"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మల్లినాథుడు

From tewiki
Jump to navigation Jump to search

మల్లినాథ సూరి లేదా మల్లినాథుడు ఎంతో ప్రసిద్ధిగాంచిన తెలుగు కవి, సంస్కృత విమర్శకుడు. అతను విమర్శకుడిగా బాగా పేరు పొందాడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాలకూ అతడు రాసిన భాష్యాలు ఆయనకి పేరు తెచ్చి పెట్టాయి. మహామహోపాధ్యాయ, వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదులు పొందిన వ్యక్తి ఈయన. ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని తెలుస్తోంది.

తొలినాళ్ళు

మల్లినాథుడి ఇంటిపేరు కొలచాల. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే వికారాలున్నాయి.[1] కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామం మెదక్ జిల్లాకేంద్రమైన మెదక్ కుు 17 కిలోమీటర్ల దూరంలో

ఉంది. కాకతీయుల పాలన సమాప్తమయ్యాక కొలచెమల వారు సింగభూపాలుని రాజధాని రాచకొండకు వలస వెళ్ళారు. సంజీవని రాసిన గద్యాల నుండి తైవచ్చేదేమిటంటే సింగభూపాలుడు మల్లినాథుడిని మహామహోపాధ్యాయునిగా, మల్లినాథుని కొడుకును మహోపాధ్యాయుని బిరుదుతో సత్కరించాడు.

కృతులు

మల్లినాథుడు వ్యాఖ్యానకర్త అయినప్పటికీని ఎన్నో సృజనాత్మక కృతులు కూడా చేసాడు. ఈయన రాసిన సంజీవని అనే మేఘసందేశ భాష్యం మిక్కిలి ప్రసిద్ధమయినది. [2]అతను కవి అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ సంస్కృత సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినవారికి ఇతను సుపరిచితుడే.

వ్యాఖ్యానాలు

ఈ కింది తెలిపిన జాబితా సంస్కృత మహాకావ్యాలపై మల్లినాథుడు రాసిన వ్యాఖ్యానాల పేర్లను వివరిస్తుంది.

 1. సంజీవని - కాళిదాసుని రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం పైన
 2. ఘంటాపథం - భారవి కిరాతార్జునీయం పై
 3. సర్వంకశ (?) - మాఘుని శిశుపాలవధ పై
 4. జివాతు - శ్రీహర్షుని నైషధం పై
 5. సర్వపఠీనా - భట్టకావ్యం పై

శాస్త్రీయ కృతులపై ఈయన రాసిన వ్యాఖ్యానాలు :

 1. తరల - విద్యాధరుని అలంకార శాస్త్రం పై
 2. నిశాంతక - వరదరాజుని తార్కికరక్ష టీకా పై

సృజనాత్మక కృతులు

 1. రఘువీరచరితం
 2. వైశ్యవంశ సుధాకరం
 3. ఉదార కావ్యం

మల్లినాథుడి వ్యాఖ్యానం ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరాఠీలో వ్యాఖ్యానించడానికి వాడే పదం మల్లినాథి.

మూలములు

 1. పీజీ లాల్యె రాసిన మల్లినాథ, పుట 13
 2. మేఘసందేశ: ఎన్ ఎసెస్మెంట్ ఫ్రొం ది సౌత్, పుట. 24

బయటి లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).