"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మర్వన్ ఆటపట్టు

From tewiki
Jump to navigation Jump to search
Marvan Atapattu
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Marvan Samson Atapattu
జననం (1970-11-22) 22 నవంబరు 1970 (వయస్సు 50)
Kalutara, Ceylon
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right arm leg spin
పాత్ర Opening batsman
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Sri Lanka
టెస్టు అరంగ్రేటం(cap 46) 23 November 1990 v India
చివరి టెస్టు 16 November 2007 v Australia
వన్డే లలో ప్రవేశం(cap 59) 1 December 1990 v India
చివరి వన్డే 17 February 2007 v India
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1990/91–2006/07 Sinhalese Sports Club
2007–2008 Delhi Giants
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC List A
మ్యాచ్‌లు 90 268 228 329
సాధించిన పరుగులు 5,502 8,529 14,591 10,802
బ్యాటింగ్ సగటు 39.02 37.57 48.79 39.42
100s/50s 16/17 11/59 47/53 18/71
ఉత్తమ స్కోరు 249 132* 253* 132*
బాల్స్ వేసినవి 48 51 1,302 81
వికెట్లు 1 0 19 1
బౌలింగ్ సగటు 24.00 36.42 64.00
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 n/a
ఉత్తమ బౌలింగ్ 1/9 0/4 3/19 1/12
క్యాచులు/స్టంపింగులు 58/– 70/– 150/– 91/–
Source: CricketArchive, 27 September 2008

మర్వన్ ఆటపట్టు (Marvan Samson Atapattu) 1970, నవంబర్ 22న శ్రీలంక లోని కలుతరలో జన్మించాడు. ఇతడు శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. ఇండియన్ క్రికెట్ లీగ్లో ఢిల్లీ జెట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిఛాడు.

క్రీడా జీవితం

ఆతపట్టు నవంబర్ 1990లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసాడు. ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ఆటతీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. తొలి 6 ఇన్నింగ్సులలో 5 డకౌట్లు మరో ఇన్నింగ్సులో 1 పరుగు సాధించాడు. దేశవాళి పోటీలలో టన్నులకొద్ది పరుగులు సాధించే ఆటపట్టు ఆ తరువాత 11 ఇన్నింగ్సులలో అత్యధిక స్కోరు 29 మించలేకపోయాడు. అతని 10వ టెస్టులో భారత్ పై ఎట్టకేలకు తొలి సెంచరీని నమోదుచేశాడు. అప్పటికి టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసి 7 సంవత్సరాలు కావడం గమనార్హం. 22 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి డకౌట్లలో, పేరౌట్లలో (రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే ఔట్ కావడం) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు!

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

క్రమక్రమంగా పట్టు సాధించి మొత్తంపై 89 టెస్టులలో 5502 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 249 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

ఆటపట్టు 268 వన్డేలలో 37.57 సగటుతో 8529 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 59 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 132 (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్

ఆటపట్టు 4 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా శ్రీలంక విజయం సాధించిన 1996లో, ఆ తరువాత 1999, 2003, 2007లలో కూడా శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.