మయ నాగరికత

From tewiki
Jump to navigation Jump to search

Script error: No such module "Pp-move-indef".

మయ నాగరికత అనేది మీసోఅమెరికా యొక్క నాగరికత. ఇది పూర్వ-కొలంబియా అమెరికన్ల యొక్క పూర్తిగా అభివృద్ధి చెందిన వ్రాసిన భాషకు పేరుపొందినది మరియు కళలు, నిర్మాణశాస్త్రము మరియు గణిత మరియు జ్యోతిష్య వ్యవస్థలకు కూడా ఇది ఎంతో ప్రాచుర్యము పొందింది. తొలుత పూర్వ-క్లాసిక్ కాలములో స్థాపించబడిన (c. 2000 BC to 250 AD), మీసో అమెరికా యొక్క కాలక్రమము ప్రకారము, చాలా మయ నగరాలు, క్లాసిక్ కాలములో అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి (c. 250 AD to 900 AD), మరియు క్లాసిక్ తరువాతి కాలము అంతయు స్పానిష్ వారి ఆగమనము వరకు కొనసాగాయి.

ఈ ప్రాంతము యొక్క ముఖ్య లక్షణమైన అత్యున్నత స్థాయి పరస్పరక్రియ మరియు సాంస్కృతిక వ్యాప్తి కారణంగా ఈ మయ నాగరికత ఇతర మీసో అమెరికా నాగరికతలతో ఎన్నో స్వభావాలను పంచుకుంటుంది. లేఖనం, శాసనం మరియు క్యాలెండరు వంటి అభివృద్ధులు ఈ మయ నాగరికతలో ఉద్భవించినవి కాకపోయినా వాటిని ఈ నాగరికత ఎంతగానో అభివృద్ధి పరచింది. మయ యొక్క ప్రభావము హోండురాస్, గ్వాటెమాల, ఉత్తర EI సాల్వడార్ మరియు మధ్య మెక్సికో నుండి కూడా కనుగొనవచ్చు. ఇవి మయ ప్రాంతము నుండి సుమారు 1000 కి.మీ. (625 మైళ్ళు) దూరంలో ఉన్నాయి. మయ కళ మరియు నిర్మాణశాస్త్రములలో ఎన్నో బాహ్య ప్రభావాలు కనబడతాయి. ఇవి వాణిజ్య మరియు సాంస్కృతిక పరస్పర మార్పుల ఫలితము అని, నేరుగా బాహ్య ఆక్రమణల ఫలితము కాదని భావించబడుతుంది.

మయ ప్రజలు క్లాసిక్ కాల పతనము సమయములో కాని స్పానిష్ కాంక్విస్టేడరులు ఆగమన సమయములో కాని మరియు అమెరికా యొక్క స్పానిష్ వలసల సమయములో కాని అదృశ్యము కాలేదు. ఈనాడు, మయ మరియు వారి వారసులు మయ ప్రాంతము అంతటా లెక్కించదగ్గ జనాభా అయ్యారు మరియు వారు పూర్వ-కొలబియా మరియు తరువాతి-ఆక్రమణల ఆలోచనలు మరియు సంస్కృతుల ఫలితమైన నిర్దిష్టమైన సంప్రదాయాలు మరియు నమ్మకాలు పాటిస్తున్నారు. చాలా మయ భాషలు ఇప్పటికీ, ప్రాథమిక భాషలుగా మాట్లాడబడుతున్నాయి. ఆచి భాషలో రచించబడిన ఒక నాటకము రాబినల్ ఆచి, మాస్టర్‌పీస్ ఆఫ్ ది ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటిగా UNESCO చే ప్రకటించబడింది.

భౌగోళిక పరిధి

క్లాసిక్ మరియు క్లాసిక్ తరువాతి కాలముల ముఖ్యమైన మయ ప్రాంతములు.అంతర్గత అంచు (ఎరుపు) మయ నాగరికత యొక్క పరిమితి; బహిర్గత అంచు (నలుపు) ఇతర మేసో-అమెరికా సంస్కృతులు.

మయ నాగరికత ఇప్పటి దక్షిణ మెక్సికో రాష్ట్రాలు అయిన చియపాస్, టబాస్కో మరియు ది యుకాటాన్ పెనిన్సులా రాష్ట్రాలు అయిన క్వింటానా రూ, కంపెచే మరియు యుకాటాన్ లలో విస్తరించి ఉండేది. మయ ప్రాంతము ప్రస్తుత దేశాలైన గ్యుటెమాల, బెలిజ్, ఉత్తర EI సాల్వడార్ మరియు పశ్చిమ హోండూరస్ తో కలిపి ఉత్తర మధ్య అమెరికా ప్రాంతము అంతటా వ్యాపించింది.

మయ ప్రాంతము మూడు మండలాలుగా విభజించ బడింది: దక్షిణ మయ పర్వత ప్రాంతాలు, మధ్య లోతట్టు ప్రాంతాలు మరియు ఉత్తర లోతట్టు ప్రాంతాలు. దక్షిణ మయ పర్వతప్రాంతాలు గ్యుటెమాల మరియు చియపాస్ పర్వతప్రాంతాలలో ఉన్న ప్రాంతము అంతా కలిపి ఉంటుంది. పర్వత ప్రాంతాలకు ఉత్తరాన దక్షిణ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మరియు మెక్సికో రాష్ట్రాలు కాంపెచే మరియుక్వింటానా రూ మరియు ఉత్తర గ్యుటెమాల, బెలిజ్ మరియు EI సాల్వడార్ తనలో కలుపుకుంటుంది. ఉత్తర లోతట్టు ప్రాంతాలు మిగిలిన యుకటాన్ పెనిన్సుల, ప్యూక్ పర్వతాలతో సహా కప్పబడి ఉంది.[1]

చరిత్ర

పూర్వక్లాసిక్

మయ నాగరికత తొలుత క్రీ.పూ. 10వ శతాబ్దములో ఉండేది.బెలిజ్ లోని సుయెల్లో వద్ద మయ ఆక్రమణ యొక్క ఇటీవలి ఆవిష్కరణలు క్రీ.పూ. 2600 నాటివని తేలింది.[2][3] ఆక్రమణ యొక్క ఈ స్థాయిలో స్మారక కట్టడాలు కూడా ఉన్నాయి. మీసో అమెరికా లాంగ్ కౌంట్ క్యాలెండరు పై ఆధారపడిన మయ క్యాలెండరు క్రీ.పూ. 3114, ఆగస్టు 11న ప్రారంభమయింది. అయినప్పటికీ, "ఆమోదింపబడిన చరిత్ర" ప్రకారము, మొదటి స్పష్టమైన "మయ" నివాసాలు క్రీ.పూ. 1800లో పసిఫిక్ తీరాన సోకోనుస్కో ప్రాంతములో స్థాపించబడినవి. ప్రారంభ పూర్వ క్లాసిక్[4] అనబడే ఈ కాలములో స్థానబద్ధమైన సమాజాలు ఉండేవి మరియు కుమ్మర స్వరూపాలు మరియు మట్టి ఆకారములు ప్రవేశపెట్టబడ్డాయి.[5]

దక్షిణ మయ లోతట్టు ప్రాంతాలలో ముఖ్యమైన ప్రాంతాలు నక్బే, EI మిరాడార్, సివాల్, మరియు శాన్ బర్టోలో. గ్యుటేమాలన్ పర్వతప్రాంతాలలో కమినల్ జుయు క్రీ.పూ. 800లో ఆవిర్భవించింది. చాలా శతాబ్దాల వరకు అది జేడ్ మరియు అబ్సీడియన్ వనరులను పెటేన్ మరియు పసిఫిక్ లోతట్టు ప్రాంతాల కొరకు నియంత్రించింది. క్రీ.పూ.600 పరిసర కాలములో ఇజాప, తకాలిక్ అబజ్ మరియు చోకోల యొక్క ముఖ్యమైన తొలి ప్రాంతాలు కాకో యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు. మధ్యస్థంగా ఉండే మయ సమాజాలు ఉత్తర మయ లోతట్టు ప్రాంతాలలో కూడా మధ్య మరియు తరువాతి పూర్వక్లాసిక్ కాలములో అభివృద్ధి చెందడము ప్రారంభించాయి. అయినప్పటికీ వీటికి దక్షిణ లోతట్టు ప్రాంతాల యొక్క పెద్ద కేంద్రాల పరిమాణము, కొలత మరియు ప్రభావము లోపించాయి. రెండు ముఖ్యమైన పూర్వక్లాసిక్ ఉత్తర ప్రాంతాలు కొంచెన్ మరియు డిజిబిల్చల్టన్. మయ చిత్రలిపిలో మొదటి లేఖన శాసనాలు కూడా ఈ కాలమునకు చెందినవే (c. క్రీ.పూ. 250).[6]

మయ మరియు దాని పొరుగు పూర్వక్లాసిక్ మేసోఅమేరికా నాగరికతల భౌతిక మరియు సాంస్కృతిక విస్తరణలను విభేదించే సరిహద్దుల విషయంలో విరుద్ధ భావాలు ఉన్నాయి. ఉదాహరణకు టబాస్కో లోతట్టు ప్రాంతాల ఒల్మేక్ సంస్కృతి మరియు మిక్సే-జోక్యూ మరియు జాపోటేక్ మాట్లాడే చియాపాస్ మరియు దక్షిణ ఒఅక్సాక ప్రజలు, వరుసగా. ఈ అతివ్యాప్తమైన మండలములో కనబడిన తొలి ప్రముఖమైన శాసనాలు మరియు భవనాలు, ఈ సంస్కృతులు మరియు ఏర్పడుతున్న మయ ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నాయని తెలుస్తోంది.[7] గ్యుటెమాల యొక్క పసిఫిక్ వాలులలోని తకాలిక్ అబజ్ ఒల్మేక్ మరియు మయ లక్షణాలు కనబడ్డ ఒకే ఒక ప్రాంతము.

క్లాసిక్

పాలంక్యూ యొక్క శిథిలాలు

ది క్లాసిక్ పీరియడ్ (c. క్రీ.శ. 250–900 ) పెద్ద తరహా నిర్మాణాలు మరియు పట్టణీకరణ, స్మారక శాసనాల యొక్క రికార్డింగ్ యొక్క అత్యున్నత స్థాయిని చూసింది. ఈ కాలము వివేకవంతమైన మరియు కళాత్మక అభివృద్ధిని ముఖ్యంగా దక్షిణ లోతట్టు ప్రాంతాలలో చూసింది.[8] వ్యవసాయ పరంగా అవధారణార్ధకమైన, నగర-కేంద్ర సామ్రాజ్యమును అభివృద్ధి చేశారు. ఇందులో చాలా స్వతంత్ర నగర-రాజ్యములు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైన టికాల్, పాలెంక్యూ, కోపాన్ మరియు కలక్ముల్ నగరాలే కాకుండా తక్కువ ప్రాముఖ్యంగల ఇతర నగరాలలో డాస్ పిల్స్, ఉక్సాక్తాన్, అల్తాన్ హా మరియు బోమంపాక్ కూడా ఉన్నాయి. ఉత్తర మయ లోతట్టు ప్రాంతాలలో తొల్లి క్లాసిక్ నివాసముల పంపిణీ దక్షిణ మండలము మాదిరిగా స్పష్టముగా తెలియదు కాని ఒక్స్కిన్తోక్, చున్న్చుచ్మిల్ మరియు తొలి ఆక్రమణ అయిన ఉక్స్మల్ వంటి అనేక జనాభా కేంద్రాలను కలిగి ఉంది.

