"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మహతి

From tewiki
Jump to navigation Jump to search
మహతి
రకముమాస పత్రిక
ఫార్మాటురాయల్ సైజు

యాజమాన్యం:
ప్రచురణకర్త:వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య
సంపాదకులు:వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య
స్థాపన1938, ఏప్రిల్ 15/ తెనాలి
వెలవిడిపత్రిక 2 అణాలు , సంవత్సర చందా 2/- రూ.
ప్రధాన కేంద్రముతెనాలి

ఈ మాస పత్రిక తెనాలి నుండి వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య సంపాదకుడుగా, ప్రచురణకర్తగా వెలువడింది. 1938లో మొదటి సంచిక వెలుగు చూసింది. ఈ పత్రిక జాతీయోద్యమానికి బాసటగా నిలిచింది. ఈ పత్రికలో కథలు, కవితలు, పద్యాలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. విమర్శవీధి పేరుతో పుస్తకసమీక్షలు ప్రచురించారు.

ఆశయం

ప్రపంచ దృష్టినంతటిని ఉవ్వెత్తుగ ఆకర్షించుచు లోకవృత్తమును క్షణక్షణము తారుమారు చేయుచున్న వర్తమాన రాజకీయ వ్యవస్థకు జాతీయ నిత్యజీవనమునకు సంబంధించు సాంఘిక నైతికాది చర్చా సందర్భములకును, కళాపోషకములయి మానవహృదయ సంస్కారమునకు దోహదమొసగు కథానికలకును, ఆదర్శములగు చరిత్రాంశములకు మా 'మహతి' సేవాంజలి సమర్పించుచుండును అని తొలిసంచికలో 'ప్రాస్తావిక'లో ఈ పత్రిక ఆశయాన్ని ప్రస్తావించారు[1].

విషయాలు

ఈ పత్రిక రెండవ సంపుటము రెండవ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి[2].

మూలాలు

  1. [1]భారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహతి సంచిక