనేక రోజులు పడుతుంది. అద్దకం, చేతితో అచ్చు వేయడం అనే ప్రక్రియలో చాలా విస్తృతమైనది. పూర్తిగా ఒక వస్త్రంపై కలంకారీ చేయడానికి అనేక దశలు ఉంటాయి. అనెక రకాల పైంటింగ్ స్టైల్ కన్నా కలంకారీ కళతో కూడిన వస్త్రానికి మంచి డిమాండ్ ఉంటుంది. వస్త్రం యొక్క నాణ్యత బట్టి దానిపై వేయవలసిన రంగులు కూడా వివిధరకాలుగా మారుస్తారు. ప్రతి దశలోనూ దానికి పట్టి ఉంచే రంగులను శుభ్రం చేసి దానిపై పట్టేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కలంకారీ కళకు హానిచేయని, సహజసిద్ధమైన రంగులను వాడుతారు. ముఖ్యంగా నాలుగు రంగులను వాడుతారు. ఎరుపు రంగును భారతీయ మేడర్ చెట్టు వేరు నుండి తీస్తారు. పసుపు రంగును దానిమ్మ గింజల నుండి లేదా మామిడిచెట్టు బెరడు నుండి తీస్తారు. నీలం రంగును ఇండిగో (నీలిమందు చెట్టు) నుండి, నలుపు రంగును మైరోబాలన్ పండు నుండి తీస్తారు. రసాయనిక అద్దకం రంగులను ఉపయోగించరు.[3]

నాణ్యత పెంపు

కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు సహజసిద్ధమైన రంగులతో లినెన్ వస్త్రంపై చెక్క అచ్చుల (బ్లాక్స్) అద్దకంతో డిజైన్లు ముద్రించేవారు. కోల్‌కతాకు చెందిన ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ గ్రూపులోని జయశ్రీ టెక్స్‌టైల్స్ (జేఎస్టీ) కలంకారీ వస్త్రాలను మరింత నాణ్యతతో వేగంగా తయారు చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది.[4]

జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ

పెడన గ్రామంలో గల వెజిటబుల్ డై హాండ్ బ్లాక్ కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెన్నై నుండి కలంకారీ పరిశ్రమకు "జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ" (GIR) ను పొందారు. దీని ఫలితంగా "మచిలీపట్నం కలంకారీ" గుర్తింపు పొందింది. ఈ పెడన గ్రామం మచిలీపట్నంకి 15 కి.మీ దూరంలో ఉంది.[5]

ఈ రిజిస్ట్రీ విధానం ప్రకారం ఈ ప్రాంత కలంకారీ పరిశ్రమకు ఒక వాడుకరి సఖ్య AU/396/GI/19/12 నమోదైనది. దీని ప్రకారం మచిలీపట్నం కలంకారీ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒకటి. ఇది కృష్ణా జిల్లా లోని గూడూరు మండలానికి చెందిన పెడన పట్టణం, దాని అనుబంధ గ్రామాలైన మచిలీపట్నం, పోలవరం, కప్పలదొడ్డి లలో మాత్రమే విస్తరించి వుంది[5].

మూలాలు

  1. "News Archives: The Hindu".
  2. "కలంకారీ పరిశ్రమ , ఈనాడు లో కృష్ణా జిల్లా ఎడిసన్". Archived from the original on 2016-01-21. Retrieved 2016-01-22.
  3. "The Making Of Kalamkari". http://www.indiantravelportal.com. Archived from the original on 7 జనవరి 2017. Retrieved 22 January 2016. Check date values in: |archive-date= (help); External link in |website= (help)
  4. యూరప్‌కు కలంకారీ ఎగుమతి Sakshi | Updated: August 21, 2014 01:49 (IST)
  5. 5.0 5.1 "Pedana Kalamkari art form gets GI tag". T. APPALA NAIDU. The Hindu. August 18, 2013. Retrieved 22 January 2016.

ఇతర లింకులు