మద్దిరాలపాడు

From tewiki
Jump to navigation Jump to search


మద్దిరాలపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

మద్దిరాలపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523262. ఎస్.టి.డి.కోడ్: 08592.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చదలవాడ 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, నాగులుప్పలపాడు 5 కి.మీ, త్రోవగుంట 5 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 5 కి.మీ, మద్దిపాడు 7.6 కి.మీ, ఒంగోలు 11.5 కి.మీ, కొరిశపాడు 17.6 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

  1. పెనుబోతు వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల:- ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి. [9]
  2. శ్రీజ ఉన్నత పాఠశాల.
  3. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ గ్రామ పాఠశాల విద్యార్థి వి.రామకృష్ణ పాల్గొని, తన ప్రతిభ కనబరచి, కాంస్యపతకం సాధించాడు. [3]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వర్ణ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఆరామ క్షేత్రం

నిర్మాణంలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

  1. శ్రీ చాగంటి సింగయ్య.
  2. శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామంలో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్థులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]
  2. మద్దిరాలపాడు గ్రామంలో 2015, మే నెల-13వ తేదీ నుండి 18వ తేదీ వరకు, మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో అఖిల భారతస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించెదరు. మొత్తం ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, ఏడు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేసెదరు. [5]
  3. ఈ గ్రామసమీపములో, గుండ్లకమ్మ నదిలో 50 ఎకరాలలోని ఒక ఇసుకరీచ్ ను గుర్తించారు. [6]
  4. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,269.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,152, మహిళల సంఖ్య 1,117, గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 735 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,488 - పురుషుల సంఖ్య 1,268 - స్త్రీల సంఖ్య 1,220 - గృహాల సంఖ్య 673
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-16; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-28; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-23; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే-11; 11వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-4; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-28; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-22; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జులై-11; 1వపేజీ.