ప్రముఖమైన స్మారక కట్టడాలు స్టెప్డ్ పిరమిడ్లు. వీటిని వారు తమ మతపరమైన కేంద్రాలలో మరియు తమ పాలకుల కూడా ఉండే రాజభవనాలలో నిర్మించారు. మయ ప్రాంతములో కాన్సుఎన్ రాజభవనము అతి పెద్దది కాని ఈ ప్రాంతములో పిరమిడ్లు లోపించాయి. ఇతర ముఖ్యమైన పురావస్తు శిథిలాలు ఇవి: స్టేలే అని సామాన్యంగా పిలువబడే చెక్కబడిన రాతి ఫలకాలు (మయ వాటిని తెటున్ లేక "ట్రీ-స్టోన్స్" అని పిలిచింది). వీటిపై ఉన్న చిత్రలిపి పాలకుల యొక్క వంశావళిని, సైన్యపు విజయాలను మరియు ఇతర సరంజామా గురించి తెలుపుతుంది.[9]

మయ నాగరికత ఇతర మీసో అమెరికా నాగరికతలతో దూర ప్రాంతపు వాణిజ్యములో పాల్గొనింది, వీటిలో తెఒతిహుఅకన్, ది జాపోటేక్మరియు మధ్య మరియు గల్ఫ్-తీర మెక్సికో లోని ఇతర సమూహాలతో మరియు మరింత దూరమైన నాన్-మీసోఅమెరికా సమూహాలతో ఉదాహరణకు కరిబ్బీన్ లోని ది టైనోస్. పురావస్తుశాస్త్రజ్ఞులు చిచెన్ ఇట్జా యొక్క సేక్రేడ్ కేనోట్ లోని పనామ నుండి బంగారాన్ని కనుగొన్నారు.[10] ముఖ్యమైన వాణిజ్య వస్తువులలో కాకో, ఉప్పు, సముద్రపు గవ్వలు, జేడ్ మరియు అబ్సీడియన్ ఉన్నాయి.

మయ నాగరికత కూలిపోవడము


దక్షిణ లోతట్టు ప్రాంతాలలో ఉన్న మయ కేంద్రాలు 8వ మరియు 9వ శతాబ్దాలలో పతనానికి గురయ్యాయి మరియు ఆ తరువాత నిరాదరణకు గురయ్యాయి. ఈ పతనము తోడుగా స్మారక శాసనాలు మరియు పెద్ద తరహా వాస్తుకళ నిర్మాణాలు కూడా ముగింపుకు వచ్చాయి.[11] ఈ పతనము యొక్క వివరణపై ప్రపంచ వ్యాప్తంగా అమోదించబడిన సిద్ధాంతము ఏదీ లేదు.

మయ పతనము యొక్క జీవావరణ శాస్త్రము-కాని సిద్ధాంతాలు ఎన్నో ఉపవర్గాలుగా విభజించ బడ్డాయి, ఉదాహరణకు, అధిక జనాభా, విదేశీ ఆక్రమణ, రైతుల తిరుగుబాటు, మరియు ప్రధాన వాణిజ్య మార్గాల మూసివేత. పర్యావరణ విజ్ఞానానికి సంబంధించన ఉపకల్పనలలో పర్యావరణ చేటు, మహామారి రోగాలు మరియు వాతావరణ మార్పు ఉన్నాయి. మయ జనాభా పర్యావరణము యొక్క క్యారియింగ్ సామర్ధ్యానికి మించిందని, వ్యవసాయ ఉత్పత్తి అడుగంటిందని మరియు మెగాఫౌనాను ఎక్కువగా వేటాడారని నిరూపించే ఆధారాలు ఉన్నాయి.[12] 200 ఏళ్ళ వరకు కొనసాగిన తీవ్ర స్థాయి కరువు కారణంగా మయ నాగరికత కూలిపోయిందని కొంతమంది మేధావులు సిద్ధాంతీకరించారు.[13] సరస్సు అడుగు భాగాలను[14], పాతకాలం పుప్పొడులను మరియు ఇతర సమాచారాన్ని అధ్యయనం చేసే భౌతిక శాస్త్రవేత్తల అధ్యయనం మూలంగా కరువు సిద్దాంతం ఉద్భవించింది. కాని ఇది పురావస్తు శాఖ సంఘము నుండి ఉద్భవించలేదు.

క్లాసిక్ తరువాతి కాలము

తరువాత వచ్చిన క్లాసిక్ తరువాతి కాలములో (10వ శతాబ్దము నుండి 16వ శతాబ్దము ప్రారంభము వరకు) ఉత్తరాది కేంద్రాలలో అభివృద్ధి ఉంది. ఇది బాహ్య ప్రభావాల భిన్నత్వము పెరగడము ముఖ్య లక్షణముగా ఉంది. యుకాటిన్ లోని ఉత్తర లోతట్టు ప్రాంతాలలోని మయ నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందడము కొనసాగించాయి; ఈ యుగములోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు : చిచెన్ ఇట్జా, ఉక్స్మల్, ఎద్జ్నల్ మరియు కొబ. చిచెన్ మరియు ఉక్స్మల్ యొక్క పాలక రాజవంశాల పతనము తరువాత, మయపాన్ 1450లో తిరుగుబాటు వరకు యుకాటిన్ ప్రాంతములన్ని పరిపాలించారు. (ఈ నగరము యొక్క పేరు "మయ" అనే పేరుకు ముఖ్య వనరు కావచ్చు. ఇది యుకాటేక్ మరియు కొలోనియల్ స్పానిష్ లో భౌగోళికంగా మరింత పరిమితమైన అర్ధము కలిగియుంది మరియు దాని 19వ మరియు 20వ శతాబ్దము యొక్క ప్రస్తుతపు అర్ధమునకు పెరిగింది). స్పానిష్ వారు యుకాటిన్ ను ఆక్రమించే వరకు ఆ ప్రాంతము పోటీ పడే నగర-రాజ్యాలుగా చీలిపోయింది.

మధ్య పెటేన్ యొక్క ఇట్జా మయ, కోవోజ్ మరియు యలేయిన్ సమూహాలు "క్లాసిక్ కాలపు కూలడము"లో తక్కువ సంఖ్యలలో మరియు 1250 తమకుతామే పునర్నిర్మించుకొని పోటీపడే నగర-రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఇట్జా తన రాజధానిగా తయాసల్ (నొహ్ పెటేన్ అని కూడా పిలువబడేది) ను నిర్వహించాయి. ఈ నగరము ఒక లేక్ పెటేన్ ఇట్జా పై గ్యుటెమాల లోని ఫ్లోరేస్ వంటి ఆధునిక నగరాలకు ఇది పునాది వేసింది. అది పెటేన్ సరస్సు ప్రాంతము అవతల విస్తరించిన ప్రాంతమంతయు పాలించింది. ఈ ప్రాంతము క్వేక్సిల్ సరస్సుపై ఉన్న ఎకిక్సిల్ సమాజమును చుట్టుకొని ఉంది. జాచ్పెతెన్ వద్ద కోవోజ్ తమ రాజధానిని ఏర్పాటుచేసుకున్నారు. క్లాసిక్ తరువాతి మాయ రాష్ట్రాలు దక్షిణ పర్వత ప్రాంతాలలో కూడా కొనసాగాయి. ఈ ప్రాంతములో మయ దేశాలలో ఒకటైన, క్యుమర్కాజ్ యొక్క కిచె రాజ్యము, మయ యొక్క చారిత్రిక రచనలకు మరియు పౌరాణిక విద్యకు పేరుగాంచిన పోపోల్ వుహ్ కు బాధ్యత వహిస్తుంది. ఇతర పర్వతప్రాంతా రాజ్యాలలో ఉన్నవి: హుయెహుయెతెనాంగొ వద్ద ఉన్న మాం, ల్క్షిమ్చె వద్ద ఉన్న కక్చికేల్, మిక్స్కో వీజో[15] వద్ద ఉన్న చజోమ మరియు శాన్ మాటియో ఇక్ష్తతన్ వద్ద ఉన్న చుజ్.

కొలోనియల్ కాలము

ఈ ప్రాంతమునకు మొదటి దండయాత్ర తరువాత, స్పానిష్ వారు తమ సింహాసనమునకు విరుద్ధనగా ఉన్న మయను ఆధీనములోనికి తీసుకొనుటకు మరియు మయ భూభాగాలైన యుకటాన్ పెనిన్సుల మరియు గ్యుటెమాల పర్వత ప్రాంతాలలో సంస్థానాలను స్థాపించుటకు ఎన్నో ప్రయత్నాలను చేసింది. కొన్నిసార్లు "ది స్పానిష్ కాంక్వెస్ట్ ఆఫ్ యుకటాన్" అని పిలువబడే ఈ యాత్ర ఆక్రమణదారులకు ప్రారంభమునుండి ఒక ప్రమాదకరమైన మరియు ఎక్కువ నిడివిగల పనిగా ఉండేది మరియు స్పానిష్ వారు అన్ని మయ ప్రాంతాలపై నియత్రణ స్థాపించుటకు సుమారు 170 సంవత్సరాలు పట్టేది మరియు పదులలో వేల సంఖ్యలో ఇండియన్ సహాయసేనలు కూడా అవసరమౌతాయి.

అజ్టేక్ మరియు ఇంకా సామ్రాజ్యము లాగా కాకుండా, మయలో ఒకసారి గీత దాటితే స్వదేశీ ప్రజల నుండి విరోదానికి ముగింపు పలికే విధంగా ఒక రాజకీయ కేంద్రము లేదు.. బదులుగా, ఆక్రమణదారు బలగాలు అనేకమైన స్వతంత్ర మయ రాజకీయ బలగాలను ఒకదాని తరువాత ఇంకొకటిగా అణచివేయవలసి వస్తుంది. వీటిలో అనేకం తీవ్రమైన వ్యతిరేకతను చూపాయి. చాలామంది ఆక్రమణదారులు బంగారు లేక వెండి నిలవలను అందుకోవచ్చుననే ఆశతో ఈ ఆక్రమణలకు పాల్పడ్డారు. అయినప్పటికీ, మయ ప్రాంతాలు ఈ వనరులలో చాలా పేదవి. స్పానిష్ యొక్క ఆక్రమణ పధకాలను నివారించుటకు ఇది కూడా ఒక కారణము ఎందుకంటే, వారు మధ్య మెక్సికో లేక పెరు ప్రాంతాలలోని గొప్ప నిధులు ఉన్నాయనే నివేదికల పట్ల ఆకర్షితులయ్యారు.

