"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మాన్సా
లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist
Mansa district ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ | |
---|---|
Country | ![]() |
State | Punjab |
Headquarters | Mansa |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,174 km2 (839 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,68,808 |
• సాంద్రత | 350/km2 (900/sq mi) |
Languages | |
• Official | Punjabi |
కాలమానం | UTC+5:30 (IST) |
ISO 3166 కోడ్ | IN-PB |
వాహనాల నమోదు కోడ్ | PB-31 |
Sex ratio | 1000/880 ♂/♀ |
Literacy | 63% |
జాలస్థలి | www |
పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో మాన్సా జిల్లా (పంజాబీ - ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ ) ఒకటి. జిల్లాలో 2 తాలూకాలు ఉన్నాయి.[1] బుధ్లడ, మాన్సా ఉన్నాయి. 5 డాఎవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి. భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్ మరియు సర్దుల్గర్. 3 ఉపతాలూకాలు ఉన్నాయి.
Contents
భౌగోళికం

భౌగోళికంగా జిల్లా త్రికోణాకారంగా ఉంటుంది. జిల్లా వాయవ్య సరిహద్దులో భతిండా జిల్లా, ఈశాన్య సరిహద్దులో సంగ్రూర్ జిల్లా మరియు దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రం ఉంది. రైలు ఇది భతిండా- జింద్ - ఢిల్లీ రైలు మార్గంలో ఉంది. అలాగే అలాగే బర్నాలా- సర్దుల్గర్- సిర్సా (హర్యానా) రహదారి మార్గంలో ఉంది. జిల్లా 3 తాలూకాలుగా ఉన్నాయి: బుధ్లడా, మాన్సా మరియు సత్దిల్గర్. జిల్లాలోని సర్దుల్గర్ తాలూకా గుండా ఘగ్గర్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పంజాబీ అధికార భాషగా ఉంది.
చరిత్ర
మాన్సా జిల్లా మునుపు ఫుకియా సిఖ్ సామ్రాజ్యం (1722- 1948) లో భాగంగా ఉంటూ వచ్చింది తరువాత కైథల్ సిఖ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఈ జిల్లా 1992 ఏప్రిల్ 13 న రూపొందించబడింది. భతిండా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. ఈ పట్టణాన్ని భాయి గురుదాస్ స్థాపించాడని భావిస్తున్నారు. భాయి గురుదాస్ ధింగర్లో నివసించే వాడు. ఆయన మాన్సాలో నివసిస్తున్న ధైల్వాల్ జాట్ సిఖ్ కన్యను వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళాడానికి ఈ ఊరికి వచ్చిన సమయంలో ఆయన అత్తమామలు భార్యను పంపడానికి నిరాకరించారు. తరువాత గురుదాస్ వారింటి ముందు తపసు చేయడం ఆరంభించాడు. తరువాత కొంతకాలానికి అత్తమామలు భార్యను పంపడానికి అంగీకరించినా గురుదాస్ భార్యను నిరాకరించి తన తపసు నిలుపలేదు. ఈ సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ సమాధి నిర్మించి ప్రతిసంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లాడూలు మరియు గురు సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ సమాధి దఋసించడానికి అధికంగా వస్తుంటారు. 1952 నుండి ఇక్కడ నగరపాలిత వ్యవస్థ ఆరంభం అయింది.
- నగరంలో రెండు కాలేజీలు ఉన్నాయి: నెహ్రూ మెమోరియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ మరియు ఎస్.డి కన్య మహావిద్యాలయ కాలేజ్.
- 3 సీనియర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి.
- 90 పాఠశాలలు ఉన్నాయి.
- 1 మిడిల్ స్కూల్
- 1 ప్రైమరీ స్కూల్ ఉంది.
- జిల్లా గ్రంథాలయం ఉంది.
- 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.: పి.ఎస్ సిటీ మరియు పి.ఎస్ సాదర్
- ఒక రైల్వేస్టేషను ఉంది.
