"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి

From tewiki
Jump to navigation Jump to search

ఇది సినీనటి సావిత్రి జీవితం గురించి వ్రాసిన పుస్తకం.మూస:ఇతరవ్యాసాలు

మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి
175px
మహానటి సావిత్రి పుస్తకం ముఖ చిత్రం
కృతికర్త: పల్లవి
అంకితం: కె.ఈ.వరప్రసాద్ రెడ్డి, వసంత దంపతులు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: మహానటి సావిత్రి జీవిత చరిత్ర
ప్రచురణ: కళాజ్యోతి ప్రాసెస్ ప్రై. లిమిటెడ్
విడుదల: ఆగస్టు 2008
పేజీలు: 358
ముద్రణ: కళాజ్యోతి ప్రాసెస్ ప్రై. లిమిటెడ్
ప్రతులకు: పల్లవి, హెచ్ 96, మధురానగర్, హైదరాబాద్

మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి ప్రముఖ సినీ నటీమణి సావిత్రి జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకము. దీని రచయిత పల్లవి. ఈ పుస్తకాన్ని 20 ఆగష్టు 2007 తేదీన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తొలి ప్రతిని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి అందజేసి విడుదలచేశాడు. వెలువడిన రెండు సంవత్సరాల కొద్ది కాలంలోనే మూడు ముద్రణలు పూర్తిచేయడం తెలుగు ప్రజలలో సావిత్రికు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి తన కృతిని కె.ఈ.వరప్రసాద్ రెడ్డి, వసంత దంపతులకు అంకితం ఇచ్చింది.[1]

ముందుమాట

"నేత్రాభినయంతోనే జనస్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామని ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. గొప్ప భావుకవుల, భాసాది నాటకకర్తల ఊహకు సైతం అందనంత 'మెలాంకలిక్ డ్రామా'?" - వరప్రసాద్ మాటల్లో.

ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన "దేవత"లో ఆమె నటన వర్ణనాతీతం..

రచయిత్రి

మహానటి సావిత్రి మన తెలుగు జాతి సంపద. ఈ తరం వారికి, ముందు తరాలకు ఈ అమూల్యమైన సంపదను పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేసిన పల్లవి చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. సావిత్రి అభిమానిగా పల్లవి అనుపమానమైన కృషి మరెన్నో ఇలాంటి పుస్తకాలకు మార్గదర్శకం కావాలి. తెలుగు దేశమంతా విస్తరించిన సావిత్రి అభిమానులు పల్లవికి ఋణపడి వుంటారు.

ఎందరో అభిమానులు ఈ పుస్తకం చదివి గర్వపడ్దారు, చివరి రోజులు గుర్తుచేసుకొని చలించిపోయారు. ఇలా తెలుగువారందరి హృదయాల్లో, వారి ఆత్మీయురాలిగా ఆమె పట్ల ప్రేమ, గౌరవం నిండుగా ఉన్నాయని మరొకసారి నిరూపించినది ఈ పుస్తకం.

మూలాలు

  1. "Drama in real life". The Hans India. Retrieved 2018-05-15.

బయటి లింకులు