"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మానవ శరీరము

From tewiki
Jump to navigation Jump to search

మానవ శరీరము బాహ్యంగా కనిపించే నిర్మాణము. మానవుని శరీరములో తల, మెడ, మొండెం, రెండు కాళ్ళు, రెండు చేతులు ఉంటాయి. సరాసరి మానవుని పొడవు 1.6 మీటర్లు (5.6 అడుగులు). ఇది వారివారి జన్యువులమీద ఆధారపడి ఉంటుంది.

మానవ శరీరము వివిధరకాలైన వ్యవస్థలు (systems), అంగాలు (organs), కణజాలాలు (tissues), కణాలు (cells) తో చేయబడివుంది. శరీర నిర్మాణ శాస్త్రము (anatomy) వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. మానవ శరీరము పనిచేసే విధానాల్ని తెలియజేసేది శరీర ధర్మ శాస్త్రము (physiology).

జీవమున్నంత వరకు మానవున్ని 'శరీరము' అని, మరణము తర్వాత 'శవము' అని అంటారు.

మానవ శరీరములోని వ్యవస్థలు

మానవ శరీరములోని భాగాలు

తల, మెడ

వీపు (వెనుకభాగం)

ఛాతీ

ఉదరము

దస్త్రం:Digestive system showing bile duct-te.png
కాలేయము, పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము

కటి

కాళ్ళు, చేతులు

మానవ శరీరములోని కణజాలాలు

ఉపకళా కణజాలాలు

 • సరళ ఉపకళా కణజాలాలు
  • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
  • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
  • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
  • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
  • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
 • సంయుక్త ఉపకళా కణజాలాలు
  • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
  • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
  • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
  • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
  • అవస్థాంతర ఉపకళా కణజాలాలు

సంయోజక లేదా ఆధార కణజాలాలు

 • వాస్తవిక సంయోజక కణజాలాలు
  • మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
   • అరియోలర్ సంయోజక కణజాలాలు
   • జాలక సంయోజక కణజాలాలు
   • జెల్లివంటి సంయోజక కణజాలాలు
   • అడిపోస్ సంయోజక కణజాలాలు
  • తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
   • తెల్లని తంతు సంయోజక కణజాలాలు
   • పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు

అస్థి లేదా ఆధార కణజాలాలు

 • మృదులాస్థి కణజాలాలు
  • కచాభ మృదులాస్థి
  • స్థితిస్థాపక మృదులాస్థి
  • తంతుయుత మృదులాస్థి
 • అస్థి కణజాలాలు (ఎముక)
  • మృదులాస్థి ఎముకలు
  • త్వచాస్థి ఎముకలు
   • స్పంజికల వంటి ఎముకలు
   • చిక్కని ఎముకలు

ద్రవ కణజాలాలు

కండర కణజాలాలు

 • అస్థి లేదా నియంత్రిత చారల కండరాలు
 • అంతరాంగ లేదా అనియంత్రిత నునుపు కండరాలు
 • హృదయ లేదా అనియంత్రిత చారల కండరాలు

నాడీ కణజాలాలు