స్పానిష్ చర్చు మరియు ప్రభుత్వ అధికారులు మయ గ్రంథాలను ధ్వంసము చేశారు దానితో మయ లేఖనాల యొక్క జ్ఞానము కూడా ధ్వంసం అయింది, కాని అదుష్టవశాత్తు మూడు పూర్వ కొలంబియా పుస్తకాలు, క్లాసిక్ తరువాతి కాలము నాటివిగా గుర్తించబడి, సంరక్షించబడ్డాయి.[which?][16] మయ యొక్క చివరి రాష్ట్రాలు, తయసాల్ యొక్క ఇట్జా రాజ్యాంగము మరియు జాచ్పెతెన్ యొక్క కోవోజ్ నగరము రెండూ నిరంతరంగా ఆక్రమించబడ్డాయి మరియు స్పానిష్ వారి స్వతంత్రాలుగా 17వ శతాబ్దము చివరి వరకు ఉన్నాయి. అవి చివరికి 1697లో స్పానిష్ వారిచే ఆక్రమించబడ్డాయి.

రాజకీయ వ్యవస్థలు

సంప్రదాయకమైన మయ రాజ్యాంగము ఒక చిన్న క్రమానుగత రాజ్యము (అజవిల్, అజవ్లేల్, లేక అజవ్లిల్ ). ఇది అజవ్ (తరువాత కుహుల్ అజవ్ ) అని పిలివబడే వారసత్వ పాలకుల పాలనలో ఉండేది.[17] పెద్ద భూభాగాలను నియంత్రించి మరియు చిన్న రాజ్యాంగాలను పాలించే పెద్ద రాజ్యాలు ఉన్నప్పటికీ, ఇటువంటి రాజ్యాలు ఇరుగు పొరుగున అనేక చిన్న చిన్న పట్టణాలు ఉన్న ఒక రాజధాని కంటే ఎక్కువేమీ కాదు.[citation needed] ప్రతి రాజ్యము తన భూభాములోని ఏ ప్రాంతమునకు చెందనటువంటి పేరును కలిగి ఉంటుంది. ఒక పాలక వంశమునకు సంబంధించిన ఒక రాజ్యాంగ వ్యవస్థగా దాని గుర్తింపు ఉండేది. ఉదాహరణకు, నారంజో యొక్క పురావస్తు ప్రాంతము సాల్ రాజ్యము యొక్క రాజధాని. రాజ్యము యొక్క భూభాగము (చం చెం ) మరియు దాని రాజాధాని వాకబ్నల్ లేక మక్సం అని పిలువబడేవి మరియు హుక్ ట్సుక్ అనే ఒక పెద్ద భౌగోళిక అస్తిత్వము యొక్క భాగముగా ఉండేవి. ఆశ్చర్యకరంగా, ప్రాంతీయ అధికారములో నిరంతర యుద్ధాలు మరియు మార్పులు ఉన్నప్పటికీ, క్రీ.శ. 9వ శతాబ్దములో మొత్తం వ్యవస్థ కూలిపోయేంత వరకు చాలా రాజ్యాలు రాజకీయ దృశ్యము నుండి కనుమరుగుకాలేదు. ఈ విషయంలో, క్లాసిక్ మయ రాజ్యాలు, యుకటాన్ మరియు మధ్య మెక్సికోలలో స్పానియర్డ్స్ చేత ఎదుర్కోనబడిన క్లాసిక్ తరువాతి రాజ్యాంగాల మాదిరిగానే ఉండేవి: కొన్ని రాజ్యాంగాలు, ఆక్రమణల ద్వారా కాని లేక వంశానుగత సంఘాల ద్వారా కాని నాయకత్వములో ఉన్న పాలాకుల ఆధీనములో ఉండేవి కాని అవి ప్రత్యేకమైన తత్వాలుగా ఉండేవి.[citation needed]

మయ నాగరీకులు ఎక్కువగా క్లాసిక్ మయ సమాజాల "కోర్ట్ లక్షణము"ను ఎక్కువగా ఆమోదించేవారు. ఈ సమాజాలు రాజ వంశీకుల పై మరియు రాజు పై ఎక్కువగా కేంద్రీకరించబడి ఉంటుంది. ఈ దృష్టి మయ స్మారక ప్రదేశాలపై రాజ వంశం యొక్క వివిధ చర్యల పర్యవసనాలుగా కేంద్రీకరించబడింది. ఇది సమాజ మరియు అధికారం ఏర్పాటు పై స్థలాల మరియు ప్రదేశాల (రాచరిక భవంతులు, మేధావుల ప్రదేశాలు, రాచరిక గదులు, గుడులు, ప్రజా వినియోగ ప్రదేశాలతో సహా) ప్రాబల్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇది కళాత్మక మరియు నైతిక విలువలను విస్తృత సమాజమునకు అందించే విధంగా ఉంటుందని పరిగణలోకి తీసుకుంటుంది.

స్పానిష్ వనరులు స్థిరముగా ఇచ్చిన వివరణ ప్రకారము మయ యొక్క అతిపెద్ద నివాసాలను గుడులు మరియు రాజవంశ భవంతుల చుట్టుపక్కల ఏర్పడిన నివాసగృహాల సమూహం. క్లాసిక్ మయ నగరాలలో ఏ ఒక్కటి కూడా మెక్సికన్ టేనాక్టిట్లాన్ కు సమానంగా ఆర్థికపరమైన మరియు వ్యాపారపరమైన ప్రత్యేకతను కలిగి లేవు. కాని, మయ నగరాలను రాజవంశ భావంతులుగా మరియు రాజ న్యాయస్థానం యొక్క కార్యకలాపాల నెలవుగా పరిగణించవచ్చు. ఈ ప్రదేశాలలో అనుమతి కలిగిన మేధావులు పవిత్ర పాలకుని కలిసేందుకు ఏర్పాట్లు ఉండేవి. ఈ ప్రదేశాలలో ఉన్నతమైన సాంస్కృతిక కళా విలువలను పెంపొందించడం మరియు మార్పులు చేయడం జరిగేవి. ఇవి స్వయం ప్రతిపత్తి కేంద్రాలు మరియు సాంఘిక, నైతిక చట్టాల నెలవు. పీడ్రాస్ నెగ్రాస్ లేక కోపాన్ లాగా దస్తావేజులున్న సందర్భాలలో రాజ న్యాయస్థానం యొక్క పతనము, వాటి సంబంధిత సమాజాల తప్పనిసరి మరణానికి కారణమయ్యాయి.

కళ

ఉపకల్ కినిచ్ ప్రదర్శిస్తున్న పాలంక్యూ నుండి ఒక సన్న గార

చాలామంది[ఎవరు?] క్లాసిక్ యుగము (c.క్రీ.శ.250 to 900) నాటి మయ కళ ప్రాచీన కొత్త ప్రపంచము యొక్క అత్యంత జటిలమైన మరియు అందమైనడిగా పరిగణించారు. పాలెంక్యూ వద్ద స్టుక్కోతో తయారు చేయబడ్డ చెక్కడాలు మరియు రిలీఫులు మరియు కోపాన్ యొక్క ప్రతిమలు చాలా బాగుండేవి[citation needed]. ఇవి మానవ రూపం యొక్క కచ్చితమైన పరిశీలనను మరియు సౌష్టవమును చూపించేవి మరియు పురాతన ప్రపంచము యొక్క క్లాసికల్ నాగరికతలను[citation needed] తొలి పురావస్తు శాస్త్రజ్ఞులకు గుర్తుచేసేవి కాబట్టి ఈ యుగమునకు కూడా ఆ పెరు వచ్చింది. మన వద్ద క్లాసిక్ మయ యొక్క అభివృద్ధియైన చిత్రలేఖనము యొక్క జాడలు మాత్రము ఉన్నాయి; మిగిలి ఉన్న వాటిలో క్రియాకర్మసంబంధమైన కుమ్మరి వస్తువులు మరియు ఇతర మయ సిరామిక్కులు మరియు బోనంపాక్ వద్ద ఒక భవనము ప్రాచీన గోడ సంబంధమైన వాటిని కలిగి ఉంది. దాని ప్రత్యేకమైన రసాయన లక్షానాల కారణంగా కొన్ని శతాబ్దాలుగా మిగిలిన ఒక అందమైన నీలి రంగు మణివిశేషమును మయ బ్లూ లేక అజుల్ మయ అని అంతారు మరియు ఇది బోనంపాక్, టాజిన్ కాకక్స్ట్ల, జైన మరియు మరికొన్ని కొలోనియల్ మఠాలలో కూడా ఉంది. మయ బ్లూ యొక్క వాడకము 16వ శతాబ్దములో ఆ ప్రక్రియ పోయినంత వరకు ఉంది. గొప్ప కళాత్మకంగా మరియు శిల్పకళా సంపూర్ణత్వము ఉన్న పూర్వక్లాసిక్ చివరి గోడసంబధాలు ఇటీవలి కాలంలో శాన్ బర్టోలో వద్ద కనుగొనబడ్డాయి. మాయ లిపి యొక్క స్పష్టీకరణతో కళాకారులు తమ పనితనానికి వారి పేరులను జతపరచే కొన్ని నాగరికతలలో మాయ ఒకటని కనుగొన్నారు.

నిర్మాణవిజ్ఞానము

మయ నాగరికత నిర్మాణశాస్త్రము వేల సంవత్సరాల నిడివి కలది; కాని మయ నాగరికతకు సంబంధించినదిగా సులభముగా గుర్తించగలిగినది టర్మినల్ పూర్వ-క్లాసిక్ కాలము మరియు ఆ తరువాత ఉన్నటువంటి మెట్ల పిరమిడ్లు. మయకు ముఖ్యమైనటువంటి గుహల ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ గుహల ప్రాంతాలు: జోల్జ గుహ, నాజ్ ట్యునిచ్ వద్ద ఉన్న గుహల ప్రాంతము, కాన్దేలరియా గుహలు మరియు విట్చ్ గుహలు. మయ నాగరికతలో ఆరిజిన్ మిత్ గుహలు కూడా ఉన్నాయి. కొన్ని గుహ ప్రాంతాలు ఇప్పటికి కూడా చియపాస్ పర్వత ప్రాంతాలలో ఆధునిక మయ నాగరీకులచే ఉపయోగింపబడుతున్నాయి.

మయ లాంగ్ కోర్ట్ క్యాలెండరుతో సరిపోల్చి ప్రతి యాభై-రెండు సంవత్సరాలకు ఒకసారి దేవాలయాలు మరియు పిరమిడ్లు పునరుద్దరణ చేయబడతాయి మరియు పునర్నిర్మించబడతాయి అని సూచించబడింది[ఎవరు?]. కాని ప్రస్తుతము ఈ పునర్నిర్మాణ ప్రక్రియ క్యాలెండరు చక్రముతో సరిపోల్చే విధామును వ్యతిరీకిస్తూ తరచూ ఒక కొత్త పాలకునిచే కాని లేదా రాజకీయ విషయాల కొరకు కాని ఉసిగొల్పబడేది. అయినప్పటికీ, పాత కట్టడాల పైన పునర్నిర్మించే ప్రక్రియ సామాన్య విషయము. ఎంతో ఘనముగా, టికల్ వద్ద ఉన్న ఉత్తర అక్రోపోలిస్ సుమారుగా 1,500 సంవతసరాల నిర్మాణశాస్త్ర సవరణల కూడిక. టికల్ మరియు యక్ష లో, రెండు కవల పిరమిడ్ సముదాయాలు ఉన్నాయి (టికల్ లో ఏడు మరియు యక్షలో ఒకటి, ఇవి బక్తున్ యొక్క ముగింపుకు చిహ్నాలు) ఎప్పుడు ఒకేరీతిగా ఉండే అనేకమైన విషయాలు మరియు శైలి పరమైన ఘనతల పరిశీలన ద్వారా, మయ నిర్మాణశాస్త్రము యొక్క అవశేషాలు వారి ప్రాచీన నాగరికత యొక్క ఆవిర్భావమును అర్ధము చేసుకొనుటకు ఒక ముఖ్యమైన ఆధారము అయ్యాయి.

