"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మల్లాది సూర్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search

మల్లాది సూర్యనారాయణ రంగస్థల రచయిత, దర్శకుడు, నటుడు, కళాకారుల సేవ చేస్తున్న వ్యక్తి. ఆయన రంగస్థలంపై నటునిగా, దర్శకరచయితగా పలు నాటకాలు వ్రాసి ఆడి పేరుప్రతిష్టలు పొందారు. జీవితంలోని తర్వాతి దశలో రంగస్థలంపై ఓ వెలుగు వెలిగిన కళాకారులు దీనాతిదీనంగా జీవించడం చూసి వారికోసం నటరాజ కళాపీఠం అనే సంస్థను నెలకొల్పి వారి జీవితాల్లో సాంత్వన చేకూరుస్తున్నారు. అవిచ్ఛిన్నంగా 300 నెలలకు పైగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని సూర్యనారాయణ దాతల సహాయంతో ఒంటిచేతిమీదుగా నడిపిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

మల్లాది సూర్యనారాయణ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో పనిచేసి రిటైర్ అయ్యారు.

నాటకరంగంలో

మల్లాది సూర్యనారాయణ రంగస్థలంపై దర్శకునిగా, రచయితగానే కాక నటునిగా కూడా ప్రసిద్ధిపొందారు. ఆయన వ్రాసిన పలు నాటకాలు పరిషత్తుపోటీల్లో బహుమతులు సాధించాయి.

మూలాలు

ఇతర లింకులు