పురాతన కాలం
ఈ ప్రాతంలో ఒకప్పుడు సింధూనాగరికత ఉండేది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పురాతన కాలంలో హరప్పా మరియు మొహంజుదారో సంస్కృతి ఉన్నట్లు పురాతత్వ పరిశోధనలు ౠజువు చేస్తున్నాయి.
[2][3] ఈ ప్రాంతం 3 సంస్కృతికి చెంది ఉంది : ప్రి హరప్పా, హరప్పా మరియు లేట్ హరప్పా సంస్కృతులకు చెంది ఉంది.
పూర్వ హరప్పన్
- అలిపూర్ మంద్రన్
- బగ్లియన్ డీ థెన్
- బారెన్
- చోటి మానస
- గుర్ని కలాన్
- హాసంపూర్
- హిర్కె
- లక్ష్మీర్వాలా
- నైవాన్ తెహ్
- హరప్పా కాలం
- అలి డా తెహ్
- అలిపూర్ మంద్రన్
- బగ్లియన్ డీ తెహ్
- చోటి మానస
- డాలేవన్
- గుర్ని కలాన్
- హాసన్పూర్
- హిర్కెబ్
- కర్నపురా
- లక్ష్మీర్ వాలా
- వాలా
- లలియన్ వాలి
- నైవాలా తెహ్
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 7,68,808, [4] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 489వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 350 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.62%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 880:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 62.8%[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
వ్యవసాయం మరియు పరిశ్రమలు
మాన్సా జిల్లా పంజాబు కాటన్ బెల్టులో భాగంగా ఉంది. అందువలన ఈ ప్రాంతం " ఏరియా ఆఫ్ వైట్ గోల్డ్ " (తెల్ల బంగారు ప్రాంతం) గా గుర్యించబడుతుంది. జిల్లాకు వ్యవసాయభూములు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రంలోని అతిపెద్ద " థర్మల్ పవర్ స్టేషను " ఉంది. ఈ థర్మల్ పవర్ స్టేషను నుండి 1980 మె.వా విద్యుత్తు ఉత్పట్టి ఔతుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం అరుదుగా నగర ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి.
ప్రధాన నగరాలు మరియు పట్టణాలు
బుధ్లడ
ఖత్లి కులానికి చెందిన బుధ మరియు లఢ అనే అన్నదమ్ములు నివసించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి బిధ్లడ అనే పేరు వచ్చింది. ఇది ఢిల్లీ మరియు భతిండా రైల్వే మార్గంలో ఉంది. ఇది మిలటరీ ఉద్యోగుల నియామక కేంద్రంగానూ మరియు ముఖ్యమైన వ్యాపార కేంద్రంగానూ గుర్తించబడుతుంది.
ప్రముఖ వ్యక్తులు
- * కెప్టెన్ కె.కె గౌర్
- * గవీ చాహల్ -ఏక్టర్
- * డీప్ ధిల్లాన్ -గాయకుడు
- * కుల్విండర్ బిల్లా - గాయకుడు
- * లాభ్ హీరా - గాయకుడు
- * జైస్మీన్ జస్సి -
మూలాలు
- ↑ "Gurpreet gets Mansa seat". News in English. Ludhiana. The Tribune. January 10, 2012. Retrieved July 17, 2012.
- ↑ Lal, B.B; Gupta, S.P. (1984) [1981-82]. Frontier of Indus Valley Civilization. Delhi. Cite has empty unknown parameters:
|month=
and|coauthors=
(help);|access-date=
requires|url=
(help) - ↑ "Ancient history of Mansa district". B.B. Lal and S.P. Gupta. www.punjabrevenue.nic.in. Retrieved 23 January 2012.
- ↑ 4.0 4.1 "District Census 2011". www.census2011.co.in. 2011. Retrieved 22 January 2012.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Alaska 710,231
line feed character in|quote=
at position 7 (help)
వెలుపలి లింకులు
![]() |
Wikimedia Commons has media related to [[commons:Category:{{#property:P373}}|మాన్సా]]. |