నగర ఆకృతి

దస్త్రం:Acropolis del Norte.jpg
ఉత్తర అక్రోపోలీస్, టికల్, గ్యుటెమాల

మయ నగరాలు మీసో అమెరికా యొక్క భౌగోళిక ప్రదేశాలలో వ్యాపించి ఉన్నందున, సైట్ ప్రణాళిక చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మయ నిర్మాణశాస్త్రము చాలా వరకు ఎన్నో సహజ లక్షణాలను కలుపుకోవాలని ప్రయత్నించింది మరియు వారి నగరాలు ప్రతి ఒక ప్రదేశము యొక్క స్థల అమరిక నిర్దేశించిన విధంగా అస్తవ్యస్తాముగా నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, ఉత్తర యుకటాన్ యొక్క సున్నపురాయి చదరాలపై నిర్మించబడిన కొన్ని నగరాలు గొప్ప మునిసిపాలిటీలుగా పెరిగాయి, కాగా, ఉసుమసింత కొండలపై నిర్మించబడినవి సహజమైన ఎత్తును ఉపయోగించుకొని వారి స్థంబాలను మరియు దేవాలయాలను కూడా ఎత్తులో నిర్మించుకొన్నారు. అయినప్పటికీ, పెద్ద నగరాలలో ఉండవలసిన క్రమ సారూప్యము ఇంకా ఉంది.

క్లాసిక్ యుగపు మయ నగర ఆకృతి స్మారకాలు మరియు రహదారులచే స్థలము యొక్క విభజన అని సులభముగా వర్ణించవచ్చు. ఓపెన్ పబ్లిక్ ప్లాజాలు ప్రజలకు ఒక చోట కలిసే ప్రదేశాలు మరియు నగర ఆకృతి పై దృష్టి ఉంచబడింది కాని అంతర్గత స్థలము రెండవ స్థానములో ఉంది. క్లాసిక్-తరువాతి యుగము చివరిలో మాత్రమే గొప్ప మయ నగరాలు దుర్గము-లాంటి రక్షణార్ధమైన కట్టడాలుగా అభివృద్ధి చెందాయి. వీటిలో చాలా మటుకు అనేకమైన క్లాసిక్ ప్లజాలు లోపించాయి.

క్లాసిక్ యుగములో పెద్ద-తరహా నిర్మాణముల ప్రారంభముతో, ఒక ముందుగా నిర్ణయించబడిన ఉద్దేశము కార్డినల్ దిశలో సంప్రదాయకంగా స్థాపించబడింది. మంచి-నీటి బావులు, లేక సెనోట్స్ వంటి సహజ వనరుల స్థానముపై ఆధారపడి నగరము అభివృద్ధి చెందింది. గొప్ప ప్లాజాలను మయ భవనాలకు ఉప-కట్టడము నిర్మించే వేదికలకు అనుసంధానం చేసే సాక్బియోబ్ ల (రహదారుల) సహాయంతో నగరము అభివృద్ధి చెందింది. మరిన్ని కట్టడాలు చేర్చబడి మరియు ప్రస్తుతము ఉన్న కట్టడాలను పునర్నిమించి లేక పునరాక్రుతీకరించబడటముతో, మయ యొక్క గొప్ప నగరాలు గొప్ప గుర్తింపును పొందసాగాయి. ఇవి ఇతర గొప్ప మీసో అమెరికా నగరాలు అయిన టియోతిహాకన్ మరియు దాని స్థిరమైన సమాంతర కడ్డీలతో నిర్మించిన చట్రము వలె నిర్మించిన నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉండేవి.

టికల్, గ్యుటెమాల వద్ద బాల కోర్ట్

మయ నగరము యొక్క నడిబొడ్డున పెద్ద ప్లాజాలు ఉన్నాయి. వీటి చుట్టూ రాయల్ అక్రోపోలిస్, గ్రేట్ పిరమిడ్ దేవాలయాలు మరియు బాల్-కోర్టులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ మరియు మతపరమైన భవనాలు ఉన్నాయి.. ప్రకృతి నిర్దేశించినట్లు నగర రూపకల్పన జరిగినప్పటికీ, దేవాలయాలపై మరియు పరిశీలనాత్మక విషయాలపై దృష్టి పెట్టబడి, అవి దేవలోక సంబంధమైన విషయాలలో మయ నాగరికత యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉండేట్టు శ్రద్ధ తీసుకొనబడింది. ఈ అనుష్ఠాన కేంద్రాలకు బయట చిన్న సజ్జనుల, చిన్న దేవాలయాల మరియు వ్యక్తిగత దేవాలయాల కట్టడాలు ఉండేవి; తక్కువ పవిత్రమైన మరయు తక్కువ ప్రాముఖ్యత కలిగిన కట్టడాలు ఎక్కువగా వ్యక్తిగతముగా ఉండేవి. నిరంతరంగా మారుతున్న నగర పరిధి బయట సామాన్య ప్రజల తక్కువ శాశ్వతమైన మరియు ఎక్కువ ఆడంబరాలు లేని గృహాలు ఉండేవి.

నిర్మాణ పదార్థాలు

మయ నాగరికత యొక్క గొప్ప కట్టడాల విషయంలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఇటువంటి నిర్మాణాలకు అవసర్రమైన అభివృద్ధి చెందిన సాంకేతికతలు లోపించడము. నాలుగు-చక్రాల రవాణ వ్యవస్థకు అవసరమైన పశువులు, లోహపు పనిముట్లు మరయు గిలకల వంటివి లోపించడము వలన మయ నిర్మాణ వ్యవస్థకు ఎక్కువగా మానవ వనరులు అవసరము అయ్యాయి. కాని, అపరిమితమైన ఈ అవసరము కాకుండా, ఇతర పదార్ధాలు అందుబాటులో ఉండేవి. మాయ కట్టడాలకు అవసరము అయిన రాయి ప్రాంతీయ క్వారీల నుండి తీసుకోనబడింది. వారు ఎక్కువగా సున్నపురాయిని ఉపయోగించారు. దీనిని త్రవ్వి తీసేటప్పుడు ఇది రాతి పనిముట్లతో పనిచేయుటకు అనువుగా ఉండేది మరయు అడుగు భాగము నుండి తీసిన తరువాత గట్టి పాడేది. సున్నపురాయి కట్టడాలకు ఉపయోగపడటమే కాకుండా, దాని గచ్చు పోడిచేయబడిన, కాల్చిన మరియు మిశ్రమమైన సున్నపురాయి కలిగి ఉంది సిమెంటు లక్షణాలకు దగ్గరగా ఉండేది. ఇది గచ్చు రకము కాబట్టి ఇది ఎక్కువగా స్టక్కో పూతలకు ఉపయోగించబడేది.

త్రవ్వకాల ప్రక్రియలో మెరుగుల కారణంగా రాయి కచ్చితంగా అమర్చగలగడము వలన ఈ సున్నపురాయి-స్టక్కో యొక్క అవసరము తగ్గింది కాని కొన్ని పోస్ట్ మరియు లింటేల్ పైకప్పులలో ఇది ముఖ్యమైన అంశముగా నిలిచిపోయింది. సాధారణ మయ గృహాల విషయంలో చెక్క స్తంభాలు, పచ్చి ఇటుక మరియు పూరికప్పు గడ్డి మొదలగునవి ప్రాథమిక పదార్ధాలు; అయినప్పటికీ, సున్నపురాయితో కట్టబడిన సాధారణ గృహాలు కూడా కనుగొనబడ్డాయి. మయ నిర్మాణకళలో ప్రముఖమైనది కోర్బెల్ కమాను (దీనిని "ఫాల్స్ కమాను" అని కూడా అంతారు), ఇవి ఎక్కువ-గాలి వచ్చే ప్రవేశద్వారాలుగా ఉండేవి. కోర్బెల్ కమాను గోడ/స్తంభము మరియు లింటేల్ ద్వారాలపై నిర్మంచబడింది మరియు లింటేల్ యొక్క బరువు మొత్తం ఆధారముగా ఉన్న స్తంభాలపై వేయబడేది.

