మయుడు

From tewiki
Jump to navigation Jump to search

మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు. ఇతనికి మయాసురుడు అని కూడా పేరు.

త్రిపుర

మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణములను నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు గొప్ప ఐశ్వర్యము, బలముతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. కానీ వాటి చెడు గుణము వల్ల శివుడు వాటిని నాశనము చేసాడు. ఆ నాశనమును శివ భక్తుడైన మయుడు తప్పించుకున్నాడు.

రామాయణంలో

మయుడు మయ రాష్ట్ర అను పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసికొన్నాడు. మయ రాష్ట్రను ఇప్పుడు మీరట్ అని పిలుస్తారు. లంకాధిపతి అయిన రావణుని అందమైన భార్య మండోదరి మయుని కుమార్తె.

మహాభారతంలో

యధిష్టురునికి ఇంద్రప్రస్థంలో ఒక అధ్భుతమైన భవనమును నిర్మించి ఇచ్చాడు. ఆ భవనమే మయసభగా పేరొందింది.

చూడండి