"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మహిషమర్దని దేవాలయం

From tewiki
Jump to navigation Jump to search
మహిషమర్దని దేవాలయ సముదాయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:బాలేశ్వర్
ప్రదేశం:Shergarh
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహిషమర్దని
ప్రధాన పండుగలు:నవరాత్రి , దసరా

మహిషమర్దని దేవాలయం సముదాయం ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలోని "బాలాసోర్ పాండి చౌక్"కు 2.5 కి.మీ దూరంలో గల షేర్ ఘర్ లో ఉంది. పురావస్తు సర్వేలో అనేక శిథిల చిత్రాలు భద్రపరచబడ్డాయి.

ఆచారాలు

ఇందులో ప్రస్తుత పూజారులు పండా బ్రాహ్మణులకు చెందినవారు.ఈ ఆలయం ఒక సేనాపతి కుటుంబం పోషణలో ఉంది. ఇందులో దుర్గాదేవి ఎనిమిది చేతులతో మహిషాసురుడిని వధించునట్లు ఉంది. ఈ సముదాయంలో శివుని దేవాలయం కూడా ఉంది.

వాస్తుశాస్త్రం

ఈ దేవాలయం 11 వ శతాబ్దానికి చెందినది. ఇది సోమవంశీ క్షత్రియుల కాలం నాటిది. ఈ దేవాలయం 19 వ శతాబ్దంలో పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయ నిర్మాణానికి కంకరను ఉపయోగించారు. శిల్పాల నిర్మాణానికి క్లోరైట్ ఉపయోగించారు. ఈ దేవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయంలో సూర్యుడు, యితర దేవతలైన గణేశుడు, కార్తికేయుడు చిత్రాలు కూడా కనిపిస్తాయి. .

మూలాలు

ఇతర లింకులు