ప్రసిద్ధమైన నిర్మాణాలు

 • సెరిమోనియల్ వేదికలు సాధారణంగా సున్నపురాయి వేదికలు. ఇవి నాలుగు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండేవి. వీటిపై ప్రజా వేడుకలు మరియు మతపరమైన అనుష్ఠానాలు జరిగేవి. ఆనవాలుగా ఉండే వేదికల విధంగా నిర్మించబడిన ఈ వేదికలపై తరచూ చెక్కబడిన బొమ్మలు, హోమగుండాలు ఉండేవి మరియు జోమ్పంత్లి కూడా ఉండేవి. ఈ జోమ్పంత్లిలు మీసోఅమెరికా బాల్ గేం ప్రత్యర్థులలో ఓడిపోయినవారి లేక క్షతగాత్రులైన వారి తలలను ప్రదర్శించుటకు ఉపయోగించే వస్తువు.
 • రాజభవనాలు తరచుగా మరియు ఎక్కువగా అలంకరింపబడేవి మరియు సాధారణంగా ఒక నగరము యొక్క కేంద్రమునకు దగ్గరగా ఉండేవి మరియు ఉన్నత వర్గ జనాభాకు నివాసముగా ఉండేవి. అతిశయముగా ఉన్న పెద్ద రాజభవనము లేక వివిధ స్థాయిలలో ఎక్కువ గదులు ఉన్నవాటిని అక్రోపోలిస్ అని అంతారు. అయినప్పటికీ, తరచూ ఇవి ఒక అంతస్తు భవనాలుగా ఉండేవి మరియు అనేక చిన్న గదులు ఉండేవి మరియు కనీసము ఒక అంతర్గత కోర్ట్ యార్డు ఉండేది; ఒక నివాసములో క్రియాత్మక అవసరాలను పరిగణనలోనికి తీసుకొని ఈ కట్టడాలను కట్టారు మరియు నివాసస్తుల స్థాయిని బట్టి అవసరమైన అలంకరణలు చేయబడేవి.
 • E-గ్రూపులు మయ ప్రాంతములో అనేక కేంద్రాలలో ఉన్నటువంటి ప్రత్యేక కట్టడాల ఐచ్చికాంశములు. ఈ సముదాయాలు కొన్ని ప్రత్యేకమైన ఖగోళ సంబంధ సంఘటనల ఆధారంగా ఉన్ముఖము చేయబడ్డాయి (ప్రధానముగా సూర్యుని యొక్క ఐనము మరియు విషువత్ లు) మరియు ఇవి అబ్సర్వేటరీలుగా భావించబడ్డాయి. ఈ కట్టడాలు సాధారణంగా ఖగోళ పరిశీలనలను సాధారణ మయ మైతాలజికి అనుసంధానించే ఐకోనోగ్రఫిక్ రిలీఫ్ లతో కలిసి ఉంటాయి. కట్టడాల సముదాయము ఉయక్సాక్తాన్ వద్ద గ్రూప్ E కొరకు పెరుపెట్టబడింది. ఇది మీసోఅమెరికాలో మొదట డాక్యుమెంట్ చేయబడింది.
పాలంక్యూ వద్ద టెంపుల్ ఆఫ్ ది క్రాస్; అక్కడ ఒక క్లిష్టమైన పైకప్పు మరియు బోదెకట్ట వంటి కమాను ఉన్నాయి
 • పిరమిడ్లు మరయు దేవాలయాలు . తరచుగా ముఖ్యమైన మతపర దేవాలయాలు మయ పిరమిడ్ల పైన ఉండేవి, బహుశా స్వర్గాలకు దగ్గరగా ఉన్న శ్తలము అనే భావనతో. ఇటీవలి ఆవిష్కరణలు పిరమిడ్లను సమాధులుగా వాడకాన్ని తెలుపుతుంటే, దేవాలయాలు కూడా అరుదుగా సమాధులను కలిగి ఉండేవి. ఎల్ మిరాడార్ వంటి దేవాలయాలు, పిరమిడ్ల పైన సుమారు రెండు-వందల అడుగుల పైన ఉంటూ చాలా ప్రభావకారిగా ఉండేవి మరియు అలంకరింపబడేవి. సాధారణంగా ఒక పైకప్పు కూంబుతో లేక ఉపరితల భాగము సంబంధిత ఆడంబరముతో శిఖరముగా చేయబడడముతో ఈ దేవాలయాలు ఒక విధమైన ప్రచారముగా కూడా ఉపయోగపడ్డాయి. మయ నగరములో చుట్టుప్రక్కల ఉన్న అడవులకంటే ఎత్తులో ఉన్న కట్టడాలు కావటము చేత, ఆ దేవాలయాల పైకప్పు కూంబులపై పాలకుల విగ్రహాలు చేక్కబాదేవి. ఇవి చాలా దూరము నుండి కూడా చూడగలిగే విధంగా ఉండేవి.
 • అబ్సర్వేటరీలు . మయ నాగరీకులు చురుకైన నక్షత్ర శాస్త్రజ్ఞులు మరియు ఆకాశ సంబంధమైన వస్తువుల దశలను విశదీకరించారు, ముఖ్యంగా చంద్రుడు మరియు శుక్రుడు. చాలా దేవాలయాలలో ఆకాశ సంబంధ సంఘటనలను చూపే ద్వారాలు మరియు ఇతర లక్షణాలు కలిగి ఉండేవి. గుండ్రంగా ఉండే దేవాలయాలను, తరచూ కుకుల్కన్ కు అంకితమిచ్చేవి, ఆధునిక శిథిలాల పర్యాటక గైడ్లు "అబ్సర్వేటరీలు"గా వర్ణించారు. కాని అవి ఈ ప్రయోజనము కొరకు ఉపయోగింపబడ్డాయని ఎటువంటి రుజువులు లేవు మరియు ఇతర ఆకారములలో ఉన్న దేవాలయ పిరమిడ్లు ఈ పరిశీలనలకు ఉపయోగింపబడి ఉండవచ్చు.
 • బాల్ కోర్టులు . మీసోఅమెరికా జీవనశైలి యొక్క అంతర్భాగముగా, వారి ఆగమ బాల్-ఆట కొరకు మయ భూభాగము అంతటా కోర్టులు నిర్మించబడ్డాయి మరియు ఇవి తరచూ ఘనంగా ఉండేవి. ఇరుప్రక్కల సెరిమోనియల్ వేదికలు లేక చిన్న దేవాలయాలకు దారి తీసే మెట్ల వరుసలతో ఉన్నటువంటి బాల్ కోర్టులు పెద్ద అక్షరము "I" ఆక్రాములో ఉండేవి మరియు అన్ని మయ నగరాలలో కనపడేవి.

లేఖనము మరియు అక్షరాస్యత

వ్రాసే వ్యవస్థ

మయ వ్రాసే వ్యవస్థ (తరచుగా ప్రాచీన ఈజిప్టియన్ లేఖనము యొక్క ఉపరిభాగ పోలిక అయిన హీరోగ్లిఫ్స్ అని పిలువబడేది) ఫోనెటిక్ గుర్తులు మరియు సంక్షిప్తలిపి సంకేతముల మిశ్రమముగా ఉండేది. ఇది తరచు ఒక లోగోగ్రాఫిక్ లేక (మరింత సరిగా) ఒక లోగోసిల్లబిక్ వ్రాసే పధ్ధతిగా వర్గీకరించబడింది. ఇందులో సిల్లబిక్ గుర్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తన సమాజము యొక్క వాడుక భాషకు ప్రాతినిధ్యం వహించేదిగా పేరుగాంచిన ఒకే ఒక పూర్వ-కొలంబియా కొత్త ప్రపంచము యొక్క వ్రాసే వ్యవస్థ. మొత్తమ్మీద, ఈ లిపిలో వెయ్యికి పైగా వివిధ గిల్ఫ్ లు ఉన్నాయి. కొన్ని ఒకే రకమైన గుర్తు లేక అర్ధము కలిగినవి, మరియు మరికొన్ని చాలా అరుదుగా కనపడతాయి లేక కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితము అయ్యాయి. ఒక్కోసారి, సుమారు 500 గిల్ఫ్ లు వాడుకలో ఉండేవి, కొన్ని 200 వరకు (వ్యత్యాసములతో సహా) ఫోనెటిక్ లేక సిల్లబిక్ లకు అన్వయించబడ్డాయి.

గుర్తించదగ్గ మయ లిపిలో ప్రాచీన శాసనాలు క్రీ.పూ.200–300 కు చెందినవి.[18] అయినప్పటికీ, ఈ వ్రాసే వ్యవస్థకు మునుపు ఎన్నో ఇతర వ్రాసే పద్ధతులు మీసోఅమెరికాలో అభివృద్ధి చెందాయి. ఇందులో ముఖ్యమైనవి జాపోటేక్స్ మరియు ( ఇటీవల కనుగొన్న కస్కజల్ బ్లాక్ పై పరిశోధనల 2006 ప్రచురణను అనుసరించి), ది ఒల్మేక్స్.[19] "ఎపి-ఒల్మేక్ లిపి" (ఒల్మేక్ తరువాతి) అనబడే మయ ముందు కాలము నాటి ఒక లిపి ఉంది. దీనిని పరిశోధకులు ఒల్మేక్ మరియు మయ లిపిల మధ్య మార్పు లిపిగా సూచిస్తారు కాని వీటి మధ్య సంబంధాలు స్పష్టముగా లేవు మరియు ఈ విషయము పరిష్కారము కాలేదు. 2006, జనవరి 5న, నేషనల్ జియోగ్రాఫిక్ మయ లిపుల క్రీ, పూ.400 కాలము నాటివనే పరిశోధనలను ప్రచురించింది. దీని ద్వారా మయ వ్రాసే వ్యవస్థ ఇంచుమించు మీసోఅమెరికా యొక్క అతిపురాతనమైన జాపోటేక్ లిపి అంత పురాతనమైనదని సూచించారు.[20] ఆ తరువాతి శతాబ్దాలలో మయ తన లిపిని అమెరికాస్ లో ఇంతవరకు కనుగొనని ఇతర లిపి కంటే మరింత సంపూర్ణమైనదిగా మరియు క్లిష్టమైనదిగా అభివృద్ధి చేసింది.

దాని ప్రారంభము నుండి, మయ లిపి యూరోపియన్ల ఆగమనము వరకు వాడుకలో ఉంది. ఇది మయ క్లాసికల్ కాలములో (c. 200 నుండి 900) అత్యున్నత స్థాయి చేరుకొంది. ఈ కాలములో లేక ఆ తరువాత ఎన్నో మయ కేంద్రాలు పతనము దిశగా వెళ్ళినప్పటికీ, (లేక పూర్తిగా నిషేధించబడ్డాయి), మయ లిపి యొక్క నైపుణ్యము మరియు జ్ఞానము కొన్ని వర్గాల జనాభాలో ఉంది మరియు తొలి స్పానిష్ ఆక్రమణదారులకు ఈ లిపిని చదవగలిగిన మరియు వ్రాయగలిగిన వ్యక్తుల గురించి తెలుసు. దురదృష్టవశాత్తు, స్పానిష్ వారు దీనిపై మక్కువ చూపలేదు, మరియు మయ సమాజాలపై ఆక్రమణ యొక్క భయంకరమైన ప్రభావాల వలన, బహుశా కొన్ని తరాలలోనే.ఈ లిపి గురించిన జ్ఞానము పోయింది.

ఒక ఉజ్జాయింపు అంచనాలో, 10,000 వ్యక్తిగత గ్రంథాలు ఇప్పటివరకు తిరిగి పొందబడ్డాయి, చాలా భాగము రాతి స్మారకాలపై, లింటేల్ పై మరియు స్టేలే మరియు సిరామిక్ కుమ్మరి వస్తువులపై వ్రాయబడ్డాయి. ఒక చెట్టు-పట్ట నుండి తయారు చేయబడిన ఒక రకమైన కాగితము పై మయ గ్రంథాలను చిత్రాలుగా వేసింది. ముఖ్యంగా ఫికస్ కోటినిఫోలియ మరియు ఫికస్ పడిఫోలియ అనే వివిధ రకాల అంజీర చెట్ల నుండి తయారు చేయబడింది.[21] ఈ కాగితము, మీసోఅమెరికా అంతటా ఎంతో సాధారణమైనది మరియు దాని నహువాటి భాష నామము అయిన ఆమటి అని పిలువబడేది. ఇది సంప్రదాయకంగా ఒక నిరంతర తావు కగితముగా బంధించబడినది మరియు సమాన వెడల్పు ఉన్న పుటలుగా మడచబడింది మరియు కొంసేర్టిన శైలిలో మడచబడింది. దీనివలన రెండు వైపులా వ్రాయగలిగే ఒక వ్రాతప్రతి తయారు అవుతుంది. ఆక్రమణ తరువాత, దొరికిన ఈ వ్రాతప్రతులు అన్నిటినీ కాల్చి వేయమని మరియు ధ్వంసము చేయమని జీలాస్ స్పానిష్ ప్రీస్టు ల నుండి, ముఖ్యంగా బిషప్ డీగో దే లండా, నుండి ఆదేశాలు వచ్చాయి. మూడు సంపూర్ణ మయ వ్రాతప్రతుల ఉదాహరణలు ఈ నాటికి మిగిలినట్టు తెలుస్తోంది. వీటిని ఇప్పుడు మాడ్రిడ్, డ్రెస్డెన్ మరియు పారిస్ వ్రాతప్రతులు అంతారు. నాల్గవ వ్రాతప్రతి అయిన ది గ్రోలియర్ కోడెక్స్ నుండి కొన్ని పుటలు నిజమైనవని అంతారు.కాని వీటి విశ్వసనీయత వివాదాస్పదముగానే ఉంది. మయ ప్రాంతాలలో జరిపిన మరికొన్ని తవ్వకాలలో సాధారణంగా ఈ కింది విషయాలు తెలుస్తాయి: ప్లాస్టర్ మరియు రంగుల యొక్క చతురాస్రకార ముద్దలు మునుపు వాడిన కోడిసేస్. ఇలాంటి పదార్ధాలు చెడిపోవడం వలన ఈ పదార్ధాలు పై రాసిన శాసనాలు వేలికితీయలేము. వీటిల్లో ఆర్గానిక్ పదార్ధాలు కుళ్లిపోతాయి.

