మద్దిరాల - ముప్పాళ్ళ

From tewiki
Jump to navigation Jump to search


మద్దిరాల - ముప్పాళ్ళ
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

మద్దిరాల - ముప్పాళ్ళ, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్:523109. ఎస్.టి.డి కోడ్:08598.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

ఇవి పక్క పక్కనే ఉండే రెండు గ్రామాలు. జనాభా సుమారు రెండు వేలు.

సరిహద్దు గ్రామాలు

ఈదుమూడి, తిమ్మసముద్రం, దుద్దుకూరు, కొణికి, భీమవరం, చింతగుంపల, గొనసపూడి సరిహద్దు గ్రామాలు.

సమీప పట్టణాలు

మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- గ్రామంలో ఈ పాఠశాల డిసెంబరు-1940 లో ఒక ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటయినది.

గ్రామంలో మౌలిక వసతులు

నీటిశుద్ధి మంచినీటి పథకం

మద్దిరాల గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పథకం, విజయదశమి రోజున, అక్టోబరు-13, 2013 నాడు ప్రారంభించబడింది. [2]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

ఊర చెఱువు చూడ ముచ్చట గొలుపుతుంది.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మండవ లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ శ్రీనివాసరావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ రామాలయము.
  2. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా, 2015,జూన్-30వ తేదీ మంగళవారంనాడు, విశేష అలంకరణలో, శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. [3]
  3. గ్రామదేవత శ్రీపోలేరమ్మఅమ్మవారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

పప్పుదినుసులు ఇక్కడి ప్రధానపంటలు. ముఖ్య పంటలు : వరి, వరిగలు, శనగ, మొక్కజొన్న, పెసర, మినుము, పసుపు, పొగాకు, వేరుశనగ, మిర్చి, ప్రత్తి, కంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఎక్కువ మంది వ్యవసాయ దారులు. పశుపోషణ కూడా ముఖ్య వృత్తే.

గ్రామ విశేషాలు

గ్రామ జనాభాలో ఎక్కువ మంది కమ్మ కులము వారు. ఈ గ్రామ జనాభాలో కమ్మ, కుమ్మరి, చాకలి కులస్తులు ఎక్కువగా ఉన్నారు.

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,656.[2] ఇందులో పురుషుల సంఖ్య 810, మహా:ిళల సంఖ్య 846, గ్రామంలో నివాస గృహాలు 468 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 740 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,702 - పురుషుల సంఖ్య 835 - స్త్రీల సంఖ్య 867 - గృహాల సంఖ్య 506
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,అక్టోబరు-14. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-30; 2వపేజీ.