మడికొండ (గ్రామీణ)

From tewiki
Jump to navigation Jump to search

మడికొండ (గ్రామీణ), వరంగల్ జిల్లా, హనుమకొండ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం అతి ప్రసిద్ధము. ఖాజీపేట స్టేషనుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళోజీ, పీవీ లాంటి వారు ఈ ఊర్లో కొద్ది కాలం గడిపిన వారే.ఈ ఊరు పేరు పూర్వం మనిగిరి కాలక్రమేన మడికొండగా మారింది.ఇక్కడ ఐదు ప్రభుత్వ పాఠశాలలు.10వరకు ఇతర పాఠశాలలు ఉన్నాయి.

మడికొండ (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం హనుమకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 9,606
 - స్త్రీల సంఖ్య 9,623
 - గృహాల సంఖ్య 4,778
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన రెండు ఆలయాలున్నాయి. 1. రామాలయము. 2. మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం. 1198 - 1261 మద్య కాలంలో కాకతీయ రాజులు ఆలయాలను నిర్మించి నట్లు శాసనాలను బట్టి తెలుస్తున్నది. ఇక్కడ నవ సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతంలో నవ గుండాలున్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి పాలగుండం., జీడి గుండం., కన్ను గుండం, కత్తి గుండం, రామ గుండం, గిన్నె గుండం. ప్రతి ఏటా ఈ మెట్టు గుట్టపై మహా శివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ క్షేత్రానికి దక్షిణ కాశి అని పేరు కూడా ఉంది.

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 19,229 - పురుషుల సంఖ్య 9,606 - స్త్రీల సంఖ్య 9,623 - గృహాల సంఖ్య 4,778
https://web.archive.org/web/20160722104724/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09

మూలాలు

  1. వరదాచార్యులు, వానమామలై (1957). ఆహ్వానం. సికిందరాబాద్. Retrieved 6 December 2014.

వెలుపలి లింకులు