మయ రచనల యొక్క నష్టపోయిన జ్ఞానాన్ని వెలికితీయడం చాలా పెద్దదైన శ్రామిక ప్రక్రియ. పంతొమ్మిదో శతాబ్దం ఆఖరులో మరియు ఇరవైయవ శతాబ్దం మొదట్లో కొన్ని విషయాలు తెలుసుకోబడ్డాయి. వీటిల్లో చాలా వరకు మయ క్యాలెండర్, ఖగోళ శాస్త్రం మరియు అంకెలకు సంబంధించినవి. 1950ల నుండి 1970ల మధ్య కాలంలో ముఖ్యమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఈ ప్రక్రియలు వేగవంతం అయ్యాయి. ఇరవైయవ శతాబ్ద ఆఖరులో, మేధావులు మయ రచనలను చాలా వరకు చదవగలిగినారు. ప్రస్తుతము మరిన్ని విషయాలను అర్ధం చేసుకునే విధంగా విస్తృతంగా ప్రయత్నాలు, అధ్యయనాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న మయ రచనల గురించి, యాలె విశ్వవిద్యాలయానికి చెందినా ప్రముఖ భాషా నిపుణుడు మరియు ఎపిగ్రాఫర్ అయిన మైఖేల్ D.కో ఈ కింది విధంగా స్పందించారు:

"ప్రాచీన మయకు సంబంధించి మా విజ్ఞానము మొత్తం చిత్రములో ఒక చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తుంది, ఎందుకంటే, వారి విజ్ఞానము మరియు ఆచారాలు నిక్షిప్తము చేసిన వేల గ్రంధాలలో నాలుగు మాత్రమే ఈ ఆధునిక కాలానికి మిగిలాయి (మేము మూడు ప్రార్థన గ్రంధాలు మరియు యాత్రీకుల పురోగమనములపై ఆధారపడ వలసి వచ్చ్చిందని రాబోయే తరాలు మా గురించి తెలుస్తుంది)." (మైఖేల్ D.కో, ది మయ , లండన్: థేంస్ అండ్ హడ్సన్, 4వ సంచిక., 1987, పేజీ. 161.)

ప్రీ-కొలంబియన్ మయ రాతలలో బాగా ఉన్నవి స్టీలే లోనివి మరియు ఇతర శిలాశాసనాలు ఇతర మయ ప్రాంతాలలోనివి. వీటిల్లో చాలా భాగము స్పానిష్ వారు వచ్చు మునుపే తొలగించబడినవి. స్టీలే పై ఉన్న శిలాశాసనాలలో ఎక్కువ భాగం ఆ ప్రాంత పాలకుని వంశం గురించి మరియు వారు పాల్గొన్న యుద్ధాల గురించి తెలుపుతాయి. పురాతన మయ మహిళల యొక్క జీవనం గురించిన విషయాలు తెలిపే శిలాశాసనాలు ఉన్నాయి. మయ హీరోగ్లిఫిక్స్ లోని ఎక్కువ భాగం కర్మకాండ కుండలపై చూడవచ్చు. వీటిల్లో ఎక్కువశాతం జీవితం తరువాత విషయాలను వివరిస్తాయి.

లేఖనము పనిముట్లు

పురావస్తు రికార్డులు ఎటువంటి ఉదాహరణలు అందించనప్పటికీ, జంతువుల వెంట్రుకలతో మరియు ఈకలతో తయారు చేసిన బ్రష్షులతో లేఖనము జరిగిందని మయ కళ సూచిస్తోంది. కోడెక్స్-శైలి లేఖనము సామాన్యముగా నలుపు రంగులో మరియు ప్రాధాన్యతలను ఎరుపు రంగులో చేయబడింది. ఇది మయ భూభాగమునకు "లాండ్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్" అజ్టేక్ పేరును సంపాదించింది.

లేఖరులు మరియు అక్షరాస్యత

మాయ ఆస్థానాలలో లేఖరులు ప్రముఖమైన స్థానము పొందారు. మాయ కళ తరచూ పాలకులను లేఖరులుగా లేక కనీసము వారు వ్రాయగలరు అని సూచించే విధంగా వస్త్రాలతో తెలుపుతారు. ఉదాహరణకు వారి శిరస్సువస్త్రాలలో కాలాల ఒక కట్టను ఉంచడము. అదనంగా, చాలామంది పాలకులు గవ్వలు లేక మట్టి సిరాబుడ్ల వంటి లేఖనా పనిముట్లతో కలిసి ఉండేవారు. భాషను పూర్తిగా వ్రాయుటకు వందల సంఖ్యలో లోగోగ్రాములు మరియు అక్షరముల అవసరము ఉన్నప్పటికీ అక్షరాస్యత కొన్ని వర్గాలను దాటి వ్యాపించలేదు. వివిధ సందర్భాలలో కప్పబడని గ్రఫ్ఫిటి, కాలిన ఇటుకలతో సహా, లిపి వ్యవస్థను అనుకరించుటకు ప్రయత్నాలు జరిగాయని తెలుపుతుంది.

గణితశాస్త్రం

మయ అంకెలు

ఇతర మీసో అమెరికా నాగరికతల మాదిరిగానే, మయ బేస్ 20 (విజేసిమల్) మరియు బేస్ 5 సంఖ్యా వ్యవస్థను ఉపయోగించింది (మయ అంకెలు చూడండి). ఇంకా, పూర్వక్లాసిక్ మయ మరియు వారి పొరుగువారు స్వతంత్రంగా సున్నా ప్రత్యయాన్ని క్రీ.పూ.36 నాటికి అభివృద్ధి చేసారు. శాసనాలు వాటిని వాడకములో చూపించాయి. వందల మిలియన్ల వరకు కూడికలు మరియు సూచించుటకు మాత్రమే ఎన్నో లైన్లు పట్టే డిట్లను చూపాయి. వారు చాలా కచ్చితమైన జ్యోతిష్య శాస్త్ర పరిశీలనలను తయారుచేశారు; చంద్రుడు మరయు ఇతర గ్రహాల గతుల యొక్క పటాలు కంటితో నేరుగా చూసి పరిశీలనలు తయారు చేసే ఇతర నాగరికతలకు సమానముగా కాని అంత కంటే అధికముగా కాని ఉన్నాయి.[citation needed]

ఇతర మీసో అమెరికా నాగరికతలతో సమానంగా, మయ సౌర సంవత్సరము యొక్క నిడివిని అధిక స్థాయి నిర్దుష్టతతో కొలిచారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండరుకు ఆధారముగా యూరోపులో ఉపయోగింపబడే దానికంటే కచ్చితమైనది. వారు ఈ అంకెను సంవత్సరము యొక్క పొడవు కొరకు వారి క్యాలెండరులో ఉపయోగించలేదు అయినప్పటికీ, వారు ఉపయోగించిన క్యాలెండరులు అభివృద్ధి చెందనివి ఎందుకంటే వారు ఒక సంవత్సరము యొక్క నిడివి 365 రోజులుగా నిర్ణయించారు అంతే, క్యాలెండరులో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజు తక్కువగా ఉంటుంది. పోల్చిచూస్తే, రోమన్ కాలము నుండి 16వ శతాబ్దము వరకు యూరోప్ లో ఉపయోగించిన జూలియన్ క్యాలెండరు ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు తేడాను మాత్రమే చూపించింది. ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండరు మరింత కచ్చితమైనది. ఇది 3257 సంవత్సరాలలో ఒక్క రోజు పొరపాటును మాత్రమే చూపిస్తుంది.

ఖగోళ శాస్త్రం

మయ ఒక టెలిస్కోప్-పూర్వపు నాగరికత అని చెప్పుటకు కొన్ని రుజువులు ఉన్నాయి. ఈ నాగరికత ఓరియన్ నెబ్యుల మెత్తగా ఉందని అంతే సూటిగా ఉండే ఒక నక్షత్ర సంబంధమైనది కాదని ప్రదర్శించింది. ఈ సిద్ధాంతమును బలపరచే సమాచారము ఒక జానపద కథ నుండి వచ్చింది. ఈ కథ ఆకాశములో ఓరియన్ కూటమి యొక్క ప్రాంతము గురించినది. వారి సంప్రదాయ పొయ్యిలు మధ్యలో వెలుగుతున్న మంట గుర్తు కలిగి ఉంటాయి. ఇది ఓరియన్ నేబ్యులాకు సంబంధించింది. టెలిస్కోప్ కనుగొనక ముందు నక్షత్రాల పిన్ పాయింట్లకు వ్యతిరేకంగా మయ ఆకాశము యొక్క విస్తారమైన ప్రాంతమును కనుగొనిందనే ఆలోచనను బలపరచే ఒక ముఖ్య కీలకము ఉంది.[22] లా బ్లాంకా, ఉజుక్స్తే, మోంటే ఆల్టో మరియు తకలిక్ అబజ్ లలో చూసిన విధంగా చాలా పూర్వక్లాసిక్ ప్రాంతాలు ప్లేయాదేస్ మరియు ఏట ద్రకోనిస్ లతో ఉన్ముఖముగా ఉండేవి.

మయ నాగరీకులు జీనియాల్ త్రోవలలో చాలా ఉత్శాహము కలిగి ఉండేవారు. ఇది సూర్యుడు నడినెత్తిన పయనించే సమయము. చాలామటుకు వీరి నగరాల యొక్క అక్షాంశము ట్రాపిక్ ఆఫ్ కాన్సర్కు దిగువన ఉండటము వలన, ఈ జీనియాల్ త్రోవలు ప్రతి ఏడు రెండు సార్లు సోల్స్టైస్ కు సమదూరములో సంభవిస్తాయి. నడినెత్తిపై సూర్యిని యొక్క ఈ స్థానమును సూచించుటకు, మయ నాగారీకులకు డైవింగ్ గాడ్ అనే దేవుడు ఉన్నాడు.[citation needed]

డ్రెస్డెన్ కోడెక్స్ లో ఖగోళసంబంధ విషయాల అధ్యయనాలు మరియు మిగిలిన గ్రంథాల యొక్క లెక్కింపులు ఎక్కువగా ఉన్నాయి (ఈ కోడెక్స్ లోని సమాచారము ప్రాథమికము లేదా ఖగోళ సంబంధ స్వభావము కలిగినదని అనిపిస్తుంది). ఈ కోడెక్స్ యొక్క పరీక్ష మరియు విశ్లేషణ ద్వారా మయ నాగారీకులకు వీనస్ ఒక ముఖ్యమైన ఖగోళ వస్తువు అని, అది సూర్యుని కంటే కూడా వారికి ముఖ్యమని తెలుస్తుంది.

