మహబూబాబాదు జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

మహబూబాబాదు జిల్లా

2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా,బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, నర్స్ంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలగా ఏర్పడ్డాయి.[2]

<mapframe>: The JSON content is not valid GeoJSON+simplestyle

జిల్లాలోని మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2017-11-09.

వెలుపలి లింకులు