"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మానేరు నది

From tewiki
Jump to navigation Jump to search
మానేరు రిజర్వాయరు

మానేరు నది లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని గోదావరి నదికి ఉపనది[1]. మానేరునది సిరిసిల్ల డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై గంభీరావుపేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్ లను మరియు కరీంనగర్ వద్ద దిగువ మానేరు డ్యామ్ నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది.[2] దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మూలాలు

  1. "Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, "... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."
  2. "నదులు - కరీంనగర్".

Coordinates: 18°41′N 79°49′E / 18.683°N 79.817°E / 18.683; 79.817 Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).