మతం

గాడ్ K, వెలుతురు యొక్క దేవత

తరువాత పాలన చేపట్టిన అజ్టేక్ మరియు ఇంకా ల మాదిరిగా మయ కాలచక్ర స్వభావమును నమ్మారు. అనుష్ఠానాలు మరియు ఆచారాలు ఆకాశ సంబంధమైన మరియు భూసంబంధమైన చక్రాలతో సంబంధించినవి. వీటిని వారు ప్రత్యేకమైన క్యాలెండరులుగా తయారుచేసి పాటించేవారు. మయ పురోహితుడు ఈ చక్రాలను అన్వయించే పనిని చేసేవారు మరియు ఈ క్యాలెండరులలో ఉన్న సంఖ్యా సంబంధాలను ఆధారం చేసుకొని భవిష్యత్తులో జరగబోయే లేక గతంలో జరిగిన విషయాలపై ఒక అవగాహన ఇస్తారు. కొన్ని మతపరమైన ఆచారాలను పాటించుటకు స్వర్గాలు అనుకూలమైనవా లేదా అని కూడా వారు నిర్ణయించాలి.

మయ నర బలిని ఆచరించింది. కొన్ని మయ ఆచారాలలో ప్రజలను కాళ్ళు చేతులు కట్టేసి పట్టుకుని చంపుతారు మరియు పురోహితుడు ఆ మనిషి యొక్క చాతిని చీల్చి ఆతని గుండెను కోసి అర్పణగా చేస్తారు. ఇది కోడిసేస్ అనబడే బొమ్మల పుస్తకాల వంటి ప్రాచీన వస్తువులపై సూచించబడింది.

చాలా భాగం మయ మతాచారాలు ఇప్పటికీ పండితులకు అర్ధం కాలేదు కాని, మయ నాగరికత నమ్మిక ప్రకారము కాస్మోస్ మూడు పెద్ద చదరాలు, భూమి, పాతాళము మరియు స్వర్గము, కలిగి ఉంది.

మయ పాతాళము గుహలు మరియు లోతుగా ఉండే సొరంగాల ద్వారా చేరుకోవచ్చు. వారి నమ్మిక ప్రకారము ఈ పాతాళముపై మయ మృత్యువు మరియు మురగడము యొక్క దేవతలు ఆధిపత్యము వహిస్తారు. సూర్యుడు (కినిచ్ అహు) మరియు ఒక వృద్ధ దేవుడైన ఇట్జామ్న మయ ఆలోచన ప్రకారము ఆకాశము యొక్క ఆధిపత్యము వహిస్తారు. ఇంకొక వృద్ధుడు, గాడ్ L, పాతాళము యొక్క దేవతలలో ముఖ్యుడు.

రాత్రి వేళ ఆకాశము అన్ని దైవిక పనులను చూపే ఒక కిటికీ. మయ నాగరీకులు దేవతల మరియు ప్రదేశముల యొక్క కూటమిని ఐచ్చిక వ్యవస్థగా నమ్మరు, కాలగమనంలో మార్పులలో గాథలను చూసింది, మరియు అన్ని ప్రపంచాల కూటమి రాత్రిపూట ఆకాశాములో సాధ్యపడుతుందని నమ్మారు.[citation needed]

మయ దేవుళ్ళు అనుబంధాలు కలిగి ఉండేవారు మరియు వారు ఒకరితో ఒకరు కలిసి ఉండేలా చేసే అంశాలు ఉన్నాయి. ఇలాంటివి అవధులు లేనటువంటివిగా అనిపించేవి. మయ మతపరమైన సంప్రదాయములో మానవాతీతమైన అవతారాల భారీ శ్రేణి ఉంది, కొన్ని మాత్రమే క్రమముగా వస్తాయి. మంచి మరియు చెడు గుణగనాలు మయ దేవుళ్లలో శాశ్వత లక్షణాలు కావు మరియు "మంచి" మాత్రమే ఉత్తమమైనది కాదు. ఒక కాలములలో తగనిది ఇంకొక కాలములో మంచి కావచ్చు. మయ మతపరమైన సంప్రదాయము శాశ్వత తత్వము పై కాకుండా చక్రముల పై ఆధారపడి ఉంది.

జొన్న యొక్క జీవిత-చక్రము మయ నమ్మకము యొక్క గుండె వద్ద ఉంటుంది. ఈ తత్వశాస్త్రము మయ జొన్న దేవుడు మతపరమైన కేంద్ర ఆకారముగా నమ్మిన వారి నమ్మికలో ప్రదర్శితమౌతుంది. మయ నాగరీకుల శరీర తత్వము కూడా ఈ యువ దేవత రూపంలో ఆధారపడి ఉంది. ఇది వారి కళాత్మక పనులలో కనిపిస్తుంది. జొన్న దేవుడు ప్రాచీన మయ నాగరికతకు, నాగరీకమైన జీవనానికి ఒక నమూనా.

రకరకాలైన దేవుళ్ళు వారు గమనించిన గణిత విశ్లేషణల కంటే ఎక్కువేమీ కాదు అని కొన్నిసార్లు నమ్మబడింది[attribution needed]. ప్రతి ఒక దేవుడు మాటప్రకారము ఒక సంఖ్య మాత్రమే లేక వివిధ క్యాలెండరుల నుండి సంఖ్యల యొక్క మేళనముల యొక్క ప్రభావముల వివరణ. అనుసరించిన వివిధ రకాలైన మయ క్యాలెండరులలో, చాలా ముఖ్యమైనవి, 260-రోజుల కారము, సౌర సంవత్సరమునకు దగ్గరగా ఉండే 365-రోజుల చక్రము, చంద్రుని యొక్క తిధులప్రకారము వచ్చే మాసములను రికార్డు చేసిన ఒక చక్రము, మరియు వీనస్ యొక్క సినోడిక్ పీరియడ్ ను జాడ తెలిపిన ఒక చక్రము.

శాస్త్రీయముగా, గతమును తెలుసుకోవడము అంతే వర్తమానమును సృష్టించే పునరావృతమైన ప్రభావములను తెలుసుకోవడం అని, మరియు వర్తమానము యొక్క ప్రభావాలను తెలుసుకొని భవిష్యత్తు యొక్క పునరావృత ప్రభావాలను తెలుసుకోవచ్చు అని మయ నాగరీకుల నమ్మకము.

19వ శతాబ్దములో కూడా, మయ నాగరీకత చాన్ శాంట క్రూజ్ లో అనుసరిస్తున్న ప్రాంతీయ క్రైస్తవత్వం యొక్క రూపాలను ప్రభావితం చేసింది.

గ్యుటెమాల యొక్క పశ్చిమ పర్వత ప్రాంతాలలో కిచే లలో ఈనాటి వరకు, చోల్కిజ్ అనబడే 260-రోజుల క్యాలెండరు యొక్క రక్షకుడైన అజ్కిజ్ యొక్క శిక్షణలో ఈ తొమ్మిది నెలలు[clarification needed] తిరిగి వస్తాయి.

వ్యవసాయం

ప్రాచీన మయలో విభిన్నమైన మరియు జటిలమైన ఆహార ఉత్పత్తి పద్ధతులు ఉండేవి. ఇంతకు మునుపు, నిలకడలేని సాగుబడి (స్విడ్దేన్) వ్యవసాయము తమ ఆహారములో ఎక్కువ భాగము ఇచ్చేదని నమ్మారు కాని ఇప్పుడు ఎత్తుగా ఉన్న పొలాలు, టెర్రేసింగ్, అడవి ఉద్యానవనాలు, నిర్వహించబడిన బీళ్ళు, మరియు వన్య సంచయనం మొదలగునవి క్లాసిక్ కాలములో కొన్ని ప్రాంతాలలో ఉన్న అధిక జనాభా యొక్క సహాయమునకు ముఖ్యమైనవని తెలుసుకొన్నారు. నిజానికి, వివిధ రకాలైన ఈ వ్యవసాయ పద్ధతుల రుజువులు ఈ నాటికి ఉన్నాయి; కాలువలచే అనుసంధానించబడిన ఎత్తుగా ఉన్న పొలాలు విహంగ వీక్షణము ద్వారా చూడవచ్చు, సమకాలీన రెయిన్ ఫారెస్ట్ జాతుల మేళనములలో ప్రాచీన మయ నాగరికతకు ఆర్థికపరంగా ఉపయోగపడే జాతులు ఎక్కువగా ఉండటం, మరియు సరస్సు యొక్క అడుగుగసిలో పుప్పొడి రికార్డుల వలన మనకు ఈ క్రింది విషయము తెలుస్తుంది. క్రీ.పూ. 2500 నాటి నుండి మీసో అమెరికాలో అడవుల నరికివేతతో సహా మొక్కజొన్న, మనియోక్, పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు, ప్రత్తి మరియు ఇతర పంటలు పండించబడ్డాయి.

గ్యుటెమాలలో ఒక బజో (లోతట్టు ప్రాంతము) యొక్క ఫాల్స్-కలర్ IKONOS ఆకారము.మయ యొక్క అడవులు ఉన్న ప్రాంతాల శిథిలాలు ఇతర పరిసర అడవుల మాదిరి ఎరుపు రంగులో కాకుండా పసుపుపచ్చగా కనిపిస్తాయి. చిట్టడివిలాగా పెరిగిన బజోస్ నీలి-ఆకుపచ్చగా కనిపిస్తుంది.

సమకాలీన మయ ప్రజలు ఇప్పటికీ ఈ సంప్రదాయక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి డైనమిక్ పద్ధతులు అయినప్పటికీ మరియు మారుతున్న జనాభా ఒత్తిడులు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు, వాతావరణ మార్పులు మరియు ఎరువులు మరియు కీటక నాశకాల అందుబాటు మొదలైన పరిస్థితుల వలన మారుతున్నప్పటికీ ఇప్పటికీ వీటిని అనుసరిస్తున్నారు.

పూర్వ-కొలంబియా మయ పునరావిష్కరణ

మిరడార్ బేసిన్, నక్బే వద్ద ఒక మధ్యకాలపు పూర్వక్లాసిక్ రాజభావనపు కట్టడము.

16వ శతాబ్దమునకు చెందన స్పానిష్ క్లర్జీ మరియు పాలకులు ప్రాచీన మయ స్థాలాల గురించి వార్ లిపి మరియు క్యాలెండరు వ్యవస్థల గురించి తెలిసియున్నారు. 16వ శతాబ్దమునకు చెందిన బిషప్ డీగో డే లాండ యొక్క ప్రచురించబడిన రచనలు మరియు 18వ శతాబ్దమునకు చెందిన స్పానిష్ అధికారుల రచనలు 18వ శతాబ్దము చివరికి మయ స్థానముల గురించిన విచారణలకు ఉసిగొల్పాయి.[23] మునుపటి స్పానిష్ పరిశోధనలతో సుపరిచితుడైన యునైటెడ్ స్టేట్స్ యాత్రికుడు మరియు రచయిత అయిన జాన్ లాయిడ్ స్టీఫెన్స్, 1839లో కోపాన్, పాలేన్క్యూ మరియు ఇతర ప్రాంతాలను ఆంగ్ల నిర్మాణశిల్పి మరియు డ్రాఫ్ట్స్ మాన్ అయిన ఫ్రెడరిక్ కాతర్వుడ్ తో కలిసి సందర్శించాడు. శిథిలాలకు సంబంధించి వారు ఇచ్చిన వివరణలు ఆ ప్రాంతాలు మరియు ప్రజలలో బలమైన ఉత్సాహాన్ని రేపాయి మరియు వారు మరొకసారి మీసోఅమెరికా వారసత్వము యొక్క ముఖ్యమైన లంకెగా వారి స్థానాన్ని తిరిగి పొందారు.

అయినప్పటికీ, చాలా ప్రాంతాలలో, మయ శిథిలాల చుట్టూ అడవులు కట్టడాలను కప్పే విధంగా దట్టంగా పెరిగాయి. శిథిలాలను కనుగొనుటకు సహాయపడుటకు, పరిశోధకులు ఉపగ్రహ కాల్పనిక చిత్రాలకు మారారు. కనిపిస్తున్న మరియు సమీపములో-పరారుణ వర్ణం గల స్పెక్ట్రాను ఉపయోగించడము వాటిని కనుగొనుటకు మంచి మార్గము. వాటి సున్నపురాయి నిర్మాణాల కారణంగా, స్మారక చిహ్నాలు శిథిలావస్థకు చేరుకొనేప్పుడు మట్టి యొక్క రసాయన స్వరూపాన్ని ప్రభావితం చేసాయి. తేమ ఇష్టపడు కొన్నిమొక్కలు బతికాయి కాని మిగతావి చనిపోయాయి లేక రంగు మారాయి. సున్నపురాయి శిథిలాల యొక్క ప్రభావాలు ఇప్పటికీ కొన్ని ఉపగ్రహ సెన్సార్లకు కనపడుతున్నాయి.

యుకటాన్ పెనిన్సుల, చియపాస్ (రెండు మెక్సికోలో ఉన్నాయి), గ్యుటెమాల మరియు బెలిజ్ లోని సమకాలీన గ్రామీణ జనాభాలో ఎక్కువ శాతం వారసత్వముగా మరియు భాష పరంగా మయ నాగరికతకు చెందినది.

మయ స్థలాలు

వందల కొద్ది ప్రముఖమైన మయ స్థలాలు మరియు వేలకొద్ది చిన్న స్థలాలు ఉన్నాయి. అతిపెద్దవైనా మరియు చారిత్రాత్మకంగా ఎంతో ముఖ్యమైనవి క్రింద చెప్పబడ్డాయి:

 • కాలక్ముల్
 • కాన్సుయేన్
 • చిచెన్ ఇట్జా
 • కాబా
 • కమల్కాల్చో
 • కోపన్
 • డాస్ పిలాస్
 • కమినల్జుయు
 • ఎల్ మిరడోర్
 • నక్బే
 • నరంజో
 • పాలేన్క్యూ
 • పియేడ్రాస్ నెగ్రాస్
 • క్విరిగువా
 • క్యుమర్కాజ్
 • సీబాల్
 • టికాల్
 • యువక్సాక్టున్
 • ఊక్ష్మల్
 • అక్ష్హ

వీటిని కూడా చూడండి

 • మయ సమాజములో బాల్యము
 • హునక్ చీల్
 • మీసో అమెరికా పిరమిడ్ల జాబితా
 • మరణానికి సంబంధించి మయ అనుష్ఠానాలు
 • మయ ఔషధాలు
 • మయ సంగీతము
 • మయ వస్త్రాలు

సమగ్ర విషయాలు

 1. Coe, Michael D. (1999). The Maya (6th ed.). New York: Dante Reed. p. 31. ISBN 0500280665.
 2. "Radiocarbon chronology for early Maya occupation at Cuello, Belize". Nature.com. 1976-04-15. Retrieved 2010-08-01.
 3. "Maya Archaeological Sites of Belize, Belize History". Ambergriscaye.com. Retrieved 2010-08-01.
 4. ఉదాహరణకు చూడండి, డ్రూ (2004), p.6.
 5. Coe, Michael D. (2002). The Maya (6th ed.). Thames & Hudson. p. 47. ISBN 0500050619.
 6. Robert Port. "History Of Writing And Religion". Cs.indiana.edu. Retrieved 2010-08-01.
 7. Coe, Michael D. (2002). The Maya (6th ed.). Thames & Hudson. pp. 63–64. ISBN 0500050619.
 8. Coe, Michael D. (2002). The Maya (6th ed.). Thames & Hudson. p. 81. ISBN 0500050619.
 9. "Maya Art Return". Retrieved 2006-12-25.
 10. చూడండి కోగ్గిన్స్ (1992).
 11. Coe, Michael D. (2002). The Maya (6th ed.). New York: Thames & Hudson. pp. 151–155. ISBN 0-500-28066-5.
 12. "University of Florida study: Maya politics likely played role in ancient large-game decline, Nov. 2007". News.ufl.edu. 2007-11-08. Retrieved 2010-08-01.
 13. Gill, R. (2000). The Great Maya Droughts. Albuquerque: University of New Mexico Press. ISBN 0826321941. Cite has empty unknown parameter: |coauthors= (help)
 14. Hodell, David A. (1995). "Possible role of climate in the collapse of Classic Maya civilization". Nature. 375 (6530): 391–394. doi:10.1038/375391a0. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite has empty unknown parameter: |month= (help)CS1 maint: ref=harv (link)
 15. లవ్ 2007, p.305. షేరర్ 2006, pp.621, 625.
 16. "ది ఏన్షియంట్ మయ", రాబర్ట్ J. షేరర్, లోవా P. ట్రాక్స్లర్ కంట్రిబ్యూటర్ లోవా P. ట్రాక్స్లర్, p126, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటి ప్రెస్, 2006, ISBN 0-8047-4817-9
 17. రెండు పదాలు పురాతన కొలోనియల్ గ్రంధాలలో కనిపిస్తాయి ( పపెలేస్ డే పక్స్బోలోన్ తో సహా). వీటిని అజ్టేక్ కు పర్యాయాలుగా ఉపయోగిస్తారు మరియు సర్వోత్తమ పాలకులు మరియు వారి జాగీరులు - ట్లాహ్తోవాని మరియు ట్లాహ్తోకాయోత్ల్ వంటి వాట్కి స్పానిష్ పదాలు, రే లేక మాజెస్టాడ్ మరియు రీనో, సేరిఒర్ మరియు సేరిరో లేక దోమినియో.
 18. Saturno, WA (2006). "Early Maya writing at San Bartolo, Guatemala". Science. 311 (5765): 1281–3. doi:10.1126/science.1121745. PMID 16400112. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Unknown parameter |month= ignored (help)CS1 maint: ref=harv (link)
 19. స్కిడ్మోరే (2006).
 20. "Earliest Maya Writing Found in Guatemala, Researchers Say". NationalGeographic.com. Retrieved 2007-06-06.ఆ తరువాతి సంవత్సరములో 62 గిల్ఫ్స్ కలిగిన ఒక బిళ్ళపై పరిశోధన యొక్క ప్రచురణ జరిగింది. ఇది శాన్ లోరెంజో టెనోచిటిట్లాన్ యొక్క ఒల్మేక్ కేంద్రము వద్ద దొరికింది. ఇది క్రీ.పూ.900 నాటిదని అసోసియేషన్ ద్వారా నిర్ణయించబడింది. దీనితో ప్యుటేటివ్ ఒల్మేక్ లిపి (క్లాసికల్ బ్లాక్ చూడండి) మేసోఅమేరికా యొక్క అతి పురాతనమైన లిపిగా మారింది; చోదండి స్కిడ్మోరే (2006, పస్సిం )
 21. మిల్లర్ మరియు టాబే (1993, p.131)
 22. అన్వయించబడిన ప్రకారముగా Krupp 1999.
 23. డిమారేస్ట్, ఆర్థర్. ప్రాచీన మయ: రెయిన్ ఫారెస్ట్ నాగరికత యొక్క ఆవిర్భావము మరియు పతనము. కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ప్రెస్, 2004 pg. 32-33.

సూచనలు

మరింత పఠనం కోసం

 • Braswell, Geoffrey E. (2003). The Maya and Teotihuacan: Reinterpreting Early Classic Interaction. Austin, TX: University of Texas Press. ISBN 0292709145. OCLC 49936017.
 • Christie, Jessica Joyce (2003). Maya Palaces and Elite Residences: An Interdisciplinary Approach. Austin, TX: University of Texas Press. ISBN 0292712448. OCLC 50630511.
 • Demarest, Arthur Andrew (2004). Ancient Maya: The Rise and Fall of a Rainforest Civilization. Cambridge, England; New York, NY: Cambridge University Press. ISBN 0521592240. OCLC 51438896.
 • Demarest, Arthur Andrew, Prudence M. Rice, and Don Stephen Rice (2004). The Terminal Classic in the Maya Lowlands: Collapse, Transition, and Transformation. Boulder, CO: University Press of Colorado. ISBN 0870817396. OCLC 52311867.
 • Garber, James (2004). The Ancient Maya of the Belize Valley: Half a Century of Archaeological Research. Gainesville, FL: University Press of Florida. ISBN 0813026857. OCLC 52334723.
 • Herring, Adam (2005). Art and Writing in the Maya cities, AD 600-800: A Poetics of Line. Cambridge, England; New York, NY: Cambridge University Press. ISBN 0521842468. OCLC 56834579.
 • Lohse, Jon C. and Fred Valdez (2004). Ancient Maya Commoners. Austin, TX: University of Texas Press. ISBN 0292705719. OCLC 54529926.
 • Lucero, Lisa Joyce (2006). Water and Ritual: The Rise and Fall of Classic Maya Rulers. Austin, TX: University of Texas Press. ISBN 0292709994. OCLC 61731425.
 • McKillop, Heather Irene (2005). In Search of Maya Sea Traders. College Station, TX: Texas A & M University Press. ISBN 1585443891. OCLC 55145823.
 • McKillop, Heather Irene (2002). Salt: White Gold of the Ancient Maya. Gainesville, FL: University Press of Florida. ISBN 0813025117. OCLC 48893025.
 • McNeil, Cameron L. (2006). Chocolate in Mesoamerica: A Cultural History of Cacao. Gainesville, FL: University Press of Florida. ISBN 0813029538. OCLC 63245604.
 • Rice, Prudence M. (2004). Maya Political Science: Time, Astronomy, and the Cosmos (1st ed.). Austin, TX: University of Texas Press. ISBN 0292702612. OCLC 54753496.
 • Sharer, Robert J. and Loa P. Traxler (2006). The ancient Maya (6th ed.). Stanford, CA: Stanford University Press. ISBN 0804748160. OCLC 57577446.
 • Tiesler, Vera and Andrea Cucina (2006). Janaab' Pakal of Palenque: Reconstructing the Life and Death of a Maya Ruler. Tucson, AZ: University of Arizona Press. ISBN 0816525102. OCLC 62593473.
 • "Painted Metaphors: Pottery and Politics of the Ancient Maya". University of Pennsylvania Almanac. University of Pennsylvania. 4/7/2009. Retrieved 2009-06-17. Check date values in: |date= (help)

బాహ్య లింకులు